Suryaa.co.in

Andhra Pradesh

లోకేష్ అక్రమ అరెస్టును ఖండించిన టీడీపీ నాయకులు

పరామర్శలకు వెళ్తుంటే సీఎం ఎందుకు ఇంత భయపడుతున్నాడు?
శ్రీకాకుళం లో పార్టీ నేతల అరెస్ట్ లను ఖండిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్
మా పార్టీ లీడర్ల పరామర్శలకు మా నేతలు వెళ్తుంటే కూడా సీఎం ఎందుకు ఇంత తీవ్రంగా భయపడుతున్నాడు? శ్రీకాకుళంలో టీడీపీ నేతల అరెస్టులు ఎందుకో, ఆంక్షలు ఎవరి కోసమో ఈ ప్రభుత్వం చెప్పాలి? అర్ధరాత్రి కూల్చివేతలు, అక్రమ కేసులపై ప్రజల ప్రశ్నలను మీ ఈ అరెస్టులు అడ్డుకోలేవు. పరామర్శకు వెళ్ళకూడదు అని ఏ చట్టం చెపుతుంది? పలాసలో రాజకీయ కక్ష లతో తప్పు చేశారు కాబట్టే ప్రభుత్వం ఈ స్థాయిలో వణికిపోతుంది. మీరు వైసీపీ పోలీస్ కాదు….ఆంధ్రప్రదేశ్ పోలీస్ అని గుర్తు పెట్టుకుంటేనే గౌరవం.

లోకేశ్ అక్రమ అరెస్టు దుర్మార్గం:యనమల రామకృష్ణుడు
ఈ రాష్ట్రం ఏమైనా జగన్ రెడ్డి తాత జాగీరా?
ప్రతిపక్ష నేతలకు రాష్ట్రంలో తిరిగి హక్కు లేదా ?
ప్రజాసమస్యలపై పోరాటం చేసేవారి పట్ల, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారి పట్ల వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యహహరిస్తోంది. నారా లోకేశ్ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నాం. లోకేశ్ ఏం తప్పు చేశారని పోలీసులు అరెస్ట్ చేసారో చెప్పాలి. ఈ రాష్ట్రం ఏమైనా జగన్ రెడ్డి తాత జాగీరా? లేక రాష్ట్రంలో రోడ్లు జగన్ రెడ్డి తన దోపుడు సొమ్ముతో వేయించారా? ప్రతిపక్ష నేతలకు రాష్ట్రంలో తిరిగి హక్కు లేదా ? జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో ఎప్పుడూ పబ్జి ఆడటమే కాకుండా అప్పుడప్పుడు నియంతల చరిత్ర చదివితే తత్వం బోధపడుతుంది. లోకేశ్ ని, టీడీపీ నేతల్ని వెంటనే విడుదల చేయాలి.

నారా లోకేశ్ రాకతో వైసీపీ గూండాల గుండెల్లో వణుకు:కాలవ శ్రీనివాసులు
పరామర్శకు వెళ్తున్న వారిని అడ్డుకోవడం జగన్ రెడ్డి పిరికితనానికి నిదర్శనం
జగన్ రెడ్డి గూండాల దుశ్చర్యతో ఆవేదనకు గురైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తను పరామర్శించేందుకు వెళ్ళిన నారా లోకేశ్ ను అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గం. గూండాల రాజ్యంలో ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో.. జగన్ రెడ్డి నిరూపించి చూపించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి అప్పలరాజు చేస్తున్న అరాచకాలపై ప్రజలంతా ఎప్పుడో ఏకమై తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. అలాంటి కబ్జాల మంత్రికి జగన్ రెడ్డి అండగా నిలవడం, పోలీసులతో ప్రతిపక్షాలను అణచివేయాలనుకోవడం అసాధ్యమని తెలుసుకోవాలి. కబ్జాలు, దౌర్జన్యాలే లక్ష్యంగా సాగుతున్న జగన్ రెడ్డి పాలనకు టైం దగ్గరపడింది. వినాశకాలే విపరీత బుద్ధి అనే విధంగా.. జగన్ రెడ్డి చేస్తున్న అరాచకాలు, అకృత్యాలే వారిని అథ:పాతాళానికి తొక్కేయబోతున్నాయి. శుభకార్యానికి వెళ్లనీయకుండా, పరామర్శకు అడ్డంకులు సృష్టించడం సిగ్గుచేటు. నారా లోకేశ్ ను అక్రమంగా అరెస్టు చేశారు. దౌర్జన్యంగా హైవేలపై కనీస సెక్యూరిటీ లేకుండా తిప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. తక్షణమే నారాలోకేశ్ పలాస వెళ్లేలా ఏర్పాట్లు చేయకుంటే తర్వాత ఎదురయ్యే పరిణామాలకు జగన్ రెడ్డే బాధ్యత వహించాల్సి వస్తుందని గుర్తుంచుకోవాలి.

లోకేశ్ ని చూసి వైసీపీ నేతలు ఎందుకు వణికిపోతున్నారు? : డోలా బాలవీరాంజనేయస్వామి
నారా లోకేశ్ చూస్తే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సహా వైసీపీ నేతలు ఎందుకు వణికిపోతున్నారు. పలాస లో మా పార్టీ నాయకుల్ని పరామర్శించదానికి వెళ్తున్న లోకేశ్ ని అరెస్ట్ చేయడం దుర్మార్గం. ప్రతిపక్షనేతలకు రాష్ట్రంలో తిరిగే హక్కు లేదా?
చికెన్ గున్యా, మలేరియా వంటి వ్యాధులతో చనిపోయిన వారిని కూడా వై.య.స్ కోసం చనిపోయరంటూ నాడు ఓదార్పు యాత్ర పేరుతో జగన్ రెడ్డి రాష్ట్రమంతా ఎలా తిరిగారు? టీడీపీ నేతలు మాత్రం కనీసం పార్టీ కార్యకర్తల్ని పరామర్శించకూడదా?జగన్ రెడ్డి నియంతలా వ్యవహరిoచడం మానుకోవాలి లేకుంటే ప్రజలే బుద్ధి చెప్తారు. అక్రమంగా అరెస్ట్ చేసిన లోకేశ్ ని, టీడీపీ నేతల్ని వెంటనే విడుదల చేయాలి.

టీడీపీ నేతలకు వీసా కౌంటర్ తెరిచిన జగన్ రెడ్డి :వంగలపూడి అనిత
పలాసకు నారా లోకేష్ గారు వెళితే తమ అక్రమాలు, దౌర్జన్యాలు, కబ్జాలు బయటకు వస్తాయి అని ఉలిక్కిపడ్డారు. అక్రమ అరెస్టులతో తమ అవినీతి అక్రమాలను కప్పిపెట్టొచ్చు అన్న భ్రమలో ఉన్నారు ఈ దద్దమ్మలు. మీరు ఇంత పిరికిపందలు అని ప్రజలకు మీరే తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు. లోకేశ్ గారి అక్రమ అరెస్ట్ తో మీ గొయ్యి మీరే త్రవ్వుకున్నారు. తెలుగుదేశం నేతల ప్రయాణాలకు, కార్యక్రమాలకు జగన్ రెడ్డి వీసా కౌంటర్ తెరిచినట్లు ఉన్నాడు. అంబేద్కర్ రాజ్యాంగం అమలు అవ్వట్లేదు ఇక్కడ. పౌరుల ప్రాధమిక హక్కులను హరించడం ఈ ప్రభుత్వానికి నిత్యకృత్యం అయ్యింది. #ShameOnYCP

లోకేష్ అరెస్టు దుర్మార్గం: కావలి గ్రీష్మ
లోకేశ్ ని పోలీసులు అరెస్ట్ చేయడం దుర్మార్గం. పోలీసు కేసులకు, అరెస్టులకు టీడీపీ కార్యకర్తలు కూడా భయపడరు. అలాంటిది లోకేష్ గారిని అరెస్ట్ చేసి బయపెట్టాలనుకుంటే అది జగన్ రెడ్డి భ్రమే. పలాసలోని టీడీపీ కార్యకర్త ఇంటిని అర్ధరాత్రి జేసీబీతో కూల్చేశారు. టీడీపీ కార్యకర్తను పరామర్శించేందుకు వచ్చిన నారా లోకేశ్‍ను రోడ్డుపై పోలీసులు ఆపేసి హంగామా సృష్టించారు. కార్యకర్తను పరామర్శించి పాతపట్నంలోని రిసెప్షన్ కు వెళ్తానని లోకేశ్ గారు చెప్పారు. ఈ ప్రోగ్రామ్ కు ముందుగానే పర్మిషన్ ఇచ్చికూడా లోకేశ్ ను అడ్డుకున్నారు. పోలీసులు ఇంత దుర్మార్గానికి పాల్పడతారని ఊహించలేదు.

లోకేష్ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం: మద్దిపాటి వెంకటరాజు
టీడీపీ నేతలు, కార్యకర్తల ఇళ్ళు, ఆస్తులను విధ్వంసం చేయడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోంది. పలాసలో భూఖబ్జాను ప్రశ్నించిన లక్ష్మీనారాయణ ఇళ్ళు కూల్చివేత ప్రయత్నం ప్రశ్నించే గొంతులను అణచివేయడమే. పరామర్శకు వెళ్లిన నారా లోకేష్ ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని జగన్ స్వామ్యంగా మార్చారు. రాష్ట్రంలో కొందరు పోలీసులు జగన్ కు పాలేరులు మాదిరి పనిచేస్తున్నారు. కీలు బొమ్మలా మారి పోలీస్ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. నియంతలా వ్యవహరించే జగన్ రెడ్డికి ప్రజల చేతిలో బడిత పూజ తప్పదు. వైసీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడితే సహించం. లోకేష్ పేరు వింటేనే వైసీపీ నేతలు కలవరపడుతున్నారు.

LEAVE A RESPONSE