– రేవంత్, భట్టి నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు ఇంకా ఎందుకు మొదలుపెట్టలేదు?
– రాహుల్ గాంధీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయాలి
– జాబ్ క్యాలెండర్ ఎక్కడ రాహుల్?
– బీ ఆర్ ఎస్ నేత డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్
హైదరాబాద్: అహ్మదాబాద్ విమాన ప్రమాదం దురదృష్టకరం. తెలంగాణలో విద్యా వ్యవస్థ దారుణ స్థితిలో ఉంది. రేవంత్ రెడ్డి పాలనలో విద్యా వ్యవస్థ కుదేలు అయింది. మోడీకి రాహుల్ గాంధీ దేశంలో విద్యా వ్యవస్థపై లెటర్ రాశారు.
బీహార్ రాష్ట్రం దర్బంగా జిల్లాలో నేను ఒక స్కూల్ కు వెళ్తే అక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని రాహుల్ గాంధీ లేఖ రాశారు. రాహుల్ గాంధీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయాలి. బీహార్ కన్నా ఘోరమైన సమస్యలు తెలంగాణ విద్యా వ్యవస్థలో ఉన్నాయి
కాలేజీ వెళ్లే ప్రతి అమ్మాయికి స్కూటీలు ఇస్తామని హామీలు ఇచ్చారు. కేసీఆర్ హయాంలో విద్యా వ్యవస్థ వెలుగు వెలిగింది. కేసీఆర్ సీఎం అయ్యాక 660 గురుకులాలు పెట్టారు. సైనిక,న్యాయ,ఫ్యాషన్, మెడికల్,సంగీతం కాలేజీలు ఏర్పాటు చేశారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి,జ్యోతిరావు పూలే విద్యానిధి కింద 20 లక్షలు ఇచ్చారు.
కేసీఆర్ బ్రేక్ ఫాస్ట్ పధకం ప్రవేశపెట్టారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక బ్రేక్ ఫాస్ట్ పధకాన్ని రద్దు చేశారు. మన ఊరు మన బడి కింద పాఠశాలలు అభివృద్ధి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కావాలని విద్యా శాఖను తనవద్ద ఉంచుకున్నారు. కావాలనే విద్యా రంగాన్ని సీఎం నాశనం చేస్తున్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారు.
ఒక్కో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు 200 కోట్లు ఇస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది. 2,560 మంది విద్యార్థులను ఒకే చోట ఉంచి పాఠాలు చెప్తామని సీఎం అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫోటో షాప్ ప్రభుత్వంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్స్కూల్ పనులు ప్రారంభం కాలేదు. కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి రాజ్యంగేతర శక్తిగా ఉన్నారు.
డిప్యూటీ సీఎం భట్టి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు స్టార్ట్ చేయలేదు. రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు రాహుల్ గాంధీకి కనిపించడం లేదా? స్కూళ్లల్లో శానిటేషన్ అత్యంత దారుణంగా ఉంది. విద్యార్థులు ఎవరి టాయిలెట్స్ వారే కడుక్కోవాలని ఐఏఎస్ అధికారి అంటున్నారు. జాతీయ ఎస్సీ కమీషన్, జాతీయ బాలల హక్కుల కమీషన్ ఐఏఎస్ అధికారికి నోటీసులు ఇచ్చింది
స్కూళ్లలో కంప్యూటర్లు, ఇంటర్ నెట్ లేకుండా విద్యార్థులు ఎట్లా ఏఐ నేర్చుకుంటారు? మేము గురుకుల బాట చేపడితే మాపైన కేసులు
పెట్టారు. గౌలిదొడ్డిలో గురుకుల విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేశారు. కామన్ సెన్స్ లేని అధికారులు విద్యా శాఖలో ఉన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులను గురుకులాల్లోకి రానివ్వడం లేదు. సర్దుబాటు పేరుతో ప్రభుత్వ స్కూళ్లను మూసేస్తున్నారు.
నాయిని రాజేందర్ రెడ్డి, బల్మూరి వెంకట్ బలుపు మాటలు మాట్లాడుతున్నారు. మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మిమ్మల్ని తెలంగాణ ప్రజలు తరిమికొట్టడం ఖాయం. మీలాగా సెక్రటేరియట్ లో కూర్చుని కమీషన్ల కోసం ఆరాటపడటం లేదు. మీలాగా ఢిల్లీకి మూటలు మోసే సంస్కృతి మాకు లేదు. గాంధీ భవన్ లో కూర్చుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఉంది రాహుల్?