Suryaa.co.in

Andhra Pradesh

ముఖ్యమంత్రి ఉద్యోగులను వంచించినందుకు ఫలితం అనుభవించి తీరతాడు

– ముఖ్యమంత్రిని కలవడమే పెద్ద వరమన్నట్లుగా సంఘాలనేతలు చంకలు గుద్దుకోవడం సిగ్గుచేటు
– సాధారణ ఉద్యోగులు, వారికుటుంబాల బాధ, వ్యధ ఉద్యోగసంఘాల నేతలు ఎందుకు పట్టించుకోరు?
• టీడీపీనేతగా కాకుండా ఉద్యోగుల తరుపున గతంలో పనిచేసిన ప్రతినిధిగా మాట్లాడుతున్నాను
– టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు

ప్రజలను మోసగించినంత తేలికగా, తమను ముఖ్యమంత్రి వంచిస్తాడని ఉద్యోగులు, ఉద్యోగసంఘాల నేతలు ఊహించిఉండరని, గతంలో ఉద్యోగసంఘనేతల్లో ఒకరు రెండు చేతులతో వైసీపీకి ఓట్లేయించినట్టు చెప్పాడని, అలాచెప్పినవ్యక్తులను మోసం చేయడం ఇంకా తేలికని జగన్మోహన్ రెడ్డికి బాగా అర్థమైనట్టు ఉందని టీడీపీఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు ఎద్దేవాచేశారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

నిన్నసాయంత్రం ముఖ్యమంత్రితో చర్చలు జరిపిందిమొదలు రాత్రంతా ఉద్యోగసంఘాల నేతలకు నిద్రపట్టి ఉండదు. 27శాతం ఐఆర్ ఇచ్చి, ఫిట్ మెంట్ మాత్రం 14.29శాతం కంటే ఇవ్వలేమని చెబితే ఉద్యోగులపరిస్థితి ఎలా ఉంటుందనే ఆలోచన ప్రభుత్వానికి, పాలకులకు లేకపోతే ఎలా? ఉద్యోగసంఘాల నేతలతో నిన్నచర్చలు జరిపిన ముఖ్యమంత్రి స్వగతానికి, సొంతడబ్బా కొట్టుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత

ఇచ్చాడు. తనచేతికి ఎముకలేదని, తన తండ్రి ఏవేవో చేశాడని, కానీ రాష్ట్రఆర్థికపరిస్థితి బాగోలేదని ఏవేవో సన్నాయినొక్కులు నొక్కా డు. ముఖ్యమంత్రి మాటలు గమనిస్తే, అసలు ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చే ఆలోచన ఆయనకు ఉందా లేదా అన్న సందేహంప్రతి ఒక్కరికీ కలుగుతోంది. ఉద్యోగులను మోసగించడానికే ముఖ్యమంత్రి తేనేపూసిన కత్తిలా మాట్లాడుతున్నాడు. ఉద్యోగుల ప్రయోజనాల విషయానికి వచ్చేసరికి కొందరువైసీపీ నేతలు శాస్త్రీయత అంటున్నారు. 27శాతం ఐఆర్ ఇవ్వడానికి ఏ శాస్త్రీయత ఆధారంగా ఒప్పుకున్నారని ప్రశ్నిస్తున్నాం. సీపీఎస్ రద్దుచేస్తామని ఏ శాస్త్రీయత ఆధారంగా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు?

ఇవాళ 14.29శాతం ఫిట్ మెంట్ అని ఏ శాస్త్రీయత ప్రకారం చెబుతున్నారు? రాష్ట్రప్రభుత్వ పే స్కేళ్లకు కేంద్రమిచ్చిన 14.29శాతం ఫిట్ మెంట్ కు ఎలా సరిపోతుంది? ఈ రకమైన అవమానం, ఛీత్కారం ఉద్యోగ సంఘాల నేతలు భరించడం చూస్తుంటే నాకు కూడా వ్యక్తిగతంగా ఇబ్బందిగానే ఉంది. ముఖ్యమంత్రిని కలవడమే పెద్ద వర మన్నట్లుగా ఉద్యోగులు, ఉద్యోగసంఘాలనేతలు భావిస్తున్నారు. చాలారాష్ట్రాల ముఖ్యమం త్రులు ఉద్యోగసంఘాలనేతలతో మాట్లాడటం, కలవడం అరుదుగానే జరుగుతుంది. కానీ ప్రభుత్వప్రధాన కార్యదర్శో, మరొకరో ఉద్యోగులు, ఆయాసంఘాలనేతలతో సంప్రదింపులు జరిపి వారిసమస్యలపరిష్కారానికి కృషిచేయాలి..చేస్తుంటారు కూడా. 14.29 శాతం కంటే ఎక్కువగా ఫిట్ మెంట్ ఇవ్వలేమని ప్రభుత్వం ఖరాకండిగా చెప్పేసింది. రెండు, మూడురోజు ల్లో నిర్ణయం తీసుకుంటామని కూడాచెప్పేశారు. కొందరు ఎంతవస్తే అంతచాలని అనుకునే పరిస్థితులున్నాయి. తెలంగాణ ప్రభుత్వంతో పోలిక వద్దని ముఖ్యమంత్రి చెబుతున్నారు.

మరి అలాంటప్పుడు తెలంగాణ ప్రభుత్వం మాదిరే హెచ్ఆర్ ఏ తగ్గించాలని సెక్రటరీ కమిటీ నివేదిక ఇచ్చినప్పుడు, ముఖ్యమంత్రి దానికి ఎలా సమ్మతించారు? 2021 అక్టోబర్ నాటికి రాష్ట్ర ఆదాయం మొత్తంకలిపి లక్షా25వేల111కోట్లు. తెలంగాణ ఆదాయంచూస్తే 90,586.92 కోట్లు. తెలంగాణ కంటే ఏపీ ఆదాయం రూ.35వేలకోట్లు అదనంగా ఉంది. ఉద్యోగులు కూడా తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఉన్నారు. తెలంగాణతో పోలిస్తే, ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు ఖర్చుపెడుతున్నది 33శాతం మాత్రమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం మద్యం అమ్మకాలు, జీఎస్టీ, పెట్రోల్ డీజిల్ ధరలు, ఇతరత్రా పన్నులరూపంలో బాగాపెరిగిందని కాగ్ నివేదికలే చెబుతున్నాయి. ఆదాయవ్యయాల గురించి ఆర్థికశాఖచెప్పిన లెక్కలన్నీ మా వద్ద ఉన్నాయి. వాటిప్రకారమే ఉద్యోగుల తరపున మాట్లాడుతున్నాం. ఉద్యోగుల డిమాండ్లపై, వారిసమస్యలపై ప్రభుత్వం ఇక నిర్ధార ణకు వచ్చాక, ముఖ్యమంత్రితో చర్చలకు సంఘాలనేతలు వెళ్లకుండా ఉండాల్సింది.

గతంలో చంద్రబాబు 20శాతం ఐఆర్ ఇస్తామనిచెబితే, జగన్మోహన్ రెడ్డి 27శాతంఇస్తాన ని చెప్పాడు. ఆనాడు మా జేఏసీ తరుపున ఎవరమూ చంద్రబాబుని అడగలేదు. 27శా తం ఐఆర్ ఇస్తారంటే సాధారణంగానే దానికంటే ఎక్కువగానే ఫిట్ మెంట్ ఉంటుందని ఉద్యో గులంతా ఆశపడతారు. కానీ ఇంత మోసం చేస్తారా? పీఆర్సీ కమిషన్ నివేదిక కూడా ఇప్ప టికీ ఉద్యోగులకు ఇవ్వలేదు. ఈవిధంగా ఉద్యోగులను, సంఘాలనేతలను మోసగించి, దారు ణంగా వంచించిన ప్రభుత్వం దేశంలో వైసీపీప్రభుత్వంతప్ప మరోటిఉండదు. ఉద్యోగులు ఇప్పటికైనా నీళ్లేవో, పాలేవో తెలుసుకుంటే మంచిది. వారంలో సీపీఎస్ రద్దుచేస్తామని చెప్పిన వారు నేడు అక్కాబావ కబుర్లు చెబుతున్నారు. ప్రభుత్వం అంటేఏమిటో, ఎంత ఫిట్ మెంట్ ఇస్తే దానికి ఎంత ఐఆర్ కలపాలో తెలియకుండానే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నోటికొ చ్చినట్టు హామీలు ఇచ్చారా?

అధికారపార్టీలో ఉద్యోగసంఘాలనేతలు, ఆర్థికవ్యవహారాల గురించి తెలిసినవారుఉన్నారు కదా? వారితో మాట్లాడకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నా రా? ఉద్యోగుల పరిస్థితి పాలు ఇచ్చే ఆవునివదిలేసి, ఈడ్చి తన్నేదున్నపోతు వద్దకు పాత్ర తీసుకొని వెళ్లినట్టుంది. ఉద్యోగసంఘాలనేతలు ఎందుకింతలా దిగజారారు? కావాల్సిన, రావా ల్సిన వాటిపై గట్టిగా డిమాండ్ చేస్తే, తుపాకీ పెట్టి కాల్చేస్తారా? ఇప్పుడుండే ఆయన ఇవ్వలే కపోతే, రేపు వచ్చేఆయన ఇస్తాడు? దానికే ఇంతలా బెంబేలెత్తిపోవాలా? రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఉద్యోగులు కోరినవన్నీ చేయలేనని, అర్థంచేసుకోమని చెప్పారు. కానీ ఉద్యోగులను ఆయన ఇబ్బందిపెట్టలేదు. తనచేతికి ఎముకలేదని చెప్పుకుం టే సరిపోదు… ఇవ్వాలని మనసులో దానగుణం ఉంటేఇస్తారు. కర్ణుడు తనదగ్గర ఏమీ లేకపోతే, తన బంగారు పన్నుని ఊడపెరికి దానమిచ్చాడు.

తెలంగాణ కంటే ఏపీకి రూ.35వేల కోట్లు అధికంగా వచ్చాయి… దానికితోడు పన్నులు,ఛార్జీల మోత మోగిస్తున్నారు. అప్పులు తెస్తున్నారు. ఆ సొమ్మంతా దేనికి వినియోగిస్తున్నారు? ఉద్యోగులవల్లే ఖర్చు ఎక్కువ అవు తుందని సాక్షి మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్, సచివాలయ వ్యవస్థ ఆర్థికంగా రాష్ట్రానికి భారంకాదా? ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపారు. వీటన్నింటి వల్లే ఏటా ప్రభుత్వానికి రూ.6,200కోట్లవరకు ఖర్చుఅవుతోంది. మరి వాటి గురించి సాక్షిపత్రికలో ఎందుకు రాయరు? 2లక్షల పైచిలుకు ఉన్న వాలంటీర్లు , ఆర్టీసీ ఉద్యో గులు, సచివాలయసిబ్బందికి జీతాలు పెంచితే ఏటా రూ.10వేలకోట్లవరకు భారం పడుతుం ది. ప్రభుత్వంలోని వివిధవిభాగాల్లో ఉన్న ఉద్యోగులకు, ఉద్యోగసంఘాలకు ఆ వ్యవస్థలతో ఎలాంటి సంబంధంలేదు.

ఎందుకంటే ప్రభుత్వం ఇష్టపడి ఆ వ్యవస్థలను ఏర్పాటుచేసుకుంది. ఒక దొడ్లో నాలుగుఆవులుంటే, వాటికి తోడు మరోరెండు ఆవులు తీసుకొచ్చి, మేతమాత్రం ఒక మోపే వేస్తానన్నట్లుగా ప్రభుత్వ, ముఖ్యమంత్రి వైఖరి ఉన్నాయి. తాను ఈ విషయా లన్నీ టీడీపీఎమ్మెల్సీగా మాట్లాడటం లేదు. ఒక ఉద్యోగసంఘం మాజీ నాయకుడిగా మాట్లాడుతున్నాను. ఐఏఎస్ లు ఇచ్చిన నివేదికలో ప్రభుత్వం ఇచ్చే గొర్రెతోక పీఆర్సీని అక్టోబర్ 2022 నుంచి అమలుచేస్తామంటున్నారు. ఇచ్చేదే అరకొరా..దాన్నికూడా ఇప్పుడు అమలు చేయరు. అలాంటప్పుడు ఉద్యోగసంఘాలనేతలు అసలు చర్చలకు వెళ్లడమే అనవసరం. ఈ ముఖ్యమంత్రి ఏమీ రాష్ట్రానికి శాశ్వతంకాదు. 2024 వరకు కూడాఉంటాడో లేడో తెలియని పరిస్థితి.

అలాంటి వ్యక్తి గురించి ఆలోచించి ఉద్యోగుల ప్రయోజనాలను గాలికి వది లేస్తారా? ఉద్యోగసంఘం నేత బండిశ్రీనివాసరావు గతంలోతెలిసో, తెలియకో ఒకమాట అన్నారు. ఉద్యోగులు, వారికుటుంబాలు కలిపి 60లక్షలఓట్లున్నాయని, తాముతిప్పాల్సిన చోట చక్రం తిప్పితే, ఎవరైనా సరే దిగిరావాల్సిందే అన్నారు. ఆ మాటప్రకారం ఉద్యోగులు, వారి కుటుంబాలు చేస్తాయో లేదో చూడాలి. ఉద్యోగులు ఈప్రభుత్వం ముఖ్యమంత్రి తీరుతో చెప్పుకోలేని విధంగా మనోవేదనకు గురవుతున్నారు. ఉద్యోగసంఘాలనేతలు ఎన్నిమాటలై నా చెప్పొచ్చుకానీ, సాధారణ ఉద్యోగుల తరుపున ఈప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో అధికారంలో ఉన్నవారి బొమ్మ తిరగబడటం ఖాయం.

వాలంటీర్లపై చూపతున్న ప్రేమలో ఒకవంతుని కూడా ఈ ముఖ్యమంత్రి ఉద్యోగులపై చూపడంలేదు. ఎందుకంటే వాలం టీర్లు ఈ ప్రభుత్వానికి రాజకీయ వారసులుగా వ్యవహరిస్తున్నారు. వారి ఆటలు మీ వత్తాసు ఎంతకాలం ఉంటాయో చూస్తాము. ఉద్యోగులు, వారి కుటుంబసభ్యుల బాధ, వ్యధ రేపు బ్యాలెట్ ఫలితం రూపంలో పాలకులకు కనిపించే తీరుతుందని హెచ్చరిస్తున్నాం. గతంలో ఎన్నోపోరాటాలు చేశాము.. కొన్నింటిలో ఓడినా, ఆ ఓటమి తాత్కాలికమే. ఈవాస్తవాన్ని ఉద్యోగసంఘాలనేతలు విస్మరించడం సిగ్గుచేటు. తెలుగుదేశంప్రభుత్వంలో 5డీఏలు పెండింగ్ ఉంటే, అవిఇవ్వకపోతే మీరు ప్రతిపక్షంలో కూర్చుంటారని ఆనాడుచెప్పాము.

వారు ఇవ్వలేదు…ఇప్పుడు వచ్చి ప్రతిపక్షంలో కూర్చున్నారు. ఉద్యోగులను బాధపెట్టిన వైసీపీప్ర భుత్వం కచ్చితంగా వారి ఉసురుపోసుకొని ఇంతకు ఇంత అనుభవించే తీరుతుంది. అనుకూ ల మీడియాను అధికారంతో ఏమార్చి మీకు అనుకూలంగా చెప్పించుకుంటున్నారు. అది ఎంతోకాలం సాగదనే వాస్తవాన్ని గుర్తుంచుకోండి.

LEAVE A RESPONSE