Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి యథేచ్ఛ పాతర

– మున్సిపల్‌ ఉప ఎన్నికల్లో టీడీపీ అరాచక పర్వం
– మాజీ మంత్రి జోగి రమేష్‌ ఆగ్రహం

తాడేపల్లి: కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పాతరేసిందని మాజీ మంత్రి, వైయస్సార్‌సీపీ సీనియర్‌ నేత జోగి రమేష్‌ మండిపడ్డారు. మున్సిపల్‌ ఉప ఎన్నికల్లో టీడీపీ అరాచక పర్వం చూసి ప్రజాస్వామికవాదులు నివ్వెర పోతున్నారని ఆయన తెలిపారు. అధికార దుర్వినియోగంతో మున్సిపాలిటీల్లో మెజారిటీ లేకపోయినా సరే గద్దెనెక్కాలని తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలు, దాడులతో దిగజారుడు రాజకీయం చేస్తోందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జోగి రమేష్‌ చెప్పారు.

మున్సిపల్‌ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల దౌర్జన్యాలకు, అరాచకాలకు, అక్రమాలకు పాల్పడ్డారో ప్రజలు గమనించారు. చంద్రబాబు పాలనను చూసి ప్రజలు విస్తుపోతున్నారు. చంద్రబాబు చెప్పేది ఒకటి, చేసేది మరొకటి.

ఇతర పార్టీల వారు టీడీపీలోకి రావాలంటే తమ పదవులను విడిచిపెట్టి రావాలని గతంలో ఎంతో నైతిక విలువలను పాటించే వ్యక్తిగా ప్రకటించారు. కానీ నేడు రాష్ట్రంలో మున్సిపల్‌ ఉప ఎన్నికల్లో ఎలాంటి ఫిరాయింపులు చేయిస్తున్నారో చూస్తే.. చంద్రబాబు రెండు నాలుకల దోరణితో ఎలా వ్యవహరిస్తారో అందరికీ అర్థమవుతోంది.

రాష్ట్రంలోని ఏ కార్పోరేషన్, మున్సిపాలిటీలోనూ మున్సిపల్‌ ఉప ఎన్నికలలో పోటీ చేసే కనీస మెజారిటీ కూడా కూటమి పార్టీలకు లేదు. డిప్యూటీ మేయర్, మున్సిపాలిటీల ఛైర్‌పర్సన్స్, వైస్‌ ఛైర్‌పర్సన్స్‌ ఎన్నికల్లో కనీస మెజారిటీ లేకుండా మీ అభ్యర్ధులను ఎలా పోటీకి నిలబెట్టారు?

LEAVE A RESPONSE