స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో సీఐడీ వాదన పూర్తి అవాస్తవం

Spread the love

-స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో రూ.241కోట్లు అన్యాక్రాంతమయ్యాయన్న సీఐడీ వాదన పూర్తి అవాస్తవం
– స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఫోరెన్సిక్ ఆడిట్ లో ఫిజికల్ వెరిఫికేషన్ నిబంధన తొలగింపు మీ కుట్రలో భాగం కాదా?
• స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ డబ్బులకు సంబంధించి, అగ్రిమెంట్ పరంగా, ఫిజికల్ వెరిఫికేషన్ పరంగా, వాల్యూయేషన్ పరంగా సీఐడీ తయారుచేసిన నివేదిక ఆసాంతం, ప్రభుత్వపెద్దలఆదేశాలతో పథకంప్రకారం కుట్రపూరితంగా తయారైందే
• స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ వ్యవహారానికి సంబంధించి అన్నిఅంశాలు పూర్తి పారదర్శకంగా ఉంటే, సీఐడీ దిక్కుమాలిన రిమాండ్ రిపోర్ట్ రాసింది
• తాడేపల్లి పెద్దలు ఆడమన్నట్లు ఆడుతూ, వారు చెప్పిన విధంగా రిపోర్ట్ తయారుచేసి ఈ ప్రాజెక్టుపైన గంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణపై కావాలనే బురదజల్లుతోంది
• అకారణంగా, కుట్రపూరితంగా కావాలనే ఈప్రభుత్వం స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ పై బురదజల్లుతూ, లక్షలాది యువత భవిష్యత్ ను నాశనం చేస్తుంది
• సీఐడీలో పనిచేస్తున్న చెంచాలెవరైనా సరే తానులేవనెత్తిన అంశాలపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నాం
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ పేరుతో, రకరకాల తప్పుడు ఆరోపణలతో పేరుగాంచిన, గొప్పభావజాలం కలిగిన, సేవాధృక్పథమున్న మహోన్నత వ్యక్తులైన గంటా సుబ్బారావు లాంటి వారిని కూడా ఈ పనికిమాలిన జగన్ సర్కారు కటకటాల పాలు చేసిందని, చేతిలో కొందరు పనికిమాలిన సీఐడీ అధికారులను పెట్టుకొని లక్షలాది మంది యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించిన సంస్థను మూతపడేలా చేసిందని, ఈ నేపథ్యంలో జగన్ సర్కారు చేతిలో తోలు బొమ్మలుగా మారిన సీఐడీ పెద్దలకు తాను బహిరంగ సవాల్ విసురుతున్నానని, సీఐడీ లేవనెత్తిన ప్రతి అంశానికి స్పష్టమైన ఆధారాలతో సమాధానం చెప్పడానికే తాను మీడియా ముందుకు వచ్చానని, తాను లేవనెత్తే ప్రశ్నలకు సీఐడీ విభాగం సమాధానం చెప్పాలని లేకుంటే చేసింది తప్పని, తాము తాడేపల్లి పెద్దల చేతిలో తోలుబొమ్మలుగా మారి, వారికి చెంచాగిరీ చేస్తున్నట్లు ఒప్పుకోవాలని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
సీఐడీ అధికారులు తప్పుడు రాతలతో తప్పుడు రిపోర్టులు తయారుచేయడం, లక్షలమంది యువతకు ఉపాధికల్పించే ప్రాజెక్ట్ పై బురదజల్లడం ముమ్మాటికీ క్షమించరానినేరమే. సాక్షి జీతగాడికి, ఆయనచేతిలో తోలుబొమ్మలుగామారిన సీఐడీఅదికారులకు సవాల్ చేస్తున్నాం. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.
రూ.241కోట్లు ఎటుపోయాయో, ఏమయ్యాయో తెలియదని రాశారు. ఆసొమ్మంతా ఎటు పోయిందో సీఐడీ రుజువుచేయగలిగిందా?
ఏ డబ్బునై తే షెల్ కంపెనీలకు బదలాయించారు, కాజేశారని సీఐడీవారు చెప్పారో, ఆసొమ్మంతా డిజైన్ టెక్ కంపెనీ ఖాతాకే తిరిగి చేరిందని రిమాండ్ రిపోర్ట్ పేజీనం-2లో రాశారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్ (డీజీజీఐ) వారు పన్ను ఎగవేతలకు సంబంధించి చేసిన దర్యాప్తులో డిజైన్ టెక్ కంపెనీ ట్యాక్స్ రిఫండ్ (cenvat) పొందడం కోసం, కొంతపన్నుఎగవేశారని డీజీజీఐ పూణెవారు కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆ వార్త అనేక జాతీయ దినపత్రికల్లో కూడా వచ్చింది.
జీఎస్టీకి సంబంధించి రూ.7కోట్ల ట్యాక్స్ రిఫండ్స్ పొందడం కోసం డిజైన్ టెక్ కంపెనీవారు అలాచేశారని డీజీజీఐ వారు చెప్పారు. సుమారు రూ.7కోట్ల వరకు డిజైన్ టెక్ వారు పన్ను ఎగవేతకు పాల్పడ్డారని డీజీజీఐ వారు కేసు నమోదు చేశారు. కానీ, ఎక్కడా రూ.241కోట్లు ఆవిరయ్యాయని చెప్పలేదు. దేశంలోని చాలా కంపెనీలు పన్నుఎగవేత కార్యక్రమాలు చేస్తూనే ఉంటాయి. దాన్ని తీసుకొచ్చి ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కు ఈ ప్రభుత్వంలోని సీఐడీ ఎలా అంటగడుతుంది? సీఐడీ చెప్పినట్టుగా రూ.241కోట్లు గంటా సుబ్బారావు ఖాతాలోకి, లక్ష్మీనారాయణ ఖాతాలోకి వెళ్లలేక పోగా తిరిగి డిజైన్ టెక్ ఖాతాకే చేరినట్టు స్వయంగా సిఐడీ వారు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నప్పుడు రూ.241 కోట్లు ఎవరో దిగమింగారని ఎలా ఆరోపిస్తారు?
అదేవిధంగా సిమెన్స్ వారు, డిజైన్ టెక్ వారు స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కు అవసరమైన వస్తువులు, పరికరాలు, ఉపకరణాలు కూడా సరఫరా చేయకుండానే చేసినట్టుగా డబ్బంతా మింగేశారని సీఐడీ రిమాండ్ రిపోర్టు పేజీ నెం-19 లో రాసింది. పేజీనెం-23లో కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు. ఫిజికల్ వెరిఫికేషన్ చేయకుండా, కాలేజీలకు వెళ్లి పరిశీలించకుండా సీఐడీవారు ఎలా చెబుతారని ప్రశ్నిస్తున్నాం. సీఐడీవారు ఏ ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ ఆధారంగా మాట్లాడుతున్నారో, అదే శరత్ అండ్ అసోసియేట్స్ ఫోరెన్సిక్ నివేదికలోని పేజీ నెం- 12లో, పాయింట్ (ఏ)లో సదరు శరత్ అండ్ అసోసియేట్స్ వారు తాము స్కిల్ డెవలప్ మెంట్ కు చెందిన 40 కేంద్రాల్లో ఫిజికల్ వెరిఫికేషన్ చేయలేదని స్పష్టంగా పేర్కొన్నారు. అలా చేయక పోవడానికి కారణం కూడా వారు చెప్పారు.
ఫోరెన్సిక్ ఆడిట్ సంస్థ ఎంపికకు సంబంధించిన టెండర్ లో ముందు ఫిజికల్ వెరిఫికేషన్ క్లాజ్ పెట్టి, తరువాత దాన్ని తొలగించినందునే తమకు ఫిజికల్ వెరిఫికేషన్ చేసే అవకాశం దక్కలేదని స్పష్టంగా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఫిజికల్ వెరిఫికేషన్ వద్దన్నందుకే తాము చేయలేదని శరత్ అండ్ అసోసియేట్స్ ఆడిట్ రిపోర్ట్ చెబుతోంది. ప్రభుత్వం ఫిజికల్ వెరిఫికేషన్ చేయవద్దని ఎందుకు చెప్పింది? ముందేమో ఫోరెన్సిక్ ఆడిట్ లో ఫిజికల్ వెరిఫికేషన్ నిబంధన పెట్టి, తరువాత దాన్ని ఎందుకు తొలగించారు. ఆ విషయం శరత్ అండ్ అసోసియేట్స్ వారి ఫోరెన్సిక్ రిపోర్ట్ లో ఉందా..లేదా? ఫిజికల్ వెరిఫికేషన్ జరిగితే ఈ ప్రభుత్వ బండారం ఎక్కడ బయటపడుతుందో, ఎక్కడ వారు పూయాలనుకున్న అవినీతిబురద పూయలేకపోతామో అన్న ఆలోచనతోనే అది వద్దన్నారా?
లేకపోతే వెరిఫికేషన్ జరిగితే 40 స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాల్లో దాదాపు రూ.3,200కోట్ల పైబడి విలువైన వస్తువులు కళ్లముందు కనబడతాయని వద్దన్నారా? మొత్తం ఈ వ్యవహారంలో అత్యంత కీలకమైన ఫిజికల్ వెరిఫికేషన్ చేయకుండా ఇష్టానుసారం తప్పుడు ఆరోపణలు చేస్తారా?ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ లో, ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ వారు ఫిజికల్ వెరిఫికేషన్ కుసంబంధించి ఎలాంటి ప్రొఫెషనల్

ఏజెన్సీని ఎంగేజ్ చేయలేదని చెప్పడంతో పాటు సిమెన్స్ వారు, డిజైన్ టెక్ వారు ప్రాజెక్ట్ వాల్యూయేషన్ లో 90శాతం నిధులకుసంబం ధించిఎలాంటి పరికరాలు, సాఫ్ట్ వేర్, ఉపకరణాలు ఇవ్వలేదని ఎలా చెబుతారు? దీనిని బట్టి మీరు కుట్రపూరితంగా ఈ వ్యవహారం మొత్తాన్ని తెరపైకి తీసుకొచ్చారన్న విషయం అర్ధమౌతుంది. ఎప్పుడైతే ఫిజికల్ వెరిఫికేషన్ నిబంధన ఫోరెన్సిక్ ఆడిట్ నుండి తొలగించారో అప్పుడే మీ కుట్ర మొత్తం బట్టబయలైంది. దీనికి ఏం సమాధానం చెబుతారు?
మొత్తం ప్రాజెక్ట్ కు సంబంధించిన వ్యయంపై ఎక్కడా ఎలాంటి క్రాస్ వెరిఫికేషన్ కూడా జరగలేదని కూడా రిమాం డ్ రిపోర్ట్ లో చెప్పారు. క్రాస్ వెరిఫికేషన్ జరగకపోతే సెంట్రల్ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైనింగ్ (సీఐటీడీ) వారుఇచ్చిన నివేదిక సంగతేమిటి? స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కు సంబంధించి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు 05-12-2015న రాసిన లేఖ ఆధారంగా వాల్యూయేషన్ చేసినట్టు, మొత్తం వాల్యూ యేషన్ కరెక్టేనని సీఐటీడీ తన నివేదికలో చెప్పిన మాట వాస్తవం కాదా?.
ప్రాజెక్టు కాస్ట్ కు సంబంధించి ఒక్కో క్లస్టర్ కు రూ.559కోట్ల రూపాయాల వాల్యూయేషన్ ప్రతిపాధన ఏదైతే ఉందో, ఆ వాల్యూయేషన్ మొత్తం నూటికి నూరుశాతం కరెక్ట్ అని వారు చెప్పలేదా?. సీఐటీడీ వారు వాల్యూయేషన్ చేశాక ఇచ్చిన రిపోర్ట్ లో సాఫ్ట్ వేర్ కు సంబంధించి రూ.247.78కోట్లు, డిజిటల్ కోర్సెస్ కు రూ.249.75కోట్లు, హార్డ్ వేర్ కుసంబంధించి రూ.48.48కోట్లు, సర్వీసెస్ కుసంబంధించి రూ.13.31కోట్లు, మొత్తంగా రూ.559.33 కోట్ల వాల్యూయేషన్ మొత్తం కరెక్టేనని సీఐటీడీవారు చెప్పింది నిజం కాదా?
ఆ రిపోర్ట్ ను సీఐడీ చూసి కూడా చూడనట్లు నటిస్తోందా అని ప్రశ్నిస్తున్నాం. ఆ రిపోర్ట్ చూసిఉంటే, సీఐడీ తన రిమాండ్ రిపోర్ట్ లో ‘వితవుట్ ఎనీ బేసిక్ క్రాస్ చెకింగ్’ అని ఎలా రాస్తారు? అందుకే అంటున్నాం సీఐడీ ప్రభుత్వానికి చెంచాగిరీ చేస్తోందని.
ట్రైపాట్రేట్ అగ్రిమెంట్ లో సిమెన్స్ మరియు డిజైన్ టెక్ వారి 90శాతం నిధులకు సంబంధించి ఎటువంటి ప్రస్థావన లేదని సిఐడి రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.కానీ సిఐడీ వారు ఆ అగ్రిమెంటు అనెగ్జర్స్ లో సిమెన్స్ మరియు డిజైన్ టెక్ వారు ఒకొక్క శిక్షణా కేంద్రంలో ఏఏ పరికరాలు ఎంతెంత మొత్తంలో ఏర్పాటు చేయాలన్న అంశాన్ని స్పష్టంగా పేర్కొన్న నిజాన్ని ఎందుకు తొక్కి పెట్టారు? అదే విధంగా ట్రైపాట్రేట్ అగ్రిమెంట్ కు కొనసాగింపుగా 04-12-2015న రూపొందిన వాల్యూయేషన్ అగ్రిమెంట్ లో స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ఫండింగ్ కు సంబంధించి, ప్రతి క్లస్టర్ కు రూ.558కోట్ల వరకు ఖర్చవుతున్నట్లు, 6క్లస్టర్లు రాబోతున్నట్లు, ఈప్రాజెక్ట్ లో ప్రభుత్వవాటాకేవలం 10శాతమేనని, మిగతా 90శాతం సిమెన్స వారి నుంచి రావాలని చాలా స్పష్టంగా పేర్కొన్న విషయం వాస్తవం కాదా?
ఆ అగ్రమెంటుపై సంతకం చేసింది ప్రేమచంద్రారెడ్డి. గంటా సుబ్బారావు కేవలం సాక్షి సంతకం మాత్రమే చేశారు. అటువంటి వాల్యువేషన్ అగ్రిమెంట్ ను సీఐడీ ఎందుకు తొక్కిపెట్టిందో ప్రజలకు చెప్పాల్సిందే. అన్నిఅంశాలు ఇంతస్పష్టంగా ఉంటే, సీఐడీ వాటన్నింటినీ తొక్కిపెట్టింది. జీవోనెం-4ని వయొలేట్ చేసినట్టు ఏదేదోచెప్పుకొచ్చింది.
ప్రాజెక్ట్ మానిటరింగ్ కు గత ప్రభుత్వం జి.ఓ నం. 8 విడుదల చేసి ఒక ప్రత్యేక కమిటీ వేస్తే, అది వేయనట్టు సిఐడి నటిస్తూ స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ మానిటరింగ్ లో గంటా సుబ్బారావుగారు ఫెయిల్ అయ్యారని మరో నింద వేస్తారా?ప్రాజెక్ట్ మానిటరింగ్ బాధ్యత గంటా సుబ్బారావుగారి ఒక్కరిదేనా? లేక మానిటరింగ్ కమిటీదా అని ప్రశ్నిస్తున్నాం. ప్రత్యేకమైన జీవో ఇచ్చి మరీ సీనియర్ ఐఏఎస్ అధికారులైన అజైన్ జైన్, షంషేర్ సింగ్ రావత్ లతో ప్రాజెక్ట్ మానిటరింగ్ కోసం ఒక మానిటరింగ్ కమిటీ వేశారా..లేదా? కమిటీలో వీరందరూ ఉండగా సుబ్బారావు మానిటరింగ్ చేయలేదని సీఐడీవారు నిందలెలా వేస్తారు?
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో రూ.241కోట్లు అన్యాక్రాంతం అయ్యాయన్న సీఐడీవాదన నూటికినూరుశాతం పచ్చిఅబద్ధం..అవాస్తవం. వారు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ లోనే ఆ సొమ్మంతా కొన్నిషెల్ కంపెనీలకు వెళ్లి, మళ్లీ తిరిగి డిజైన్ టెక్ కంపెనీకే వచ్చిందని స్పష్టంగా పేర్కొన్నారు. అలానే కేంద్రప్రభుత్వజీఎస్టీ సంస్థ డీజీజీఐ వారు అదిపన్నుఎగవేతకు సంబం ధించిన అంశమని, ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ (CenVat) కు సంబంధించినదని, డబ్బులెవరూ మింగేయలేదని తేల్చి చెప్పింది. అలా తిన్నారని జాతీయపత్రికల్లో ఎక్కడా వార్తలుకూడా రాలేదు.
ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ లోభాగంగా రూ.7కోట్లు రిఫండ్ అయ్యాయని, ఆ సొమ్ముకూడా డిజైన్ టెక్ కంపెనీవారు తిరిగి చెల్లించారని కూడా చెప్పారు. సీఐడీ వారికి పన్నుఎగవేతకు, డబ్బులు మింగేయడానికి తేడా తెలియదా? ఫిజికల్ వెరిఫికేషన్ చేసే అవకాశం ప్రభుత్వం తమకు ఇవ్వలేదని శరత్ అండ్ ఆడిట్స్ వారు చెప్పారు కదా? ఫిజికల్ వెరిఫికేషన్ నిబంధనను ప్రభుత్వం ఎప్పుడైతే తొలగించిందో అప్పుడే పాలకుల కుట్రబయటపడింది. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కుసంబంధించిన పేమెంట్స్ వ్యవహారంలో ప్రేమచంద్రారెడ్డి సంతకంచేసిన అగ్రిమెంట్ ను సీఐడీ ఎందుకు తొక్కిపెట్టింది?
ఆ అగ్రిమెంట్ లో చాలాస్పష్టంగా ప్రాజెక్ట్ కాస్ట్ లో పదిశాతం మాత్రమే రాష్ట్రప్రభుత్వ బాధ్యత, మిగిలినదంతా సిమెన్స్ వారే భరించాలని చెప్పలేదా? దాన్నిఎందుకు సీఐడీ దాచేసింది? సదరు అగ్రిమెంట్ లో సాక్షి సంతకం మాత్రమే గంటాసుబ్బారావు పెడితే, ఆయనెలా బాధ్యడవుతారు? సీఐటీడీ వారి వాల్యూయేషన్ నివేదికవచ్చాకే చెల్లింపులుజరిగాయి. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ డబ్బులకు సంబంధించి, అగ్రిమెంట్ పరంగా, ఫిజికల్ వెరిఫికేషన్ పరంగా, వాల్యూయేషన్ పరంగా సీఐడీ తయారుచేసిన నివేదిక ఆసాంతం, ప్రభుత్వపెద్దలఆదేశాలతో పథకంప్రకారం కుట్రపూరితంగా తయారైందే.
స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ వ్యవహారానికి సంబంధించి అన్నిఅంశాలు పూర్తి పారదర్శకంగా ఉంటే, సీఐడీ దిక్కుమాలిన రిమాండ్ రిపోర్ట్ రాసింది. తాడేపల్లి పెద్దలు ఆడమన్నట్లు ఆడుతూ, వారుచెప్పినవిధంగా రిపోర్ట్ తయారుచేసి, గంటాసుబ్బారావు, లక్ష్మీనారాయణ గార్లపై కావాలనే బురదజల్లుతోంది. అకారణంగా, కుట్రపూరితంగా కావాలనే ఈప్రభుత్వం స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ పై బురదజల్లుతూ, లక్షలాది యువత భవిష్యత్ ను నాశనంచేస్తోంది. సీఐడీలో పనిచేస్తున్న చెంచాలెవరైనా సరే తానులేవనెత్తిన అంశాలపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నాం.

Leave a Reply