ఆరోగ్య రంగంలో తెలంగాణ టాప్

– వెల్లడించిన నీతి అయోగ్
– పురోగమిస్తున్న రాష్ట్రంలో మొదటి స్థానం..
– హెల్త్ ఇండెక్స్ రేటింగ్ లో 3వ స్థానం..
– హర్షం వ్యక్తం చేసిన ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు..

సీఎం కెసిఆర్ నేతృత్వంలో ఆరోగ్య తెలంగాణ సాకారం దిశగా అడుగులు వేస్తున్నామని మరోసారి రుజువైంది. ఆరోగ్య రంగంలో రాష్ట్రం మ‌రో ఘ‌న‌త‌ను సాధించింది. నీతి ఆయోగ్ విడుద‌ల ఈరోజు విడుదల చేసిన 4వ ఆరోగ్య సూచీలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో అన్ని రాష్ట్రాల్లో వైద్యారోగ్య రంగం పురోగతిని నీతి అయోగ్ విశ్లేషించి నివేదిక రూపొందించింది.

2018-19లో తెలంగాణ 4వ స్థానంలో ఉండగా, 2019-20లో మూడో స్థానానికి చేరింది. పెద్ద రాష్ట్రాల కేటగిరీలో కేర‌ళ మొదటి స్థానంలో, త‌మిళ‌నాడు రెండో స్థానంలో నిలువగా తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. ఆరోగ్యం రంగంలో పురోగమిస్తున్న రాష్ట్రంగా మొదటి స్థానంలో నిలిచింది..ముఖ్య‌మంత్రి కేసీఆర్ మొదటి నుంచి ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి.. ప్ర‌భుత్వ దవాఖానలను బలోపేతం చేస్తున్న విష‌యం తెలిసిందే.

అన్ని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో మౌలిక వ‌స‌తులు క‌ల్పిస్తూ, నాణ్య‌మైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం అహ‌ర్నిశ‌లు కృషి చేస్తున్నదని చెప్ప‌డానికి ఈ ర్యాంకు నిద‌ర్శ‌నం. అనేక అంశాల్లో తెలంగాణ మెరుగు పడిందని నీతి అయోగ్ వ్యాఖానించింది. మోస్ట్ ఇంప్రూవ్డ్ కేటగిరీలో తెలంగాణలో మొదటి స్థానంలో నిలిచింది.

మోస్ట్ ఇంప్రూవ్డ్ కేటగిరీలో తెలంగాణలో మొదటి స్థానం, ఆరోగ్య సూచిలో టాప్ – 3 లో నిలవడం పట్ల మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కెసిఆర్ నేతృత్వంలో ఆరోగ్య తెలంగాణ సాకారం అవుతుందని, ఇందుకు ఇటీవల వరుసగా వస్తున్న ప్రశంసలే నిదర్శనమని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కి అభినందనలు తెలిపారు.

తలసరి ఖర్చులోనూ టాప్-3
వైద్యం పై తెలంగాణ పెద్ద మొత్తంలో ఖ‌ర్చుచేస్తున్నదని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఇటీవల రాజ్యసభలో తెలిపింది. ప్రజా వైద్యం పై ప్రభుత్వాలు చేస్తున్న తలసరి ఖర్చు విషయంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉన్నదని వెల్లడించింది. ఒక్కో వ్య‌క్తిపై చేస్తున్న త‌ల‌స‌రి ఖ‌ర్చు రూ. 1698 గా ఉన్నది. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, కేర‌ళ త‌ర్వాత తెలంగాణ నిలిచింది.

హెల్త్ ఛాంపియన్ గా తెలంగాణ..
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నవంబర్ 16 తేదీ నుండి డిసెంబర్ 13 వరకు “హెల్దీ అండ్ ఫిట్ నేషన్” క్యాంపెయిన్ నిర్వహించింది. మూడు కేటగిరీల్లో అవార్డులు ప్రకటించగా తెలంగాణకు రెండు దక్కాయి. తద్వారా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. వెల్నెస్ యాక్టివిటీస్ లో దేశంలోనే మొదటి స్థానంలో, నాన్ కమ్యూనికబుల్ డిసీసెస్ స్క్రీనింగ్ లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. డిసెంబర్ -13న యూనివర్సల్ హెల్త్ కవరేజి డే-2021 సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో అవార్డులను బహూకరించింది.

Leave a Reply