క్యాసినో వ్యవహారాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తాం
• ఈడి, డిఆర్ఐ, ఎన్ సిబిలతో కేంద్ర దర్యాప్తు సంస్థలన్నింటికీ ఫిర్యాదుచేస్తాం
• మంత్రి కొడాలిపై చర్యలు తీసుకునేవరకు వదిలిపెట్టం
• వేలాది మహిళలు పుస్తెలు తెగడం చిన్న విషయమా?
• టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య విలేకరుల సమావేశం వివరాలు:
అమరావతి: గుడివాడలో క్యాసినో నిర్వహణకు సంబంధించి తెలుగుదేశం పార్టీ తరపున గతనెల 17వతేదీన కృష్ణా జిల్లా ఎస్పీకి ఫిర్యాదుచేసే నాటికి అక్కడ సామగ్రి అప్పటికీ ఇంకా పూర్తిగా డిస్ మ్యాంటిల్ కాలేదు…ఇంకా తొలగిస్తూనే ఉన్నారు. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు వెళ్లి ఉంటే అసలు దోషులు దొరికేవారు కాదా? 10 నుంచి 15మంది లేపితే కానీ లేవనంత బరువు గరువుగల సామగ్రి, ఫైవ్ స్టార్ హోటల్ లో వేసే అధునాతన కార్పెట్, 7 ట్రక్కుల్లో లోడ్ చేసుకుని వెళ్లి గుడివాడ కె.కన్వెన్షన్ సెంటర్ ప్రాంగణంలో బాహుబలి సినిమాను తలపించే రీతిలో సెట్టింగ్ వేశారు. వెళ్లారు.
మేం ఫిర్యాదు చేశాక 20రోజులు గడిచినా విచారణ ఎందుకు పూర్తిచేయలేదు, నూజివీడు డిఎస్పీ రిపోర్టు ఏమైంది? కొందరు పోలీసులు ఈ వ్యవహారం సద్దుమణిగి పోయిందిలే అనుకుని పొరబడుతున్నారు. మేం దీనిని వదిలేది లేదు. మంత్రి కొడాలి నేతృత్వంలో క్యాసినో జరిగిందా, లేదా? గుడివాడలో అసాంఘిక కార్యకలాపాలు జరిగితే ఇతర రాష్ట్రాల పోలీసులకు కంప్లెయింట్ చేయాలా? రిపోర్టు సమర్పించడానికి ఇన్నిరోజులు ఎందుకు?
బంటుమిల్లి ప్రాంతంలో సామగ్రి ఉందని మాకు సమాచారం వస్తే ప్రెస్ మీట్ పెట్టి చెప్పా, విచారణ చేయాల్సిన బాధ్యత మీది కాదా? క్యాసినోలో రూ.500 కోట్ల లావాదేవీలు జరిగాయంటే ఎన్ని వేలమంది మహిళల పుస్తెలు తెగి ఉంటాయి? ఎన్ని కుటుంబాలు బజారునపడ్డాయి, పోలీసులు ఎందుకు సీరియస్ గా తీసుకోలేదు? డీజిపికి ధైర్యం ఉంటే చెప్పమనండి అక్కడి క్యాసినో జరగలేదని? ఎందుకు మౌనంగా ఉన్నారో సమాధానం చెప్పగలరా? మీరు ఎంక్వయిరీ చేయరు, మేం తెలుసుకోవడానికి వెళ్తే కుట్రకేసులు పెడతారా? ఇదే సాధారణ వ్యక్తులయితే మామూలుగా వదులుతారా, చిత్తశుద్దితో పోలీసులు వ్యవహరిస్తే రెండురోజుల్లో ఈ కేసు విచారణను తేల్చేయొచ్చు.
గుడివాడ హోటల్ ఇందిరా గ్రాండ్ లో సంక్రాంతి మూడురోజుల్లో 36మంది యువతులను గోవానుంచి రప్పించారు. తొమ్మిది కార్లలో వారిని గన్నవరం నుంచి గుడివాడ తరలించారు. వారితో క్యాసినో నిర్వహించడం, చీర్ గర్ల్స్ డ్యాన్సులతోపాటు అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించినట్లు మా వద్ద పక్కా సమాచారం ఉంది. గుడివాడ టుటౌన్ పోలీసులు, ఐడి పార్టీ, జనరల్ డ్యూటీ పోలీసులు, గుడివాడ డిఎస్పీవిచారిస్తే ఈ కేసును తేల్చడం పెద్దపనేం కాదు.
రెండురోజుల్లో పూర్తిచేసే రిపోర్టు ఇంతవరకు ఎందుకు రాయలేదు, అమాయకుడైన నూజివీడు డిఎస్పీ సత్యానందంని విచారణకు వేశారు, రిపోర్టు ఇవ్వడానికి ఇన్నిరోజులు ఎందుకు పట్టింది? నామరూపాలు లేకుండా క్యాసినో ఆధారాలన్నీ మాయం చేశాక వెళతారా?
17వతేదీన మేం ఫిర్యాదు చేసే సమయానికి సామగ్రి డిస్ మ్యాండిల్ జరుగుతోంది, గుడివాడ ఇందిరా గ్రాండ్ లో గోవా యువతులకు, అతిధి హోటల్ లో క్యాసినో నిర్వాహణలో కీలక సూత్రధారిగా వ్యవహరించిన ప్రవీణ్ చికోటి టీమ్ కు రూమ్ లు పెట్టారు. ఈ కేసును మసిపూసి మారేడుకాయ చేయాలని డీజిపి చూస్తున్నారు, ముఖ్యమంత్రి కిమ్మనడం లేదు. వెంటనే రిపోర్టు బహిర్గతం చేయాలి. తెలుగుదేశం పార్టీకి నలుగురు ఎంపిలు ఉన్నారు.
ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్, డిఆర్ఐ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖలకు ఫిర్యాదుచేయడంతోపాటు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో క్యాసినో వ్యవహారాన్ని ప్రస్తావిస్తాం. వందల కోట్ల రూపాయలు చేతులుమారి వేలాది ఆడపడుచుల పుస్తెల తెగిన ఈ వ్యవహారంలో మంత్రి కొడాలి నానిపై చర్య తీసుకునే వరకు
తెలుగుదేశం పార్టీ వదిలేది లేదు.డీజీపీ పోలీస్ డిపార్ట్ మెంట్ గౌరవాన్ని మసకబారేలా ఎందుకు వ్యవహరిస్తున్నారు, ఇప్పటికే మీ వ్యవహార శైలి వల్ల పోలీసు వ్యవస్థ ప్రతిష్ట దెబ్బతింది, ఇంకా పోలీసుశాఖ గౌరవాన్ని దిగజార్చకండి.
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ
నిజనిర్థారణకు వెళితే మామీద అక్రమ కేసుపెట్టి అరెస్ట్ చేస్తారా? డిఐజిని కలవడానికి టిడిపి బృందం ఏలూరు వెళ్తే అపాయింట్ మెంట్ ఇవ్వలేదు, డీజీపి ఆఫీసు గేట్ వద్దే ఆపేశారు. క్యాసినో జరిగిన తీరుపై అధ్యక్షుల వారికి పూర్తి నివేదిక ఇచ్చాం, గవర్నర్ ను కలిశాం, ఇప్పటివరకు కనీసం స్పందన లేదు, డీజీపికి చీమకుట్టినట్లు లేదు.. చారిత్రాత్మక పట్టణమైన గుడివాడ పట్టణం ప్రతిష్టను మసకబార్చారు.ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఏమీ జరగనట్లుగా నటిస్తే మా పోరాటం ఆగదు. వందల కోట్ల దోపిడీని బయటపెట్టే వరకు జాతీయస్థాయిలో పోరాటం కొనసాగిస్తాం.
మాజీ ఎంపి కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ
గుడివాడలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన క్యాసినోలో వందలకోట్లు చేతులుమారాయి, గుడివాడకు గోవాకల్చర్ తెచ్చారు, ఇటువంటిది భారతదేశంలో గతంలో ఎక్కడా జరగలేదు, సాంప్రదాయం పేరుతో క్యాసినో నిర్వహించారు. దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా జనవరి 17న కృష్ణా ఎస్పీకి ఫిర్యాదు చేశాం., నిర్వాహకులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదు ఇస్తే చర్యలు తీసుకోకపోగా, ఫిర్యాదుచేసినా మాపై తప్పుడు సెక్షన్లు పెట్టారు. తప్పుచేసిన వారిని జైలులో పెట్టడం మీకు చేతకాలేదు, క్యాసినోపై ఎస్పీ, డిఐజి, డిజిపి, గవర్నర్ కు కలిసి ఫిర్యాదుచేశాం, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఫిర్యాదుచేస్తే చర్యలు లేవు. బొండా ఉమ, ముళ్లపూడి రమేష్ పై దాడిచేసిన వారిపై చర్యలు లేవు, నిజనిర్థారణకు వెళ్లిన మాపై మాత్రం కేసులు బనాయించారు, ఈ విషయంలో అసలు దోషులను శిక్షించేవరకు పోరాటం ఆపేది లేదు.
టిడిపి క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ
రాష్ట్రంలో ఎప్పుడూ క్యాసినోవంటి అసాంఘిక కార్యకలాపాలు జరగలేదు, సంక్రాంతి రైతులు చేసుకునే సంప్రదాయ పండుగ, అటువంటి పండుగను ఇలా దిగజార్చడం దారుణం, రాష్ట్రంలో మేం ఎక్కడా ఫిర్యాదు చేయలేదు, గుడివాడలో జరిగింది కాబట్టే ఫిర్యాదుచేశాం, బాధ్యులందరిపై చర్య తీసుకునే వరకు వదలిపెట్టం.
అంగన్ వాడీ వర్కర్స్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత మాట్లాడుతూ…
సంక్రాంతి సంబరాల్లో భాగంగా గుడివాడ కొడాలి నాని కె.కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన అసాంఘిక కార్యకలాపాలు రాష్ట్రప్రజలంతా చూశారు అధికారంలోకి వచ్చేవరకు ఆడబిడ్డలను గౌరవిస్తానని చెప్పిన జగన్ రెడ్డి… మంత్రి కొడాలి ద్వారా క్యాసినో నిర్వహించి మహిళలను అడ్డుపెట్టుకొని 300 నుంచి 500 కోట్లు సంపాదించారు, గన్నుకన్నా ముందు జగన్ వస్తానన్నారు, ఎక్కడకు వచ్చారు?
చిత్తశుద్ది ఉంటే పారదర్శకంగా విచారణ జరపాలి. మమ్నల్ని ఉగ్రవాదుల్లా పామర్రు స్టేషన్ కు తీసుకెళ్లారు, రాష్ట్ర మంత్రి కొడాలి కేబినెట్ తర్వాత జరిగిందని నిరూపిస్తే కిరోసిన్ పోసి తగులబెట్టుకుంటానన్నారు, మీరు కనపడితే ఈరోజు రాష్ట్ర మహిళలు మహిళలు బూడిద కూడా మిగిల్చేలా లేరు, ఎంతదూరమైనా తీసుకెళ్లి క్యాసినో సంస్కృతిని తీసుకొచ్చిన కొడాలిని మంత్రివర్గం నుంచి బర్త్ రఫ్ చేసేవరకు వదలం.