Suryaa.co.in

Andhra Pradesh

ఘోర బస్సు ప్రమాదం

busపశ్చిమగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం జంగారెడ్డిగూడెం సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి జల్లేరు వాగులో పడింది. బస్సు రెయిలింగ్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు మృతి చెందగా… పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో 58 మంది ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే బస్సు కిటికీల నుంచి దూకి పలువురు ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకున్నారు. బస్సు వేలేరుపాడు పేట నుంచి జంగారెడ్డిగూడెం వెళ్లుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు వాగులో పడిన వెంటనే స్థానికులు, వాహనదారులు, పోలీసులు, సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను జంగారెడ్డిగూడెం ఆస్పత్రికి తరలించారు. పడవల సాయంతో ప్రయాణికులను స్థానికులు ఒడ్డుకు చేర్చారు.

LEAVE A RESPONSE