– నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచేయి
– టిపిసిసి చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్
హైదరాబాద్: ‘‘ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయించింది శూన్యం . తెలుగు కోడలు అయి ఉండి కూడా నిర్మలా సీతారామన్ తెలంగాణపై అభిమానం చూపించలేకపోయారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోం ది. రాజకీయంగా రాష్ట్రాన్ని దెబ్బతీయాలని చూస్తోంద ’’ ని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎంపీలు కేంద్రమంత్రులను, ప్రధానమంత్రిని కలిసి తెలంగాణకు రావాల్సిన అనేక అంశాలపై విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆయన అన్నారు. తెలంగాణకు అవసరమైన అంశాల్లో కేంద్రం సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
త్వరలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున ఆ రాష్ట్రంలో రాజకీయ లబ్ధి కోసం భారీగా కేటాయింపులు చేశారని, తెలంగాణ ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇతర బీజేపీ నేతలు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.