ప్రతి ఎకరాకు ముఖ్యమంత్రి పరిహారమివ్వాల్సిందే

– జరిగిన నష్టాన్ని ప్రకృతిపైనెట్టేసి, పెయిడ్ ఆర్టిస్ట్ లతో సిగ్గుమాలినప్రకటనలు చేయించి తనవైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నాడు.
• జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రయ్యాక ఈ రెండున్నరేళ్లలో 7, 8 తుఫాన్లు రాష్ట్రానికివస్తే, దాదాపు 50లక్షల ఎకరాల్లో పంటలుదెబ్బతిని, రూ.20వేలకోట్లవరకు నష్టం వాటిల్లింది.
• వరిగిట్టుబాటుకాదు సాగుచేయవద్దంటున్న జగన్మోహన్ రెడ్డి, తనకుతనపార్టీవారికి గిట్టుబాటు అయ్యే గంజాయి సాగుచేయాలని రైతులకు చెప్పదలుచుకున్నారా?
• వరివేయొద్దని చెప్పడమంటే ఆహారభద్రతకు తిలోదకాలివ్వడమేనని ముఖ్యమంత్రికి తెలియదా?
• వరిపంట వేయ వద్దనిచెప్పడం, తిండిగింజలు లేకుండా చేయడంకాదా? జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన, వ్యవసాయంపట్ల, రైతులపట్ల ఆయన చూపిస్తున్నమోసకారీ సంక్షేమానికి నిదర్శనంకాదా?
– తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి
వరుసతుఫాన్లు, వరదలు, వర్షాలకు తోడు ప్రభుత్వవైఖరి, జగన్మోహన్ రెడ్డి విధానాలతో రాష్ట్ర రైతాంగం నిలువునా మునిగిపోయిందని, తనచేతగానితనాన్ని, అసమర్థతను ప్రకృతిపై నెట్టేస్తున్న ముఖ్యమంత్రిని చూస్తుంటే, ఆయన బాధ్యతారాహిత్యం కొట్టిచ్చినట్టు కనిపిస్తోంద ని టీడీపీనేత, తెలుగురైతు విభాగంరాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టంచేశారు.
బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు . ఆ వివరాలు ఆయన మాటల్లోనే …నవంబర్ లో వచ్చిన వరదలతో రాష్ట్రంలో పెద్దఎత్తున ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగింది. లక్షలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. వేలాదిపశువులు, ఇతరత్రా జీవాలు నీటకొట్టుకుపోయా యి. నెల్లూరుజిల్లాలో ఆక్వారంగం వేలకోట్లునష్టపోయింది. ఇంతజరిగితే రైతాంగానికి, నష్టపో యిన వారికి అండగా నిలవాల్సిన పాలకులు, నెపాన్ని ప్రకృతిపై నెట్టేసి, తప్పించుకోవాలని చూస్తున్నారు.
రాష్ట్రంలో జరిగిన ప్రాణనష్టం, ఆస్తినష్టం ప్రకృతివైపరీత్యాలతో జరిగిందికాదు. ముమ్మాటికీ జరిగిన నష్టము, కోల్పోయిన ప్రాణాలు అన్ని ప్రభుత్వహత్యలుగానే పరిగణించా లి. వరదలు వచ్చినప్పుడు వరదనివారణచర్యలుచేపట్టడంలో ప్రభుత్వందారుణంగా విఫల మైంది. పింఛా ప్రాజెక్ట్ తెగిపోయి, వరదకిందకు ఉధృతంగావెళ్తున్నప్పుడు, అన్నమయ్యప్రా జెక్ట్ లో సామర్థ్యానికి మించి నీటిని నిలువచేసి, చెయ్యేరునదిలో ఇసుకవ్యాపారంచేసేవారి లారీలు, టిప్పర్లు, ఇతరత్రా యంత్రాలు బయటకుపోయేవరకు వేచిచూశారు.
చెయ్యేరులో అధికారపార్టీనేతలు సాగిస్తున్న ఇసుకవ్యాపారంకోసం, అమాయకులైన ప్రజలు, మూగజీవా లతోపాటు, వేలాదిఎకరాల పంటను నీటముంచారు. ఇంతజరిగితే దానికి బాధ్యతవహిం చాల్సిన పాలకులు నష్టమేమీ జరగలేదని నమ్మించడానికి ప్రయత్నించారు. ముఖ్యమంత్రే మో చక్కగా హెలికాఫ్టర్లో చక్కర్లుకొట్టేసి వెళ్లిపోయారు. వరదలు వస్తాయని తెలిసీకూడా ముఖ్యమంత్రి, అధికారులు, మంత్రులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఏపీకి వరదముప్పు ఉందని కేంద్రవిపత్తునివారణసంస్థ చేసినహెచ్చరికలను బేఖాతరుచేస్తూ, ముఖ్యమంత్రి పెళ్లిల్లు, విందులు వినోదాల్లో మునిగితేలడానికి పొరుగురాష్ట్రానికి వెళ్లాడు.
ఉత్తరాంధ్రను ముంచెత్తిన తిత్లీ ప్రళయాన్ని చంద్రబాబునాయుడి ప్రభుత్వం, ఆనాటిఅధికారయంత్రాంగం సమర్థంగా ఎదుర్కొంది. హుద్ హుద్ విశాఖనగరాన్ని అతలాకుతలంచేస్తే, పదిరోజులు బస్సులో అక్కడేఉండి చంద్రబాబుగారు అధికారయంత్రాంగాన్ని పరుగులుపెట్టించి సాగరనగరానికి పూర్వవైభవం తీసుకొచ్చారు, జగన్మోహన్ రెడ్డిలా తానువెళితే అక్కడ పనులకు ఆటంకం కలుగుతుందంటూ కుంటిసాకులుచెప్పి ఇంట్లోకూర్చోలేదు. విందులు , వినోదాలతో కాలక్షేపంచేయలేదు. తాను వరదప్రభావితప్రాంతాల్లో పర్యటిస్తే, సహయచర్యలకు విఘాతమన్నవ్యక్తి, అధికారపార్టీవారు పెయిడ్ ఆర్టిస్ట్ లను సిద్ధంచేశాక తీరుబడిగా బాధితులను పరామర్శించడానికి వెళ్లాడు.
ప్రజలముసుగులో అధికారపార్టీ పెయిడ్ ఆర్టిస్ట్ లు వరదల్లో సర్వంకోల్పోవడం తమతప్పేగానీ, ప్రభుత్వతప్పేమీ లేదని, తామే నిర్లక్ష్యంగా వ్యవహరించామని చెబుతుంటే, ముఖ్యమంత్రి చిరునవ్వులు చిందించాడు. నిజంగా ప్రజలెవరూ కూడా వరదలు వస్తుంటే చూస్తూఊరుకోరు. కళ్లముందు అంతా పోగోట్టు

కొని, ముఖ్యమంత్రివచ్చేవరకు ఎదురుచూస్తారా? పెయిడ్ ఆర్టిస్ట్ లను తెరపైకి తెచ్చి, వారితో పచ్చిఅబద్ధాలుచెప్పించి, వరదలవల్ల జరిగినష్టంలో తన బాధ్యతలేదని తప్పించు కోవడానికే ముఖ్యమంత్రిప్రయత్నిస్తున్నాడుగానీ, వరదల్లో సర్వంకోల్పోయినవారిని మానవవత్వంతో ఆదుకోవడానికి ప్రయత్నించడంలేదు.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రయ్యాక ఈ రెండున్నరేళ్లలో 7, 8 తుఫాన్లు రాష్ట్రానికివస్తే, దాదాపు 50లక్షల ఎకరాల్లో పంటలుదెబ్బతిని, రూ.20వేలకోట్లవరకు నష్టం వాటిల్లింది. రూ.20వేలకోట్ల నష్టంజరిగితే తూతూమంత్రంగా రూ.1073కోట్ల ఇన్ పుట్ సబ్సిడీని మాత్రమే పాలకులు అందించారు. ప్రస్తుతపరిస్థితుల్లో మిర్చిరైతులు, వరిరైతులు తీవ్రంగా నష్టపోయారు. నల్లి, ఇతరత్రా వైరస్ లతో రాష్ట్రవ్యాప్తంగాతీవ్రంగా నష్టపోయిన మిర్చిరైతులు, ఇప్పటికే మిరపపంటలు పీకేస్తున్నా, అధికారులు, ఆర్బీకే సిబ్బంది రైతులముఖం కూడా చూడటంలేదు.
కనీసం మిర్చిపైరుకి వచ్చిన నల్లేమిటో, వైరస్ ఏమిటో కనుక్కొనే ప్రయత్నం కూడా చేయడంలేదు. తనచేతగాని చర్యలతో, అసమర్థతతో రైతుల్ని భూములనుంచి బయటకుగెంటివేసే కుట్రలకు ముఖ్యమంత్రి పాల్పడుతున్నారు. రైతుల్ని గెలిపించి, వ్యవసాయ రంగాన్ని పతాకస్థాయిలోనిలపడంకోసం చంద్రబాబునాయుడు కృషిచేస్తే, ఈ ముఖ్యమంత్రి వ్యవసాయమోటార్లకు మీటర్లు బిగించడానికి సిద్ధమయ్యాడు. చంద్రబాబునాయుడి హయాం లో రైతులకు సకాలంలో సున్నావడ్డీ రుణాలు అందేవి. రైతు రథాలు, సూక్ష్మపోషకాలు, డ్రిప్ర్ పరికరాలు, నాణ్యమైన విత్తనాలు సబ్సిడీపై అందించేందుకు కృషిచేశారు.
సున్నావడ్డీని నిర్వీర్యంచేసినట్టే, రాబోయేరోజుల్లో బోర్ల కిందవ్యవసాయం లేకుండా చేయడానికి జగన్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు. దానిలోభాగంగానే నాణ్యమైన విద్యుత్ అంటూ మోటార్లకు మీటర్లు బిగించడానికి సిద్ధమయ్యారు. రాష్ట్రంలోఎలాంటి భూములున్నాయి..ఏ భూముల్లో ఏ ప్రాంతాల్లో ఏఏపంటలు పండుతాయో కూడా తెలియని వ్యవసాయమంత్రి, ముఖ్యమంత్రి వరివేయొద్దంటున్నారు. కృష్ణాడెల్టాప్రాంతంలో వరితప్ప మరో పంటకు అవకాశంలేదు. చివరిభూముల్లో కాస్తోకూస్తో అపరాలసాగుకి అవకాశం ఉంది గానీ, మొత్తంగా అయితే వరితప్ప, మరోపైరుకి అవకాశంలేదు. ఆప్రాంతంలో వరివేయొద్దని చెబుతున్నారంటే ఇక పంటభూములు బీళ్లుపెట్టాల్సిందే. వరివేయొద్దని చెప్పడమంటే ఆహారభద్రతకు తిలోదకాలివ్వడమేననే వాస్తవం ముఖ్యమంత్రికి తెలియదా?
వరిపంట వేయ వద్దనిచెప్పడం, తిండిగింజలు లేకుండా చేయడంకాదా? జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన, వ్యవసాయంపట్ల, రైతులపట్ల ఆయన చూపిస్తున్నమోసకారీ సంక్షేమానికి నిదర్శనంకాదా? టీడీపీప్రభుత్వంలో హెక్టార్ వరికి ఇచ్చే ఇన్ పుట్ సబ్సిడీని రూ.10వేలనుంచి రూ.20వేలకు పెంచితే, జగన్మోహన్ రెడ్డి వచ్చాక రూ.5వేలుతగ్గించి, దాన్ని రూ.15వేలకు పరిమితంచేశాడు. టీడీపీహాయాంలో అరటికి హెక్టారుకి రూ.30వేలుఇస్తే, జగన్ ప్రభుత్వందాన్ని రూ.25వేలకు పరిమితంచేసింది. ఎక్కడైనా వ్యవసాయఉత్పత్తులు, ఖర్చులుపెరిగితే పెంచడంచూశాంకానీ, ఈ ముఖ్యమంత్రిలా ఎవరూ తగ్గించడం చూడలేదు.
చెరకుపంటకు, పత్తికి టీడీపీప్రభుత్వంలో ఎకరాకు రూ.15వేలిస్తే, జగన్ వచ్చాక ఎక్కడా ఒక్కఎకరాకు కూడా రూపాయి పెంచలేదు.జొన్నకు టీడీపీప్రభుత్వంహెక్టారుకి రూ.10వేలు ఇస్తే, జగన్ దాన్ని రూ.6,800లకు తగ్గించాడు. తనరెండున్నరేళ్లపాలనలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడా ఒక్కఎకరాకు ఒక్కరూపాయికూడా ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. ఈ విధంగా అడుగడుగునా అన్నదాతలకు, వ్యవసాయరంగానికి ముఖ్యమంత్రి తీవ్రంగా అన్యాయంచేస్తూనే ఉన్నాడు. తిత్లీ తుఫాన్ సమయంలో చంద్రబాబునాయుడు గారు ఇచ్చిన పరిహారానికి అదనంగా పరిహారంఇస్తాననిచెప్పిన జగన్మోహన్ రెడ్డి, మూడేళ్లు అవుతున్నా ఇప్పటికీ రూపాయి కూడా ఇవ్వలేదు. తెలుగురైతు విభాగం నుంచి ముఖ్యమంత్రి ముందు కొన్ని డిమాండ్లు ఉంచుతున్నాం.
నవంబర్లో వచ్చిన వరదలు,తుఫాన్లకు నష్టపోయిన ప్రతి ఎకరాకు ముఖ్యమంత్రి పరిహారమివ్వాల్సిందే. చనిపోయిన ప్రతి ప్రాణికి (పశువులు, మేకలు, గొర్రెలు,కోళ్ల వంటివి) పరిహారమివ్వాలి. అలానే మరణించిన వారికి ఒక్కొక్కరికి రూ.25లక్షలచొప్పున చెల్లించాలి. దెబ్బతిన్న ఇళ్లను ప్రభుత్వమే తిరిగి నిర్మించాలి. పాక్షికంగా దెబ్బతిన్నఇళ్లకు, ఒక్కోఇంటికి రూ.లక్షచొప్పున పరిహారమివ్వాలి. అలానే చెరకు, అరటి, మామిడి వంటి ఉద్యానపంటలకు హెక్టారుకి రూ.50వేలు, పత్తికి రూ.25వేలు, మిర్చికి కనీసం రూ.50వేలు, అపరాలకు హెక్టారుకి రూ.20వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం.
అలాగే ఎంఎస్ పీని చట్టబద్ధంచేయడంతోపాటు, తడిచిన, రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొని, 48గంటల్లోనే రైతులకు డబ్బులుచెల్లించాలి. నెల్లూరుజిల్లాలో తీవ్రంగా నష్టపోయిన ఆక్వారంగాన్నికూడా ముఖ్యమంత్రి తక్షణమే ఆదుకోవాలి. ముఖ్యమంత్రి ఇవేవీ చేయకుండా వరికి ఉరివేస్తాను… ఆప్ఘనిస్తాన్ లోని పాలకులు వారికి తెలిసిన చీకటివ్యాపారాలతో అక్కడపాలనసాగించినట్లు, ఏపీలో మద్యం, ఇతరమాదక ద్రవ్యాలతో తానుపాలన చేస్తానంటే కుదరదని తేల్చిచెబుతున్నాం. వరిగిట్టుబాటు కావడంలేదని మానేయమంటున్న జగన్మోహన్ రెడ్డి, తనకుతనపార్టీవారికి గిట్టుబాటు అయ్యే గంజాయి సాగుచేయాలని చెప్పదలుచుకున్నారా?