ఆ మార్చ్ అబద్దాల మార్చ్

Spread the love

-ఆ మార్చ్ లో నిరుద్యోగులు లేరు అడ్డ మీద కూలీలే ఉన్నారు
-లక్ష 32 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వం భర్తీ చేసింది
-బీ ఆర్ ఎస్ ది గాంధీ సిద్ధాంతం బీజేపీ ది గాడ్సే సిద్దాంతం
-మోడీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు
-వాటి గురించి బీజేపీ మోడీ ని నిలదీయాలి
-ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ పోచం పల్లి శ్రీనివాస్ రెడ్డి, కార్పోరేషన్ చైర్మన్ కె. వాసుదేవ రెడ్డి

నిన్న వరంగల్ లో బీజేపీ రాజకీయ నిరుద్యోగుల మార్చ్ జరిగింది.ఆ మార్చ్ అబద్దాల మార్చ్. బీజేపీ కి నిరుద్యోగుల గురించి మాట్లాడే హక్కు లేదు. బీజేపీ కి తెలంగాణ లో నిరుద్యోగుల మార్చ్ చేసే అర్హత లేదు.చేస్తే ఢిల్లీ లో చేయాలి. మోడీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు వాటి గురించి బీజేపీ మోడీ ని నిలదీయాలి. పేపర్ లీకు వీరులు నిరుద్యోగ మార్చ్ చేయడం హాస్యాస్పదం. ఆ మార్చ్ లో నిరుద్యోగులు లేరు అడ్డ మీద కూలీలే ఉన్నారు. నిరుద్యోగులు ప్రభుత్వం కల్పించిన వసతులతో పరీక్షలకు సిద్ధమవుతున్నారు.రోడ్ల మీదకు ఎవ్వరూ నిరుద్యోగులు లేరు. లక్ష 32 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వం భర్తీ చేసింది.వివిధ దశల్లో మిగతా ఉద్యోగాల భర్తీ సాగుతోంది.దొంగే దొంగ అన్నట్టుగా బీజేపీ తీరు ఉంది. పదో తరగతి పేపర్ల లీకేజీ కుట్ర దారు అని వాట్సాప్ చాట్ లతో రుజువైంది. బీ ఆర్ ఎస్ ది గాంధీ సిద్ధాంతం బీజేపీ ది గాడ్సే సిద్దాంతం. ప్రశాంతంగా ఉన్న తెలంగాణ లో బీజేపీ చిచ్చు పెట్టాలనుకుంటోంది.అంబేద్కర్ ఆలోచన విధానాల కనుగుణంగా విద్య, వైద్య రంగాల కు కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారు.

కేసీఆర్ ను గద్దె దిగాలని బీజేపీ నేతలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఎందుకు కేసీఆర్ గద్దె దిగాలి? రైతు బంధు, ఇతర సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందుకు కేసీఆర్ గద్దె దిగాలా? ఏదైనా ప్రశ్నించాలనుకుంటే ఢిల్లీ లో ప్రశ్నించాలి. విభజన చట్టం అమలుకు ఢిల్లీ లో బీజేపీ ధర్నా చేయాలి.. మేము కూడా మద్దతు ఇస్తాం.125 అడుగుల అంబెడ్కర్ విగ్రహం దగ్గరకు బీజేపీ నేతలు రండి.. అభివృద్ధి పై చర్చిద్దాం.కేంద్రం చేసిన అభివృద్ధి ఏమిటో రాష్ట్రం చేసిందేమిటో తేల్చుకుందాం. మతం కులం ఆధారంగా బీజేపీ ప్రజలను విడగొడుతోంది. ఆ కుట్రలను బీ ఆర్ ఎస్ తిప్పి కొడుతుంది.

కుటుంబ పాలన తెలంగాణ లో అమలు కావడం లేదు. కేసీఆర్ కుటుంబం కాదు తెలంగాణ కుటుంబ పాలన తెలంగాణ లో అమలవుతోంది.బీజేపీ లో కుటుంబ రాజకీయాలు చాలా రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. మాట్లాడితే కేసీఆర్ కుటుంబం గురించి తప్ప బీజేపీ దగ్గర సబ్జెక్టు లేదు.దమ్ముంటే తెలంగాణ కంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కువ సంక్షేమం అమలు చేయండి. కేసీఆర్ ముందు బీజేపీ కుప్పి గంతులు నడవవు.దేశం కేసీఆర్ వైపు వస్తోంది. ఢిల్లీ లో ఏర్పడేది బీ ఆర్ ఎస్ ప్రభుత్వమే. బీజేపీ నేతలు దమ్ముంటే తెలంగాణకు itir తేవాలి. బుద్ది తెచ్చుకుని బీజేపీ నేతలు ప్రవర్తించాలి.

ఎమ్మెల్సీ పోచం పల్లి శ్రీనివాస్ రెడ్డి…
బీజేపీ నేతలు కేంద్రం లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ గురించి మాట్లాడాలి.మోడీ 2 కోట్ల ఉద్యోగాలు ఏవీ?ఉన్న ఉద్యోగాలు ఊడ గొడుతోంది.. కొత్త ఉద్యోగాలు నింపడం లేదు.బీజేపీ దమ్ముంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ గురించి శ్వేత పత్రం విడుదల చేయాలి.తెలంగాణ ఉద్యోగాల భర్తీ పై మేం ఇప్పటికే శ్వేత పత్రం ప్రకటించాం.rrb, ssc బోర్డు ల ఉద్యోగాలు ఏవీ? పేపర్ లీకేజీ కుట్ర డారు బండి సంజయ్. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పేపర్ లీకేజీ లు ఎన్ని సార్లు జరిగాయి?అక్కడ సీఎం లు మంత్రులు రాజీనామా చేశారా? కేటీఆర్ ను విమర్శించే స్థాయి మీదా? కేటీఆర్ వల్ల ప్రైవేట్ రంగం లో 20 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. రేపు తెలంగాణ లో బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పే దమ్ము ఉందా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు.కేసీఆర్ హ్యాట్రిక్ సాధించ బోతున్నారు. మా బలం, బలగం ఏమిటో తెలంగాణ ప్రజలకు తెలుసు. రెండు సార్లు అధికారం లోకి వచ్చాము మా బలగం తెలియదా? కేటీఆర్ ను విమర్శిస్తే తగిన సమాధానం చెబుతాం. tspsc గురించి కనీస అవగాహన లేకుండా మాట్లాడే బండి బీజేపీ అధికారం గురించి మాట్లాడుతున్నారు. నిరుద్యోగులను చదువుకోవద్దు అని బండి రెచ్చ గొడుతున్నారు.అడ్డంగా దొరికిన దొంగ బండి. 22 కోట్ల మంది ఉద్యోగాల కోసం కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నారు.. బీజేపీ వాటి మీద మాట్లాడాలి.

Leave a Reply