– కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ గద్దె అనురాధ
విజయవాడ: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బుడమేరుకు పడిన గండ్లను పూడ్చకపోవడం వల్లనే ఇప్పుడు బుడమేరు నీరు ఇళ్ళలోకి వచ్చిందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుడమేరుకు పడిన గండ్లు అన్ని పూడ్చించారని ఆమె చెప్పారు.
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 8వ డివిజన్ ఫిటింగేల్పేట చర్చిలో వరద బాధితులకు సహాయం చేసే కార్యక్రమం జరిగింది. కృష్ణాజిల్లా పరిషత్ మాజీ ఛైర్పర్సన్ గద్దె అనురాధ హజరై బాధితులకు సహాయాన్ని అందచేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె మాట్లాడుతూ కృష్ణానదికి, బుడమేరుకు వరద రావడం గత ప్రభుత్వ వైఫల్యాల వల్లనే జరిగిందన్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని సహాయం చేయడమే కాకుండా వారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అండగా నిలబడ్డారని చెప్పారు.
వరద బాధితులకు సహాయ కార్యక్రమాలు చేయడమే కాకుండా రహదారులపై వరద నీరు తగ్గిన తర్వాత ఇంటి పరిసరాల్లో, సెల్లార్లో నిల్వ ఉన్న నీటిని కూడా ప్రభుత్వమే తొలగించిన దాఖలాలు ఎక్కడా లేవన్నారు. వరద బాధితులకు చెందిన పాడైన ఎలక్ట్రికల్ సామాగ్రిని సైతం రిపేరు చేయించేలా తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు.
ప్రభుత్వం చేస్తున్న సహాయ కార్యక్రమాలకు తోడుగా దాతలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బాధితులకు అండగా నిలబడటం సంతోషించదగిన విషయమన్నారు. వరద బాధితులకు కొమ్మినేని వాణి-వేణు, కొత్తపల్లి నాగ మౌనికలు 200 కుటుంబాలకు దుప్పట్లు, కండువాలు, చీరలు, లుంగీలు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు.