కేంద్ర పెద్దలకు తెలుగు ప్రజలంటే లోకువ

133

– కాంగ్రెస్ చేసిన అన్యాయం కంటే బీజేపీ చేసిన మోసం ఎక్కువ

ఎప్పుడో 2014 లో రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు , కాంగ్రెస్ పార్టీ సరిగ్గా డీల్ చేయకపోవటం వలన ఆంధ్రా, తెలంగాణా, రెండు రాష్ట్రాలు బాగా నష్టపోయాయని ప్రస్తుత కేంద్ర పెద్దలు పదే పదే చెబుతుంటారు.
2014 నుండీ నష్టపోయిన రెండు రాష్ట్రాలకు, కేంద్రం చేసిన సహాయం ఏమిటి ?
ఆంధ్రాకి స్పెషల్ స్టాటస్ ఇస్తారా ?
వెనుక పడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు సరిగా ఇస్తారా ?
వైజాగ్ రైల్వే జోన్ ఇస్తారా ?
పోలవరం ప్రాజెక్ట్ వ్యయం పెరిగితే మాకు సంబంధం లేదని దాన్ని మధ్యలో ఆపకుండా పూర్తి చేస్తారా?
అమరావతి ని రద్దు చేసి మూడు రాజధానులు చేయకుండా అపుతారా?
కడప ఉక్కు ఫాక్టరీ, కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్ష్ , రామాయపట్నం పోర్ట్ చేస్తారా?
లోటు బడ్జెట్ నిధులు ఇస్తారా?
తెలంగాణా నుండి రావాల్సిన ఆస్తులు ఇచ్చే ఏర్పాటు చేస్తారా?

తెలంగాణాకు కూడా ఏమీ చెయ్యలేదు బీజేపీ అగ్ర నాయకులు.
విభజన హామీలు నెరవేర్చలేదు. బయ్యరం ఉక్కు కర్మాగారం లేదు. రైల్వే కోచ్ ఫాక్టరీ లేదు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వలేదు. హైదరాబాద్ కి రావాల్సిన సాఫ్ట్ వేర్ పార్క్ రానీయకుండా చేశారు.
పసుపు బోర్డు ఇస్తానని ఇవ్వలేదు. ఏడేళ్ళయినా విభజన హామీలు నెరవేర్చలేదు.
ఉన్నట్టుండి తెలుగు రాష్ట్రాల మీద కేంద్ర పెద్దలకు ప్రేమ పుట్టుకొచ్చింది ఎందుకో?
రాష్ట్రాల మధ్య అసమానత ను చూపించింది ప్రస్తుత పెద్దలు కాదా ?
రాష్ట్రాన్ని విడగొట్టి “కాంగ్రెస్ చేసిన అన్యాయం కంటే”, ప్రస్తుత పాలకులు, తెలుగు రాష్ట్రాలకు చేసిన మోసం ఎక్కువ . కేంద్ర పెద్దలకు తెలుగు ప్రజలంటే లోకువ
కేంద్ర పెద్దలు తెలుగు రాష్ట్రాలకు చేసిన ద్రోహం క్షమించరానిది.

– రవీంద్ర