మేమేమీ వైసీపీ సభ్యుల్లా బల్లల పైకి ఎక్కి ఎవరినీ తిట్టలేదు

• మేమేమీ వైసీపీసభ్యుల్లా బల్లల పైకి ఎక్కి ఛైర్మన్ స్థానంలో ఉన్న షరీఫ్ ని తిట్టినట్లు ఎవరినీ తిట్టలేదు
– రాష్ట్రంలో సాగుతున్న జేబ్రాండ్స్ మద్యం అమ్మకాలు, సారామరణాలపై చర్చజరిగితే ముఖ్యమంత్రి సాగిస్తున్న వేలకోట్ల దోపిడీబయటపడుతుందనే సభలో టీడీపీసభ్యులకు అవకాశమివ్వడంలేదు
• ఆనాడు మండలిలో నానాఛండాలమంతాచేసి, షరీఫ్ గారిని కులంపేరుతోతిట్టి, ఆయనతల్లిని అనరానిమాటలన్నారు
• ఆనాడు బొత్ససత్యనారాయణ, కొడాలినానీ చేసినదానికి ముఖ్యమంత్రి సభకుగానీ, షరీఫ్ గారికి గానీ క్షమాపణచెప్పాడా?
• జేబ్రాండ్స్ లో 5 బ్రాండ్లను కేంద్రప్రభుత్వ ల్యాబ్ లలో పరీక్షలు చేయించాము. ఆ నివేదికలు మేం ప్రజలముందు ఉంచుతాం
• ముఖ్యమంత్రి చెబుతున్న అధికారుల నివేదికలు ఎక్కడున్నాయో బయటపెట్టమనండి
– శాసనమండలి సభ్యుల మీడియా సమావేశం

నేను లేని సభలో నన్ను దూషించిన ఉపముఖ్యమంత్రి (ఎక్సైజ్ మంత్రి) సారామరణాలపై సభలో తమతోచర్చకు వచ్చి, సమాధానం చెప్పగలడా ?సారామరణాలపై చర్చజరిగితే ముఖ్యమంత్రి సాగిస్తున్న మద్యంవ్యాపారం, మంత్రుల వాటాలు అన్నీబయటకు వస్తాయని భయం : నారా లోకేశ్ (టీడీపీ ఎమ్మెల్సీ)

జేబ్రాండ్స్ తాలూకా మద్యంసీసాల్లోని మద్యం శాంపిళ్లను కేంద్రప్రభుత్వం అప్రూవ్ చేసిన ల్యాబ్ లకు పంపి పరీక్షలు చేయించారు. జేబ్రాండ్స్ లోని బ్రాండ్లలో కేవలం 5, 6 బ్రాండ్లనే పరీక్షిస్తే, మనుషులు తాగడానికి అవేవీ పనికిరావని తేలిపోయింది. ల్యాబ్ లు ఇచ్చిన నివేది కలను తాము ఛైర్మన్ గారికి అందివ్వాలని నిర్ణయించాము. ఇప్పటికే టీడీపీఎమ్మెల్యేలు స్పీకర్ కు కూడా ఆయాఆధారాలు అందించారు.

ఇవన్నీ గమనించాకే ఉభయసభల్లో తాము సారామరణాలపై చర్చకు పట్టుబడితే ఈప్రభుత్వం, ముఖ్యమంత్రి ఎందుకు పారిపోతున్నార ని నేరుగా ప్రశ్నిస్తున్నాం. 6రోజుల నుంచీ సారామరణాలపై చర్చించాలని పట్టుబడుతుంటే, 6 నిమిషాలుకూడా ఎందుకు అవకాశమివ్వలేదు. సారామరణాలు సహజమరణాలు కాదనే వాస్తవాలు బయటకువస్తాయని ప్రభుత్వం భయపడుతోందా?

తమవారిని కోల్పోయిన ఆడ బిడ్డలు కన్నీళ్లతో తమవారు ఎలా కళ్లముందు వివిధ సమస్యలతో చనిపోయారో చెప్పుకుంటూబోరున విలపిస్తుంటే, ఈ ప్రభుత్వం సహజమరణాలని ఎలాచెబుతుంది? ముఖ్యమంత్రి , ఈ ప్రభుత్వం విడుదలచేసిన రిపోర్ట్ లో మద్యంలో ఎలాంటిప్రమాదకర రసా యనాలు లేవంటున్నారు. అసలు ఆ రిపోర్ట్ ఏమిటో..ఎక్కడుందో సభలో ప్రవేశపెట్టాలికదా.. సభ్యులకు చూపించాలికదా! ప్రభుత్వం ఎలాంటి రిపోర్ట్ ఇవ్వలేదు. ముఖ్యమంత్రిఊరికే అలా చెబుతున్నారు.

ఎఫ్ఎస్ఎస్ఐ వారి నిబంధనప్రకారం ఏ శాంపిల్ ను అయినా .. ప్రభుత్వ, ప్రైవేట్ ల్యాబ్ లకు పంపించాలి. అలా ఈప్రభుత్వం మద్యంశాంపిళ్లను పరీక్షలు చేయించిందా ? చేయిస్తే.. అధికారులసంతకాలతో కూడిన నివేదికలను సభలో బయటపెట్టాలికదా! ఈ ముఖ్యమంత్రి.. మంత్రులు ఎంత మెంటల్ గాళ్లో ఈరోజు చూశాం.

సభలో మండలిసభ్యుడైన నన్నుపట్టుకొని ఉపముఖ్యమంత్రిగాఉన్న వ్యక్తి శాసనసభలో తిడుతుంటే, ముఖ్యమంత్రి ముసిముసినవ్వులు నవ్వుతాడా? ఆయనతోపాటుస్పీకర్ కూడా నవ్వారు. అదీ వారి సంస్కారం. సిగ్గులేని ఇలాంటి వాళ్లుఉండబట్టే కదా… ఈరాష్ట్రానికి ఇలాంటి గతిపట్టింది. జగన్మోహన్ రెడ్డి తనకూతుళ్లకు కూడా ఇలాంటి సంస్కారమేనేర్పిస్తున్నాడా?

నేనులేని సభలో నన్ను అవమానించిన ఉపముఖ్యమంత్రిని నేరుగా ఒక్కటే అడుగుతున్నా ను.
నాటుసారా మరణాలపై ఉభయసభల్లో చర్చించకుండా ఉపముఖ్యమంత్రి.. ఎక్సైజ్ మంత్రి అయిన వ్యక్తిని అడుగుతున్నాను. 5కోట్లమందిప్రజలకు సమాధానంచెప్పగలడా? ఈరోజు మమ్మల్ని తిడుతూ, ప్రజలనుతప్పుదోవపట్టిస్తూ ముఖ్యమంత్రి, మంత్రులు సభలో వాస్తవాలు బయటకురాకుండా తప్పించుకోవచ్చు. కానీ ఈఅంశాన్ని ఇంతటితో వదిలిపెట్టం. నాటుసారామరణాలతోపాటు, జేబ్రాండ్స్ మద్యం అమ్మకాలతో ప్రజలను దారుణంగా దోచు కుంటున్న ముఖ్యమంత్రిని ప్రజల్లోదోషిగా నిలబెట్టే తీరుతాము. అందులో ఎలాంటి సందేహం లేదు. తమవద్ద ఉన్నఆధారాలన్నింటినీ ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తాము.

ప్రజా సమస్యలపై తాము పోరాడకూడదా…. తామేమైనా వైసీపీసభ్యుల్లా టేబుళ్లు ఎక్కివెర్రికేకలు వేశామా ? ఛైర్మన్ స్థానానికి గౌరవం ఇవ్వకుండా బూతులుతిట్టామా? మంత్రులు బొత్స సత్య నారా యణ …కొడాలినానీ మండలిలో టేబుళ్లు ఎక్కి, నోటికొచ్చినట్లుగా ఛైర్మన్ స్థానంలోఉన్న షరీఫ్ గారిని అవమానించారు. అనరాని మాటలన్నారు. ఆనాడు వీళ్లు చేసిన ఛండాలంపై చర్చించడానికి కూడా తానుసిద్ధమే. షరీఫ్ గారిని బొత్ససత్యనారాయణ ఏకంగా కులం పేరుతోనేతిట్టాడు.

ఆయన తల్లిని అనకూడని మాటన్నాడు. ఆనాడు నిండుసభలో వైసీపీ సభ్యులు, మంత్రులుగాఉన్నవారు చేసినట్లు మేంచేయలేదని మాపార్టీ వారిని శాసనసభ నుంచి సస్పెండ్ చేశారా? మాటిమాటికీ మమ్మల్ని మండలినుంచి సస్పెండ్ చేస్తున్నారా?

ఆనాడు తనపార్టీవారు….తనమంత్రులు చేసిన దాష్టీకం పై ముఖ్యమంత్రి సభకుగానీ, షరీఫ్ గారికి గానీ సమాధానంచెప్పాడా? పోనీ మంత్రులైనా చెప్పారా? మేం ఈరోజుకూడా ఛైర్మన్ స్థానంలోఉన్నవ్యక్తిని గౌరవంగా అధ్యక్షా అనే పిలుస్తున్నాం.. మాకుఓపిక ఉన్నంతవరకు పోరాడుతూనే ఉంటాము. అంతేగానీ సారామరణాలు.. ముఖ్యమంత్రి సాగిస్తున్న మద్యం వ్యాపారాన్ని వదిలిపెట్టేదిలేదు.

మండలికి ముఖంచాటేసిన అధికారపార్టీ సభ్యులు, మంత్రుల నిర్వాకంపై ముఖ్యమంత్రే స్వయంగా ఛైర్మన్ కు క్షమాపణచెప్పాలి : ఎన్.ఎం.డీ ఫరూక్ (టీడీపీ ఎమ్మెల్సీ)
చైర్మన్ వచ్చేసమయానికి సభలో సభ్యులెవరూ లేకపోవడం విచారకరం. మంత్రులంతా వారి పదవులుఎప్పుడు ఊడిపోతాయా అన్న మీమాంసతో సభలోకే రావడంలేదు. ముఖ్యమంత్రి కంట్రోల్లో మంత్రులెవరూ లేరు. ఒక అంశంపై చర్చించడానికి ఛైర్మన్ వచ్చినప్పుడు ఆ అంశంపై సభలో అధికారపార్టీసభ్యులుగానీ, సమాధానంచెప్పడానికి మంత్రులుగానీ అందుబాటులో లేకపోతే, ప్రతిపక్షసభ్యులకు ఎవరుసమాధానమిస్తారు? మండలిఛైర్మన్ గారికి ముఖ్యమంత్రి తొలుతక్షమాపణచెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.

చరిత్రలోఎన్నడూలేని విధంగా ఛైర్మన్ వచ్చేవరకు సభ్యులెవరూరాకపోవడం ఏమిటి? అలాచేయడమంటే ఛైర్మన్ ను అవమానించడమే. పోలవరం అంశంపైచర్చ అన్నారు.. ఎవరుఎవరితో చర్చించాలని తాము ఛైర్మన్ ను అడిగాము. ఇలాంటిసంప్రదాయం ఏమిటని తాము ఛైర్మన్ ను అడిగితే చేసేదిలేక ఆయన సభను వాయిదావేశారు. నాలుగేళ్లనుంచి సభలో లేనికొత్తకొత్త పోకడలు, విచిత్రాలను ఇప్పుడు చూస్తున్నాం. మంత్రులొచ్చాకనే ఛైర్మన్ సభలోకి రావాలనిస్పష్టం చేశాము.

ఏటా రూ.16,500కోట్లు ప్రజలనుంచి వసూలుచేయడమేనా.. ముఖ్యమంత్రి చెప్పిన మద్యపాననిషేధం? : చిక్కాల రామచంద్రరావు (టీడీపీ ఎమ్మెల్సీ)

జంగారెడ్డిగూడెం నాటుసారా మరణాలపై 6రోజులనుంచీ నిరసనవ్యక్తంచేస్తున్నాకూడా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తే సభలోనాటుసారా మరణా లపై చర్చించడానికి వెనుకాడితే ఎలా? 40ఏళ్లనుంచి రాజకీయాల్లోఉన్నాను. అనేకసార్లు చట్టసభలకు వచ్చాను. కానీ ఏ ముఖ్యమంత్రి, ఎప్పుడూ ఇలా, ఈ ముఖ్యమంత్రిలా ప్రవర్తించలేదు. సహజమరణాలో.. సారా మరణాలో సభలో చర్చిస్తేకదా తెలిసేది. అది చేయ కుండా అధికారులు సేకరించిన ఆధారాలు, నమోదైన ఎఫ్ఐఆర్ లు పరిశీలించకుండా ఏకప క్షంగా ముఖ్యమంత్రి తానుచెప్పాల్సిందిచెప్పి, అయిపోయిందంటే సరిపోతుందా?

నాటుసారా, కల్తీమద్యంవల్ల 42మంది చనిపోయారు. టీడీపీప్రభుత్వంలో మద్యంపైఏటా రూ.6వేలకోట్ల ఆదాయంవస్తే, ఈప్రభుత్వంలో అది రూ.16,500కోట్లకుచేరింది. ఏస్థాయిలో పిచ్చిపిచ్చిమద్యం అమ్మితే ఆదాయం అంతలాపెరిగింది? రాష్ట్రంలో అమ్మేమద్యం బ్రాండ్స్ అన్నీ జే బ్రాండ్సే. ఏలెక్కన ఈ ప్రభుత్వం పిచ్చిమద్యాన్ని రాష్ట్రంలో విచ్చలవిడిగా అమ్ము తుందో ప్రజలకు తెలియాలి. సంపూర్ణ మద్యపాననిషేధ అనిచెప్పి, రూ.16,500కోట్ల ఆదా యం తీసుకొస్తున్నారు. మద్యంఅమ్మకాలపై వచ్చే ఆదాయాన్ని తాకట్టుపెట్టే రూ.25వేలకోట్ల అప్పుతెచ్చారు. ఈప్రభుత్వం ఎన్నాళ్లుంటుందో తెలియదు.

ఒకేసారి 25ఏళ్లు..30ఏళ్లకు అప్పులుఎలా తెస్తారు? మద్యంఅమ్మకాలు.. ప్రజల మరణాలు నిరంతరాయంగా ఉండాలనే ముఖ్యమంత్రి కోరుకుంటున్నారా? మాటతప్పను…. మడమతిప్పను అనిచెప్పినవ్యక్తి, ఇప్పుడు అన్నిఅంశాల్లో ఎందుకు ప్రజలనుమోసగిస్తూ, తప్పించుకుంటున్నాడని ప్రశ్నిస్తు న్నాం. అన్నివర్గాలప్రజలు బాధపడుతున్నాకూడా ముఖ్యమంత్రిలో చలనంలేకపోతే ఎలా? ఒక్కఛాన్స్ అని నమ్మిన ప్రజలంతా ఇప్పుడుదేవుడా మాకుఏంటి ఈ ఖర్మ అంటూ నెత్తీనోరు బాదుకుంటున్నారు.

కల్తీమద్యం, నాటుసారా విక్రయాలతో నెలానెలా ముఖ్యమంత్రికి ఎంతొస్తుందో ఆధారాలతోసహా నిరూపించడానికి తాముసిద్ధం : బీ.టెక్.రవి (టీడీపీ ఎమ్మెల్సీ)
జంగారెడ్డిగూడెంలో 54వేలజనాభాఉంది… పోలీస్ స్టేషన్లు.. మహిళాపోలీసులు… వాలంటీర్లు ఉంటే అక్కడెలా సారాకాస్తారని ముఖ్యమంత్రి ప్రశ్నించాడు. మరి అలాగైతే 70వేలపైబడి జనాభాఉన్న పులివెందులలో సారా ఎలా కాస్తున్నారో…దాన్ని వైసీపీవారే దగ్గరుండి ఎలా విక్రయిస్తున్నారో ముఖ్యమంత్రి సమాధానంచెప్పాలి.

పులివెందుల ముఖ్యమంత్రి నియోజక వర్గం. నేనుకూడా అక్కడినుంచే వచ్చాను. పులివెందులలో ఇప్పటికీ సారాకాస్తున్న ఘటన లు…అందుకుకారకులైన వారు పట్టుబడుతున్నఘటనలు నిత్యం జరుగుతున్నాయి. బాబాయ్ ని మర్డర్ చేసి దాన్నిఎలాగైతే గుండెపోటు అన్నారో….అలానే కల్తీసారా మరణాల నుకూడా సహజమరణాలనిచెప్పడం… ప్రజలదారుణమైనచావులనుసాదాసీదా వాటిగా చూపించడం ముఖ్యమంత్రికి అలవాటైపోయింది. ప్రభుత్వం సారామరణాలపై చర్చించకుండా ఎందుకు పారిపోతోందంటే ముఖ్యమంత్రి మద్యంవ్యాపారం, ఆముసుగులో ఆయనసాగిస్తున్న దోపిడీ బయటపడుతుందనే.

కల్తీమద్యంతోపాటు.. నాటుసారా అమ్మకాలు, ఇతరత్రా మాదక ద్రవ్యాలవ్యాపారంద్వారా నెలనెలా ముఖ్యమంత్రికి ఎంతవస్తుందో ఆధారాలతోసహా బయట పెట్టడానికి తాము సిద్ధంగాఉన్నామని ప్రభుత్వానికి అర్థమైంది. అందుకే సభలోఎక్కడా అస లు సారామరణాల అంశమే చర్చకురాకుండా చేశారు. తాము 6రోజులనుంచి పట్టుబడుతు న్నాకూడా 6నిమిషాలుకూడా సమయంఇవ్వలేదంటే.. అక్కడే అర్థంకావడంలా.. ఈ ముఖ్యమంత్రి ఎంతలా భయపడుతున్నాడో!