జె బ్రాండ్స్ పోవాలి..జగన్ దిగిపోవాలి

-తక్షణమే మద్య నిషేధం అమలు చేయాలి
-కల్తీ మద్యం, కల్తీ సారా నిషేధించాలి
-మాంగల్యాలు తెంచే కల్తీ మద్యం వద్దంటూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆందోళనలు
-మద్యం సీసాలు పగలగొట్టి నిరసనలు
-సారా మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం అందించాలని డిమాండ్

జె.బ్రాండ్స్ పోవాలి..జగన్ దిగిపోవాలి అంటూ టీడీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. కల్తీ సారా, కల్తీ మద్యం, ప్రభుత్వ షాపుల్లో అమ్ముతున్న జె బ్రాండ్లు నిషేదించి ప్రజల ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేశారు. కొత్తగా జె.బ్రాండ్లతో ఏడాదికి రూ.6వేల కోట్ల లెక్కన ఐదేళ్లలో రూ.30 వేల కోట్లు దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. మద్యనిషేధం అని చెప్పి జగన్ సొంత బ్రాండ్ల మద్యం,కల్తీ సారా ఏరులై పారిస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే మద్య నిషేదం చేస్తానని చెప్పి ఇప్పుడు కల్తీ సారా, నాణ్యత లేని సొంత బ్రాండ్లతో మహిళల తాళిబొట్లు తెంచుతున్నారని ఆరోపించారు.

వైసీపీ నేతల అండదండతోనే గ్రామాల్లో నాటుసారా మాఫియా రాజ్యమేలుతోందని ధ్వజమెత్తారు. అధిక ధరలకు మద్యం కొనలేక శానిటైజర్ తాగి సుమారు 50 మంది చనిపోయారన్నారు. ఇటీవల జంగారెడ్డిగూడెం, ఏలూరు పరిసర ప్రాంతాల్లో నాటుసారా తాగి ఇప్పటి వరకూ 42 మందికి పైగా చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జె.బ్రాండ్లు, జె.ట్యాక్సులు, నాటుసారాకు వ్యతిరేకంగా రెండు రోజుల పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది.

ఈ నేపథ్యంలో మొదటి రోజు సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 30 వేల మంది పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళనల్లో పాల్గొన్నారు. ఈ ఆందోళనలు రేపు (ఆదివారం) కూడా జరగనున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా శనివారం ఆందోళన చేసిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

శ్రీకాకుళం జిల్లాలో…
• జె.బ్రాండ్స్ తో ప్రజల ప్రాణాలు తీస్తున్న జగన్ తక్షణమే రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే గుండు లక్ష్మీ దేవి డిమాండ్ చేశారు.
• ఇచ్చాపురం కల్తీసారా నిషేధించాలని, జె.బ్రాండ్స్ తో ప్రజల ప్రాణాలు తీయొద్దని ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు చేశారు.
• పాలకొండలో ఇంచార్జ్ నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో జగన్ దిగిపోవాలి జె బ్రాండ్లు పోవాలంటూ ధర్నా నిర్వహించారు.
• ఎచ్చరల్లో రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు ఆధ్వర్యంలో జె.బ్రాండ్స్ కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు.
• కోట బొమ్మాలిలో మద్యం విక్రయాలకు వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొని ధర్నా చేశారు.
• రాజాంలో మాజీ మంత్రి కొండ్రు మురళీ ఆదేశాల మేరకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.

విజయనగరం జిల్లాలో…
• పార్వతీపురంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న మాజీ ఎమ్మెల్సీ జగదీష్, మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, టీడీపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. టీడీపీ నాయకులను అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు.
• నెలిమర్లలో మాజీమంత్రి పతివాడ నారాయణస్వామి నాయుడు ఆద్వర్యంలో సారా మృతులకు ప్రభుత్వం పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

విశాఖపట్నం జిల్లాలో..
• నర్సీపట్నంలో మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆధ్వర్యంలో కస్తీసారా, జే.బ్రాండ్స్ నిషేధించాలని నిరసన తెలిపారు.
• అనకాపల్లిలో పార్లమెంట్ అధ్యక్షులు బుద్ధా నాగ జగదీశ్వరరావు, ఇంఛార్జ పీలా గోవింద్ ఆధ్వర్యంలో పోలీసుల రంగ ప్రవేశంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం వారిని అరెస్టు వారిని స్టేషన్ కు తరలించారు.
• బీమిలో పార్టీ శ్రేణులు ఆందోళన నిర్వహించారు.
• విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఇంఛార్జ్ గండి బాబ్జీ ఆధ్వర్యంలో మద్యం దుకాణాల వద్ద నేతలతో కలసి ధర్నా చేపట్టారు.

తూర్పు గోదావరి జిల్లాలో..
• జె.ట్యాక్స్ తో జనాన్ని లూఠీ చేస్తున్నారని మోరంపూడి జంక్షన్ వద్ద పాల్గొన్న ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో కార్యకర్తలు, నేతలు పాల్గొని నిరసనలు తెలిపారు.
• పెద్దాపురంలో చేపట్టిన ధర్నాలో పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చిన్నరాజప్ప పాల్గొన్నారు.
• సారా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని జగ్గంపేట ఇంఛార్జ్ జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. కార్యకర్తలతో కలిసి పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు.
• పత్తిపాడులో ఇంఛార్జ్ వరపుల రాజా కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి సెంటర్లో ధర్నా నిర్వహించారు.
• రామచంద్రాపురంలో ఇంచార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొని జగన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
• అమలాపురంలో జె బ్రాండ్ పోవాలి..జగన్ రెడ్డి దిగిపోవాలి అంటూ ఇంఛార్జ్ అయితా ఆనందరావు కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు.
• తునిలో ఇంఛార్జ్ యనమల కృష్ణుడు సూచనల మేరకు మండలపార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో సారా మరణాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు.
• రంపచోడవరంలో మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు.
• రాజానగరంలో పెందుర్తి వెంకటేశ్ ఆదేశాల మేరకు కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు.
• ముమ్మడివరంలో ఇంఛార్జ్ సుబ్బరాజు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో..
• పాలకొల్లులో బ్రాందీ షాపుల వద్ద ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. మహిళల తాళిబొట్లతో నిరసన వ్యక్తం చేస్తూ నాసిరకం బ్రాండ్స్ బ్రాందీ సీసాలను ధ్వంసం చేశారు.
• బీమవరంలో నరసారపురం పార్లమెంట్ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మీ మద్యనిషేధం చేయాలని నిరసన తెలిపారు.
• ఉంగుటూరులో ఏలూరు పార్లమెంట్ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు సారా అరికట్టాలని తహసీల్దార్ కు వినతిపత్రం అందించారు.
• జంగారెడ్డిగూడెంలో ఇంఛార్జ్ వలవల బాజ్జీ ఆధ్వర్యంలో కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసనలు తెలిపారు.
• నరసాపురంలో ఇన్చార్జ్ పొత్తూరి రామరాజు ఆధ్వర్యంలో కల్తీమద్యానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు.
• యలమంచిలిలో ఇంఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు ఆదేశాల మేరకు నేతలు, కార్యకర్తలు ధర్నా చేశారు.
• ఏలూరులో బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ..జగన్ రెడ్డి మద్యం జనం ప్రాణాలు తీస్తుందని విమర్శించారు.
• దెందులూరులో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, పార్టీ నేతలు, కార్యకర్తలు, వైన్ షాప్ ముదు ఆందోళన చేపట్టారు.

కృష్ణాజిల్లాలో..
• విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో కల్తీసారా, జే-బ్రాండ్స్ నిషేధించాలంటూ ప్రభుత్వ వైన్ షాపు ఎదుట టీడీపీ శ్రేణులతో ఆందోళన చేపట్టారు.
• జగ్గయ్యపేటలో విజయవాడ పార్లమెంట్ అధ్యక్షులు నెట్టెం రఘురాం, మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య ఆచంట సునీతలు పాల్గొన్నారు. తిరువూరు పట్టణంలోని బైపాస్ రోడ్డు నందు వైన్ షాపు వద్ద ఇన్చార్జ్ శావల దేవదత్ ఆధ్వర్యంలో నేతలు నిరసనలు తెలిపారు.
• గన్నవరంలో ఇంఛార్జ్ బచ్చుల అర్జునుడు పార్టీ శ్రేణులతో కలిసి ఆందోళన నిర్వహించారు.
• నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నందిగామ నియోజకవర్గ మహిళా అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు, పట్టణ తెదేపా కౌన్సిలర్లు,తెదేపా నేతలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
• పెడనలో కల్తీ సారా నిర్మూలించాలని ఇంచార్జ్ కాగిత కృష్ణప్రసాద్ ఆద్వర్యంలో కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టారు.
• రాష్ట్రంలో కల్తీసారా ఏరులై పారుతోందని తిరువూరులో ఇంచార్జ్ శావల దేవదత్ పార్టీ నేతలు కార్యకర్తలతో పెద్ద ఎత్తున కలిసి ధర్నా నిర్వహించారు.
• జగన్ రెడ్డి సొంత బ్రాండ్లతో జనం ప్రాణాలు తీస్తున్నారని మొవ్వలో ఇంఛార్జ్ వర్ల కుమార్ రాజా ఆందోళన చేపట్టారు.
• విజయవాడ సెంట్రల్ లో మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో మహిళలతో కలిసి మద్యం విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు.
• కొండపల్లిలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తులు కలిసి పెద్దఎత్తున నిరసనలు తెలిపారు.

గుంటూరు జిల్లాలో..
• వినుకొండలో ఇన్చార్జ్ జీ.వీ.ఆంజనేయులు ఆధ్వర్యంలో మహిళలు, నేతలు నిరసనలు తెలిపారు. మద్యంసీసాలను పగలగొట్టి ఆందోళన చేశారు.
• చిలకలూరిపేటలో మాజీమత్రి పత్రిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులు ఆందోళనలు నిర్వహించారు.
• నరసరావుపేటలో నిర్వహించిన ఆందోళనలో ఇంఛార్జ్ చదలవాడ అరవిందబాబు పాల్గొన్నారు.
• సత్తెనపల్లిలో పార్టీ నేత మన్నె శివనాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు.
• సత్తెనపల్లిలో టీడీపీ నేత కోడెల శివరాం ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు.
• జె.బ్రాండ్స్ నిషేధించాలని నిరసిస్తూ పెదకూరపాడులో మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
• బాపట్లలో ఇంచార్జ్ వేగేశన నరేంద్రవర్మ పాల్గొని ప్రసంగించారు.

ప్రకాశం జిల్లాలో..
• కల్తీ సారాతో వైసీపీ నేతలు ప్రజల ప్రాణాలు తీస్తున్నారని పర్చూరులో కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆందోళన చేశారు.
• గిద్దలూరులో ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణ నాయకులు, కార్యకర్తలు గౌతమ బుద్ధుడు విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
• కందుకూరులో ఇంఛార్జ్ ఇంటూరు నాగేశ్వరరావు నిరసనలో పాల్గొని మద్యం విధానాలపై విమర్శించారు.
• చీరాలలో ఇంఛార్జ్ యడం బాలాజీ ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు.

కర్నూలు జిల్లాలో…
• కల్తీ మద్యంతో ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని ఆలూరు ఇంఛార్జ్ కోట్ల సుజాతమ్మ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు.
• పత్తికొండలో కె.యి.శ్యాంబాబు కార్యకర్తలతో ర్యాలీగా ఎస్ఈబీ అధికారులకు సారా నివారణపై వినతిపత్రం అందించారు.
• కల్తీ సారా నిర్మూలించాలంటూ డోన్ లో ఇంఛార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డి ధర్నా చేపట్టారు.
• మంత్రాలయంలో రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు.

కడప జిల్లాలో..
• కడప పట్టణంలో ఇంచార్జ్ అమీర్ బాబు ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు.
• మైదుకూరులో ఇంచార్జ్ పుట్టా సుధాకర్ ఆదేశాల మేరకు కార్యకర్తలు ఆందోళనలు చేశారు.
• బద్వేలులో కడప పార్లమెంట్ అధ్యక్షులు మల్లెల లింగారెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి

అనంతపురం జిల్లాలో
• రాయదుర్గంలో పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాస్ ఆద్వర్యంలో మద్యం విధానాని వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
• కళ్యాణ దుర్గంలో ఆందోళన సమయంలో ఇంఛార్జ్ ఉమామహేశ్వర నాయుడుకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
• అనంతపురం పట్టణంలో మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి పిలుపుమేరకు కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు.
• హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు.
• పెనుగొండలో మాజీ ఎమ్మెల్యే బీ.కే.పార్థసారధి సారధ్యంలో నిరసనలు తెలిపారు.
• గుంతకల్లో ఇంఛార్జ్ జితేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేశారు.
• పుట్టపర్తితో మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.

చిత్తూరు జిల్లాలో
• కల్తీసారా అరికట్టి, జె.ట్యాక్స్ తో దోచుకోవడం మానాలని ఇచ్చిన పార్టీ పిలుపు మేరకు కుప్పంలో టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున ఆందోళన చేశారు.
• చంద్రగిరిలో ఇంచార్జ్ పులవర్తి నాని ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు.
• మదనపల్లిలో పార్టీ కార్యాలయం నుండి నుంచి మద్యం షాప్ వరకు జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి గారు, పోలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు.
• నగరిలో ఇంఛార్జ్ భానుప్రకాశ్ ఆధ్వర్యంలో జె బ్రాండ్స్ మద్యం ద్వారా వేల కోట్లు కమీషన్ లు దండుకుంటూ పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ రోడ్డుపై ఆందోళనలు నిర్వహించారు.
• పూతలపట్టులో పార్టీ శ్రేణులు ఆందోళన నిర్వహించి తహశీల్దార్ కు వినతిపత్రం అందించారు.

Leave a Reply