Suryaa.co.in

Andhra Pradesh

40 ఇండస్ట్రీ ఉత్తరాంధ్రకు ఏం చేశాడు..?

– ఉత్తరాంధ్రను తొక్కేసింది బాబు కాదా..?
– పోలవరం, సుజల స్రవంతి గురించి మాట్లాడే హక్కు టీడీపీకి ఎక్కడిది..?
– 2018 నాటికి పోలవరం ఎందుకు పూర్తి చేయలేకపోయారో వెళ్ళి మీ తండ్రి(బాబు)ని అడుగు లోకేష్..!
– లోకేష్ భాష మార్చుకుని, క్షమాపణలు చెప్పకపోతే.. అదే భాషలో బుద్ధి చెబుతాం..
-తెలుగు దొంగల పార్టీ అధ్యక్షుడు గంగిరెద్దులా రంకెలా..?
-ఉద్దానం కిడ్నీ సమస్యకు సీఎం శ్రీ జగన్ శాశ్వత పరిష్కారం
-వందేళ్ళ రాష్ట్ర చరిత్రలో 11 మెడికల్ కాలేజీలు ఉంటే.. శ్రీ జగన్ 16 మెడికల్ కాలేజీలకు శ్రీకారం
-హుద్ హుద్ ని మీరు భయపెట్టారా..? బాబు బస్సులో పడుకుని లక్ష ఎకరాల రెవెన్యూ రికార్డులు మాయం చేశారు
-విశాఖ బీచ్ లో బికినీ షోలు పెట్టి ఉత్తరాంధ్ర సంస్కృతిని దెబ్బతీయాలని చూసింది మీరు కాదా..?
ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందకుండా తొక్కేసింది 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు కాదా.. అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రశ్నించారు. చంద్రబాబు 40 ఏళ్ళ రాజకీయ చరిత్రలో చేయలేనిది.. జగన్ మోహన్ రెడ్డిగారు ముఖ్యమంత్రి అయిన రెండున్నరేళ్ళలోనే ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎన్నో చర్యలు చేపట్టారని దువ్వాడ వివరించారు. ఉద్దానం కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారని అన్నారు. వందేళ్ళ రాష్ట్ర చరిత్రలో కేవలం 11 మెడికల్ కాలేజీలు ఉంటే.. జగన్ మోహన్ రెడ్డిగారు ఒక్క బటన్ నొక్కి కొత్తగా 16 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారని తెలిపారు.దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే..
అద్భుతమైన పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారిని ప్రజలంతా వేనోళ్ల కీర్తిస్తున్నారు. ఉత్తరాంధ్రలో జరుగుతున్న పరిణామాలు, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు, తెలుగు దొంగల పార్టీ నేతలకు హఠాత్తుగా ఉత్తరాంధ్ర అభివృద్ధి గుర్తుకురావడం హాస్యాస్పదంగా ఉంది. ఇక తెలుగు దొంగల పార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షుడు రెండున్నరేళ్లు నిద్రపోయి ఇప్పుడు గంగిరెద్దులా రంకెలు వేస్తున్నాడు.
జగనన్న తన సుదీర్ఘ పాదయాత్రలో ఉత్తరాంధ్రలో ప్రధాన కేంద్రం అయిన శ్రీకాకుళం జిల్లాలో చాలా సమస్యలను చూశారు. ఉద్దానంలో సుమారు 70వేల మంది కిడ్నీ రోగులు ఉన్నారు. ఆవ్యాధితో పిట్టలు రాలినట్లు ప్రాణాలు కోల్పోతుంటే దాన్ని చూసి చలించిపోయిన జగన్‌ మోహన్‌ రెడ్డిగారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఉద్దాన ప్రజలకు మంచినీటిని అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సుమారు రూ.750 కోట్లతో హిరమండలం రిజర్వాయర్‌ నుంచి తాగునీటిని అందిస్తే, ఈ సమస్య నుంచి ఉద్దాన ప్రజలు బయటపడతారని యుద్ధ ప్రాతిపదికన పనులు చేయిస్తున్నారు.
– అలాగే పలాసలో డయాలసిస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు కిడ్నీ సేఫ్టీ ఆస్పత్రిని, 250 పడకలతో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.
– వంశధార, నాగావళి అనుసంధానం కోసం ఉద్దేశించిన కాల్వ పనులను కూడా ఈ ప్రభుత్వం పూర్తిచేస్తోంది.
– అలాగే ఏపీ-ఒడిశా సరిహద్దులో నేరడి బ్యారేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నారు.
– 40 ఏళ్ల ఇండస్ట్రీ అన్న చంద్రబాబు భావనపాడు పోర్టు గురించి ఏ ఒక్కరోజు ఎందుకు మాట్లాడలేదు?
– ముఖ్యమంత్రి జగన్‌గారు దీనికి శ్రీకారం చుడుతూ, ఫేజ్ -1లో రూ. 4,361 వేల కోట్లు ఖర్చు చేస్తూ భావనపాడు పోర్టును 30 నెలల్లోనే నిర్మాణం చేయాలని భావిస్తున్నారు. త్వరలో పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ అంశాలన్నింటినీ ఉత్తరాంధ్ర ప్రజలు గమనిస్తున్నారు.
– పూడిమడకలో ఒక ఫిషింగ్‌ హార్బర్‌, అలాగే శ్రీకాకుళం జిల్లాలో బుడగట్లపాలెంలో మరో ఫిషింగ్‌ హార్బర్‌. ఇవన్నీ చరిత్రాత్మక నిర్ణయాలు.
– టీడీపీ హయంలో భోగాపురం విమానాశ్రమం అంటూ కాలయాపన చేసింది మీరు కాదా? భూసేకరణ అన్నారు జరిగిందా? అది కూడా కాలయాపనే చేశారు. అదే జగనన్న భూసేకరణ పూర్తి చేసి విమానాశ్రయ పనులు ప్రారంభిస్తున్నారు. భోగాపురం నుంచి భీమిలీ వరకూ రూ. 1400 కోట్లతో 6 లైన్ల విశాఖ కారిడార్‌ను ఏర్పాటు చేయబోతున్నారు.
– రాష్ట్ర చరిత్రలో ఆంధ్రా యూనివర్శిటీ పరిధిలో 1923లో ఒక మెడికల్‌ కాలేజీ వచ్చింది. వందేళ్ళ ఏళ్ల ఏపీ రాష్ట్ర చరిత్రలో కేవలం 11 మెడికల్‌ కాలేజీలే ఉన్నాయి. అదే అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌గారు ఒక్క మీట నొక్కి16 కొత్త మెడికల్‌ కాలేజీలను ప్రారంభిస్తే… మా ఉత్తరాంధ్రకు రెండు మెడికల్‌ కాలేజీలు రావడం చరిత్రగా చెప్పుకోవచ్చు. అనకాపల్లి, పాడేరులో మెడికల్‌ కాలేజీలు రావడం ఒక చరిత్రగా చెప్పుకోవచ్చు.
మా ఉత్తరాంధ్ర ప్రాంతానికి గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు వస్తే గంటో, ఒకరోజో ఉండివెళ్ళేవారు. అదే జగన్‌ మోహన్‌ రెడ్డిగారు ఉత్తరాంధ్రను భారతదేశ చరిత్రలో నిలిపిలా విశాఖను పరిపాలనా రాజధానిని ప్రకటించి, ఈ ప్రాంతానికి అగ్రతాంబూలం వేశారు. జగనన్న ఘనతను మా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు ఎప్పుడూ మర్చిపోరు. చంద్రబాబు 40ఏళ్ల చరిత్రలో చేయలేనిది… రెండున్నరేళ్లో జగనన్న చేసింది మీరు బేరిజు వేసుకోండి.
తెలుగు దొంగల పార్టీకి హఠాత్తుగా ఉత్తరాంధ్ర అభివృద్ధి గుర్తుకు వచ్చి, ఓ గంగిరెద్దు అధ్యక్షతన సమావేశం పెట్టారు. ఉత్తరాంధ్రకు మీరు అన్యాయం చేసి, అడ్డంగా తొక్కేసి ఇప్పుడు అభివృద్ధి అంటూ వేదికలు పెడతారా? సంస్కృతి, సంస్కారం, భాష తెలుగువారి ఆభరణం. అలాంటిది, మీకు భాష, సంస్కారం లేకుండా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌గారిని అడ్డదిడ్డంగా తూలనాడతారా.. ఉన్నత పదవిలో ఉన్న ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసమా?
పోలవరం పర్యటనకు వచ్చిన లోకేష్‌ అవాకులు చవాకులు పేలుతున్నాడు. లోకేష్‌, నీ భాష మార్చుకోకపోతే… అంతకంటే దారుణమైన భాషను మేము కూడా మాట్లాడగలం. నోరు ఉంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదు. “రేయ్‌ లోకేష్‌… ఒరేయ్‌ పప్పు.. చెంబాలు.. పోలవరానికి నీకు సంబంధం ఏంటిరా?” అని మేం కూడా అనగలం. పోలవరం 2018కల్లా పూర్తి చేస్తామని చంద్రబాబు అసెంబ్లీలో చెప్పారు? మరి మీరు ఏం చేశారు?, వెళ్ళి మీ తండ్రి బాబును అడుగు. పోలవరం, సుజల స్రవంతి గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా? ఒకవేళ​ మాట్లాడేది ఉంటే మీ హయాంలో ఎందుకు మాట్లాడలేదు?
– పప్పుగాడు క్షమాపణలు చెప్పి, ఇకనైనా పద్ధతిగా మాట్లాడటం నేర్చుకోవాలి. గతంలో గవర్నర్‌, డీజీపీపైనా లోకేష్, అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు. మీరు అధికారంలో ఉన్న ఐదేళ్ళలో చెప్పుకోడానికి ఒక్క పని చేశారా.. దమ్ముంటే మీరు చెప్పండి?
– మేము చేసింది చెప్పాం.. చేయబోయేది చెప్పాం… మరి మీరు దద్దమ్మల్లా విమర్శలు చేస్తున్నారు.
– ప్రకృతిని భయపెట్టేవాళ్లా మీరు? హుద్‌హుద్‌ తుపాన్‌ సమయంలో విశాఖ కలెక్టరేట్‌లో రెవెన్యూ రికార్డులు మాయం చేసేసి లక్ష ఎకరాలను దోచేశారు.
విశాఖ అంటే సంస్కృతి, సంప్రదాయాలకు నిలయం. అలాంటి విశాఖను, ఉత్తరాంధ్ర అంటే బికినీల షోగా మార్చాలని చూసింది మీరు కాదా..? మీ హయాంలో బికినీ షోలు చేసి ఉంటే మిమ్మల్ని గుడ్డలూడదీసి కొట్టి ఉండేవాళ్లు ఉత్తరాంధ్ర ప్రజలు. 2014-19 వరకూ అధికారంలో ఉండి, ఎంవోయూలు ఏమయ్యాయి. వాటిని చూపించండి. దమ్ముంటే రండి ఉత్తరాంధ్ర ప్రాంత వ్యక్తిగా, వైయస్సార్‌ సీపీ కార్యకర్తగా చర్చకు రావడానికి నేను సిద్ధం. మీకు దమ్ము ఉందా? భాష మార్చుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే క్షమించేది లేదు.
ఉత్తరాంధ్రకు గుర్తింపు ఇచ్చిన నాయకుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు. ఆయన ఉత్తరాంధ్ర ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడు. అధికారంలోకి వచ్చిన 26 నెలల్లోనే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. 26 నెలల్లో సంక్షేమ పథకాలకు లక్షా 41వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి, అన్నివర్గాల ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తున్నారు.
– దమ్ముంటే చెప్పండి. ఈ రాష్ట్రంలో మా పార్టీకి ఓటు వేయలేదనిగానీ, సంక్షేమ పథకాలు అందడం లేదనిగానీ, ఎవరితో అయినా ఒక్కరితో చెప్పించగలరా?
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారి పాలనలో ఆంధ్రప్రదేశ్‌ స్వర్ణయుగం కాబోతుంది. అభివృద్ధిలో ఉత్తరాంధ్ర ముందుకు వెళుతుంది. మేము సాక్ష్యాలతో సహా చెప్పాం. మీరు మీడియా ముందు కూర్చుని కబుర్లు చెప్పడం కాదు. బహిరంగ చర్చకు మేం సిద్ధం. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే తాట తీస్తామని హెచ్చరిస్తున్నాం.
అచ్చెన్నాయుడు మతి భ్రమించి మాట్లాడుతున్నాడు, పిచ్చెక్కి ప్రేలాపన చేస్తున్నారు. అచ్చెన్నాయుడు అర్జెంట్‌గా అధికారంలోకి రావాలి అని కలలు కంటున్నాడు. అధికారం అంటే వడ్డీలకు వడ్డీలు ఇవ్వడమా?. టీడీపీ అధికారంలోకి రావడం అనేది అసాధ్యం.

LEAVE A RESPONSE