Suryaa.co.in

Andhra Pradesh

ముఖ్యమంత్రి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలి

– టీడీపీ కేంద్రకార్యాలయం సహా, రాష్ట్రవ్యాప్తంగా జరిగిన దాడులు, ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టే చర్యల్లోభాగంగా జరిగినవే
రాష్ట్రంలోఇలాంటి దుర్ఘటన, దుర్మార్గం ఎన్నడూ జరగలేదని, రాష్ట్ర వ్యాప్తంగా ఒకపథకం ప్రకారమే అధికారపార్టీ కనుసన్నల్లో దాడు లు జరిగాయని, టీడీపీనేతలు, కార్యకర్తలు, కార్యాలయాలపై జరిగిన దాడులు అనుకోకుండా జరిగినవికావని, పథకం ప్రకారమే జరిగాయని సీపీఐ రాష్ట్రనాయకులు రామకృష్ణ స్పష్టంచేశారు. బుధవారం ఆయన సీపీఐరాష్ట్రవిభాగం సహాయకార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యులు జంగాల అజయ్ కుమార్ లతో కలిసి టీడీపీ కేంద్రకార్యాలయానికి విచ్చేసి, అక్కడ జరిగిన దారుణాన్ని పరిశీలించారు. టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి, మాజీమంత్రివర్యులు నారాలోకేశ్ టీడీపీ కేంద్రకార్యాలయంపై జరిగిన దాడి వృత్తాంతాన్ని సీపీఐ నేతలకు వివరించారు. తదనంతరం సీపీఐ రామకృష్ణ విలేకరుల తో మాట్లాడారు.
డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే టీడీపీ కేంద్ర కార్యాలయంఉందని, అక్కడదాడి జరిగిందంటే కచ్చితంగా పోలీసు ల ప్రోద్భలంతోనే జరిగిందని రామకృష్ణ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి కి తెలియకుండా ఇక్కడ ఏఘటనా జరగలేదన్నారు. గతరెండేళ్లుగా రాష్ట్రంలో పోలీసులు దారుణంగా విఫలమయ్యారని, దుండగులు టీడీపీ కేంద్రకార్యాలయంపైకి దాడికి వస్తున్నారని పోలీసులకు చెప్పినా వారు స్పందించలేదన్నారు. పోలీస్ శాఖ సకాలంలో స్పందించిఉంటే, టీడీపీ కేంద్రకార్యాలయంపై దాడి జరిగే దికాదన్నారు. అధికారపార్టీ ఏంచెబితే, అదేచట్టమనేలా పోలీస్ శాఖ పనిచేస్తోందని, పక్షపాతంతో వ్యవహరిస్తున్న పోలీసులు ఆఖరికి చట్టాన్నికూడా మర్చిపోయారని రామకృష్ణ ఆక్షేపించారు.
చివరకు అమరావతి దళితరైతులపైనే ఎస్సీ,ఎస్టీ కేసులుపెట్టే స్థితి కి పోలీస్ శాఖ దిగజారిందన్నారు. అధికారంశాశ్వతంకాదనే వాస్త వాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తించాలన్న సీపీఐనేత, అధికారం ఉంది కదా అని పార్టీలపై, నేతలపై దాడిచేయిస్తానంటే చూస్తూఊరుకోర న్నారు. ముఖ్యమంత్రిని ఎవరుఏమన్నా దాడిచేస్తామని, ఊరు కోమని వైసీపీనేతలు బహిరంగంగానే మాట్లాడుతున్నారని, వారి ఆలోచనలు, వైఖరి ఎంతమాత్రం సరైందికాదన్నారు. ప్రతిపక్షాలు గా తాము ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి అనైతిక, రాజ్యాంగవిరుద్ధ చర్యలను ప్రశ్నిస్తూనే ఉంటామని, ఎవరినీ వదిలేదిలేదని రామకృష్ణ తేల్చిచెప్పారు.
రాజ్యాంగబద్దంగా ప్రతిపక్షాలకు కొన్నిహక్కులు ఉంటాయని, వాటిని కాలరాసేలా తనకు అధికారముందని, గూం డాయిజాన్ని ప్రోత్సహిస్తే, అదే గూండాయిజానికి బలయ్యేది కూడా వారేనని రామకృష్ణ హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టేలా వ్యవహరిస్తున్న తీరుని సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, జన సేన, లోక్ సత్తాలు తీవ్రంగా ఖండిస్తున్నాయన్నారు. ప్రజాస్వామ్యా న్ని కాపాడుకోవడానికి మేథావులు, రాజకీయపార్టీలు, ప్రజాసం ఘాలు ముందుకురావాలన్నారు.
డీజీపీ కార్యాలయం పక్కనే ఇటువంటి ఘటనలు జరిగితే, ఎటువంటిచర్యలు తీసుకోలేనిస్థితి లో ఆయన ఉన్నారంటే, అది ఆయనకే సిగ్గుచేటన్నారు. హోంమం త్రి కూడా తక్షణమే తనవ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. టీడీపీకేంద్రకార్యాలయంసహా, రాష్ట్ర వ్యాప్తంగాజరిగిన దాడులపై ముఖ్యమంత్రి తక్షణమే బహిరంగ క్షమాపణలుచెప్పాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE