ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల నిప్పులు చెరిగారు. నిన్న వైసీపీ చేసిన అరాచకం నేపథ్యంలో ఏపీ పరిస్థితులపై తక్షణమే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం, పోలీసుల ప్రోత్సాహంతోనే నిన్నటి విధ్వంస కాండ చోటు చేసుకుందని… పోలీసులతో కుమ్మక్కై లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కు వైసీపీ పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుండారాజ్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మార్చారని.. ఇది కాన్సిట్యూషన్ మిషనరీ బ్రేక్ డౌన్ అని పేర్కొన్నారు యనమల. ఆర్టికల్ 356 వినియోగానికి ఇదే సరైన సమయమని.. ప్రభుత్వమే కాన్సిట్యూషన్ మిషనరీ బ్రేక్ డౌన్ కు పూనుకుందన్నారు. కాబట్టి ఆర్టికల్ 356 వినియోగం మినహా మార్గాంతరం లేదని… ఏపీలో కాన్సిట్యూషన్ బ్రేక్ డౌన్ అయ్యిందనడానికి ఇంతకన్నా సాక్ష్యం అక్కర్లేదని చెప్పారు యనమల. ప్రభుత్వ ప్రోత్సాహం, పోలీసుల అండదండలతోనే వైసిపి ఈ నేరానికి-ఘోరానికి తెగించిందని మండిపడ్డారు.