Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి ఫీజు రియంబర్స్..వైసీపీ పెద్దలకేనా? పేద విద్యార్థులకు లేదా?

– జగన్ రెడ్డి జీవో 77 తీసుకు వచ్చి విద్యార్థులను కూలీలుగా మారుస్తున్నారు
– టిడిపి శాసన సభ్యులు అనగాని సత్యప్రసాద్, డోలాబాల వీరాంజనేయ స్వామి

వైసీపీ పెద్దలకు, నేతలకు పదవులు, కాంట్రాక్టులు రియంబర్స్ చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పేద విద్యార్థులకు మాత్రం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదు.ప్రైవేట్‌, ఎయిడెడ్‌, అన్‌ఎయిడెడ్‌ కళాశాలల్లో చదివే పీజీ విద్యార్థులకు 2020-21 విద్యా సంవత్సరం నుంచి జగనన్న విద్యాదీవెన నిలిపివేస్తూ జీవో నెం. 77ను విడుదల చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేద విద్యార్థులకు ఈ పథకం నిలిపివేతతో వారి ఉన్నత చదువుల కలను చెరిపివేశారు.జీవో నెంబర్ 77 తీసుకొచ్చి ఫీజు రియంబర్స్మెంట్ కు లింక్ చేయడంతో ఫీజులు కట్టలేక డిగ్రీలు చదివిన విద్యార్థులు పీజీ కోర్సులు చేయలేక కార్మికులుగా, కూలీలుగా మారాల్సిన పరిస్థితి ఏర్పడింది.జగన్ రెడ్డి విద్యా కానుక పేరుతో పేద విద్యార్థులకు చేదు కానుక అందించారు.

టీడీపీ హయాంలో ఫీజ్ రీయంబర్స్ మెంట్ ను 3 విడతలుగా జమ చేస్తే జగన్ రెడ్డి మాత్రం దానిని 4 విడతలుగా మార్చారు. అది కూడా 2021-22 సంవత్సరానికి 3 విడతలు మాత్రమే అమలు చేసి 4వ విడత ఎగనామం పెట్టారు. అంటే ప్రభుత్వం 70 శాతం ఫీజు మాత్రమే కట్టింది. పైగా కేంద్రం వాటా విడుదల చేసిన 60 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించి విడతల వారీగా చెల్లిస్తోంది.

టీడీపి ప్రభుత్వం 16 లక్షల మంది విద్యార్ధులకు ఫీజ్ రీయంబర్స్ మెంట్ ఇస్తే జగన్ రెడ్డి ప్రభుత్వం దానిని 10.82 లక్షల మంది విద్యార్దులకు కుదించి దాదాపు 5.18 లక్షల మంది విద్యార్ధులకు ఫీజ్ రీయంబర్స్ మెంట్ ను దూరం చేసి విద్యార్ధుల భవిష్యత్ నాశనం చేసింది. మరో వైపు కాలేజీలకు కోర్సు ఫీజులు 30% తగ్గించి, తల్లిదండ్రుల నుండి ఫీజులు రాక ఇబ్బందులు పడుతుంటే , 4వ విడత ఫీజులు ఇవ్వలేమని ప్రభుత్వం చేస్తులు ఎత్తేస్తే ఆ కాలేజీలు ఎలా నడపాలి.

విద్యార్థులు కోర్సు ఫీజులు ఎలా చెల్లించాలి. పథకం ప్రారంభించిన రోజు విద్యార్థుల చదువు పూర్తి భాద్యత ప్రభుత్వం అని ప్రకటించి , నేడు ప్రటనలకు మాత్రమే ఇస్తున్నారు మరియు చేస్తున్నారు. ఇచ్చిన మాట గాలి బుడగలా తేలిపోయింది.

తక్షణమే జీవో నెంబర్ 77 రద్దు చేసి ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ కొనసాగించాలి. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో నేటికీ సరైన తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించాలి.

LEAVE A RESPONSE