అది సీమ ప్రజలను అవహేళన చేయడమే!

Spread the love

“హత్యల జిల్లా కడపకు విమానాశ్రయం” ఎందుకంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు గారు వ్యాఖ్యానించడం వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతాన్ని, కడప జిల్లా ప్రజలను అపహాస్యం చేసినట్లుగా,

అవమానించినట్లుగా భావిస్తున్నాను.సాహిత్య, రాజకీయ రంగాలలో ఘనమైన చరిత్ర ఉన్న జిల్లా కడప. రాయలసీమకు నడిబొడ్డు. ముంబాయి – చెన్నయ్ రైలు మార్గం, హైదరాబాదు – చెన్నయ్ జాతీయ రహదారి కడప జిల్లా మీదుగా ఉన్నాయి. దశాబ్దాల క్రితమే విమానాశ్రయం నెలకొల్పబడింది. కానీ, ప్రభుత్వాల నిర్లక్ష్యం మూలంగా అభివృద్ధికి నోచుకోలేదు.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014 మేరకు కడప ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పకుండా, రాయలసీమ – ఉత్తరాంధ్ర అభివృద్ధి పథకాన్ని అమలు చేయకుండా మోడీ ప్రభుత్వం దగా చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న సొమవీర్రాజు గారు చేతనైతే వెనుకబడ్డ, కరవు పీడిత రాయలసీమ ప్రాంత అభివద్ధికి దోహదపడే అంశాలపై మాట్లాడాలి. బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా గర్హిస్తున్నా.

t-laxminarayana
-టి.లక్ష్మీనారాయణ, సామాజిక ఉద్యమకారుడు

Leave a Reply