-జగన్ బ్రాండ్లతో సంసారాలు బుగ్గి
-పలుచోట్ల మద్యంతో జగన్ చిత్రపటాలకు అభిషేకాలు
-రెండో రోజూ హోరెత్తిన టీడీపీ శ్రేణులు, మహిళల నిరసనలు
-కల్తీసారా, కల్తీమద్యం నిషేధించాలని డిమాండ్
జె.బ్రాండ్స్ పోవాల్సిందే..జగన్ దిగిపోవాల్సిందే అంటూ రెండో రోజూ రాష్ట్రంలో టీడీపీ శ్రేణులు నిరసనలు హోరెత్తించారు. రాష్ట్ర, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఆందోళనలు చేపట్టారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జగన్ చిత్రపటాలకు మద్యంతో అభిషేకం నిర్వహించారు. పలుచోట్ల వినూత్నంగా తాలిబొట్లనూ చిత్రపటాలకు కట్టారు. రోడ్లపై మద్యం సీసాలను పగలగొట్టి నకిలీ మద్యాన్ని అరికట్టాలని నిరసనలు చేశారు. ఈ సందర్భంగా ఆందోళనలో పాల్గొన్న నేతలు మాట్లాడుతూ.. నాటుసారాతో ఇటీవల జంగారెడ్డిగూడెం, ఏలూరు పరిసర ప్రాంతాల్లో 42 మంది చనిపోయినా జగన్ లో చలనం లేదని మండిపడ్డారు. చనిపోయిన ప్రతి కుటుంబానికి రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేని వింతైన బ్రాండ్లు ఏపీలోనే దొరుకుతున్నాయన్నారు. బినామీలతో మద్యం కంపెనీలు పెట్టించి రూ.30 వేల కోట్లకు దోపిడీకి జగన్ రెడ్డి శ్రీకారం చుట్టారని ఆరోపించారు. దశల వారీగా మద్యనిషేధం చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక దశల వారీగా ఆదాయాన్ని పెంచుకుంటున్నారని దుయ్యబట్టారు. రెండో రోజూ చేపట్టిన ఆందోళనల్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 37 వేల మంది శ్రేణులు ఆందోళనల్లో పాల్గొన్నారు. రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ నిరసనల్లో సుమారు 70 వేల మంది వరకు పాల్గొన్నారు. రెండోరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
శ్రీకాకుళం జిల్లాల్లో…
• నరసన్నపేటలో మాజీ ఎమ్మెల్యే, ఇంఛార్జ్ బుగ్గు రమణమూర్తి మద్య నిషేధం అమలు చేయాలంటూ నినాదాలు చేస్తూ పార్టీ శ్రేణులతో ధర్నా చేశారు.
• పాతపట్నంలో ఇంఛార్జ్ కలమట వెంకట రమణ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలపై దహదారిపై ధర్నా నిర్వహించారు.
• పలాసలో ఇంఛార్జ్ గౌతు శిరీష ఆదేశాల మేరకు కార్యకర్తలు నియోజకవర్గ వ్యాప్తంగా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
విజయనగరం జిల్లాలో…
• సాలూరులో పొలిట్ బ్యూరో సభ్యలు గుమ్మడి సంధ్యారాణి తహశీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో పాల్గొన్నారు. జగన్ బ్రాండ్లతో సంసారాలు బుగ్గి అవుతున్నాయని విమర్శించారు.
• బొబ్బిలో ఇంఛార్జ్ ఆర్.వి.ఎస్ఎస్.కెకె.రంగావు (బేబినాయన) ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద భారీ ధర్నా నిర్వహించారు.
• జె.బ్రాండ్లపై జగన్ రెడ్డి సమాధానం చెప్పాలంటూ గజపతినగరంలో మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు ప్రశ్నించారు.
• శృంగవరపు కోటలో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ నిర్వహించారు.
విశాఖపట్నం జిల్లాలో…
• పెందుర్తిలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పెద్ద ఎత్తున కార్యకర్తలో కలిసి ర్యాలీ చేపట్టారు. బినామీలతో మద్యం కంపెనీలు పెట్టించి జగన్ రెడ్డి కోట్లు దండుకుంటున్నారని బండారు మండిపడ్డారు.
• మాడుగుల నియోజకవర్గంలోని దేవరపల్లిలో ఇంచార్జ్ పివిజి కుమార్ అధ్యక్షతన కార్యకర్తలు, నాయకులు ఆందోళన చేపట్టారు.
• యలమంచిలి నియోజకవర్గంలో ఇంచార్జ్ ప్రగడ నాగేశ్వరరావు నాయకత్వంలో పెద్ద ఎత్తున నిర్వహించిన ధర్నాలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో…
• అనపర్తిలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కార్యకర్తలో కలిసి ధర్నా నిర్వహించారు. మెడలో అన్ని రకాల మద్యం సీసాలను కట్టుకుని కార్యకర్తలు వినూత్నంగా ఆందోళన చేపట్టారు.
• రంపచోడవరంలో ఇంఛార్జ్ వంతల రాజేశ్వరి ఆదేశాలతో ఏటపాకలో పార్టీ శ్రేణులు ర్యాలీ చేపట్టారు.
• కాకినాడలో సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు.
• పి.గన్నవరం నియోజకవర్గంలోని అంబాజీపేటలో జరిగిన కార్యక్రమంలో మాజీ డిప్యూడి చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం, ఎంపీ అభ్యర్థి గంటి హరిష్ పాల్గొన్నారు.
• అమలాపురం మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అధ్వర్యంలో ఉప్పలగుప్తం సెంటర్ బ్రాంది షాప్ వద్ద ధర్నా నిర్వహించారు.
• తణుకులో ఇంఛార్జ్ అరిమిల్లి రాధాకృష్ణ ఆదేశాలతో నాయకలు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో…
• నరసాపురంలో ఇంఛార్జ్ పొత్తూరి రామరాజు ఆధ్వర్యంలో మద్యం దోపిడీని మానుకోవాలని హితవు పలుకుతూ మొగల్తూరులో ఆదోళన చేపట్టారు.
కృష్ణా జిల్లాలో…
• విజయవాడ పశ్చిమలో తెలుగు యువత ఆధ్వర్యంలో సితార సెంటర్లో నిరసన తెలిపారు.
గుంటూరు జిల్లాలో…
• మంగళగిరిలో నారా లోకేష్ ఆదేశాల మేరకు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జగన్ చిత్రపటానికి తాలిబొట్లు కట్టి, మద్యంతో అభిషేకం చేశారు.
• పొన్నూరులో మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు.
• తాడికొండలో గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ ఆద్వర్యంలో మహిళలు, నేతలతో కలిసి ఆందోళన చేపట్టారు.
• చిలకలూరిపేటలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు పట్టణంలో నాయకులు, కార్యకర్తులు, మహిళలు మద్యనిషేధం చేయాలంటూ ఆందోళన చేశారు.
• మాజీ ఎమ్మెల్యే యపతినేని శ్రీనివాసులు ఆదేశాల మేరకు సారాతో చనిపోయిన కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం చెల్లించాలని గురజాల నియోజకవర్గం వ్యాప్తంగా నిరసనలు తెలిపిన నాయకులు డిమాండ్ చేశారు.
• ఈవూరు మండలంలో ఇంఛార్జ్ జీవీ ఆంజనేయులు ఆదేశాల మేరకు నేతలు, కార్యకర్తలు మద్యం సీసాలు పగలగొట్టి, సారా మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
• మాచర్ల నియోజకవర్గం వ్యాప్తంగా ఇంఛార్జ్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆదేశాలతో పార్టీ శ్రేణులు జె.బ్రాండ్లు నిషేధించాలంటూ నిరసనలు తెలిపారు.
ప్రకాశం జిల్లాలో…
• యర్రగొండపాలెం నియోజవర్గం వ్యాప్తంగా ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ఆదేశాల మేరకు పార్టీ నేతలు మద్యానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు.
• కంభం పట్టణంలో ఇంఛార్జి ముత్తముల అశోక్ రెడ్డి పిలుపు మేరకు నాయకులు ధర్నా చేపట్టారు.
• సంతనూతలపాడు నియోజకవర్గం చీమకుర్తి, సంతనూతలపాడులో నేతలు ఆందోళన చేపట్టారు.
• ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆదేశాల మేరకు బల్లపల్లి అడ్డరోడ్డు వద్ద నాయులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.
నెల్లూరు జిల్లాలో…
• మద్యంపై అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల పోరాటానికి మద్ధతుగా బుచ్చిరెడ్డిపాలెంలో మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నిరసన తెలిపారు.
• నెల్లూరు రూరల్ లో ఇంఛార్జి అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో ముత్తుకూరు రోడ్డు జంక్షన్ లో మహిళలతో నేతలు ధర్నా నిర్వహించారు.
• సూళ్లూరుపేట నియోజవర్గంలో నాయకులు, కార్యకర్తలు ఆందోలన చేపట్టారు.
• ఆత్మకూరులో బస్టాండ్ నుండి బీఎస్ఆర్ సెంటర్లోని మద్యం దుకాణాల వరకు నాయకులు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. అనంతరం మద్యం సీసాలను పగలగొట్టి నినాదాలు చేశారు.
• సూళ్లూరు పేటలో నాయకులు, కార్యకర్తలు మద్య నిషేధం చేయాలని బ్యానర్లతో ప్రదర్శన చేపట్టారు.
కర్నూలు జిల్లాలో…
• గడివేములలో నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి, ఇంఛార్జ్ గౌరు చరితారెడ్డి పార్టీ మహిళలతో కలిసి రోడ్డుపై ధర్నా చేపట్టి మద్యం సీసాలు పగలగొట్టారు.
• బనగానపల్లెలో మాజీ ఎమ్మెల్యే బీ.సీ.జనార్థన్ రెడ్డి సూచనల మేరకు నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యాలయం నుండి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు ర్యాలీ చేశారు.
• ఎమ్మిగనూరు మండలం గువ్వలదొడ్డి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఉపాధ్యక్షులు బీ.వీ.జయనాగేశ్వరరెడ్డి నిరసన తెలిపారు.
• శ్రీశైలం నియోజకవర్గం వ్యాప్తంగా మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పిలుపు మేరకు నాయకులు, కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
• కోసిగిలో ఇంఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి సోదరుడు రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి ఆందోళనలు నిర్వహించారు.
కడప జిల్లాలో…
• ప్రొద్దుటూరులో ఇంఛార్జ్ జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఈబీ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.
• బద్వేలులో మాజీ ఎమ్మెల్యే కొండ్రెడ్డి విజయమ్మ, రితేష్ రెడ్డి ఆదేశా మేరకు పార్టీ కార్యలయం బయట రోడ్డుపై బైఠాయించి నాటుసారా నిషేధించాలని డిమాండ్ చేశారు.
చిత్తూరు జిల్లాలో…
• తిరుపతిలో ఇంఛార్జ్ సుగుణమ్మ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ధర్నా చేపట్టారు.
• శ్రీకాళహస్తిలో ఇంచార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి ఆద్వర్యంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని మద్యం సీసాలు చూపుతూ ఆందోళన చేపట్టారు.
• సత్యవేడులో జేడీ రాజశేఖర్ పిలుపు మేరకు అన్ని మండలాల్లో పార్టీ నాయకులు వైన్ షాపుల వద్ద ఆందోళనలు చేపట్టారు.
• పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలంలో నాయకులు నిరసనలు తెలిపారు.
అనంతపురం జిల్లాలో…
• ధర్మవరంలో ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ ఆదేశాల మేరకు మద్యం బాటిళ్లను చూపుతూ చూపుతూ నాయకులు, కార్యకర్తలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
• సింగనమలలో నియోజకవర్గ త్రిసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి, ఆలం నరసానాయుడు ఆదేశాల మేరకు నాయకులు నిరసన చేపట్టారు.
• జె.బ్రాండ్స్ అరికట్టాలని మడకశిరలో మాజీ ఎమ్మెల్యే కె.ఈరన్న ఆధ్వర్యంలో పార్టీ కార్యాయం నుండి మద్యం షాపు వరకు ర్యాలీ చేపట్టారు.
• గుంతకల్లులో ఇంఛార్జ్ ఆర్.జితేంద్ర గౌడ్ ఆదేశాల మేరకు పామిడిలో ఎన్టీఆర్ విగ్రహం నుండి మద్యం షాపు వరకు నిరసన తెలిపారు.