అబద్ధం చెప్పిన ముఖ్యమంత్రినే సభ నుంచి సస్పెండ్ చేయాలి

– పవిత్రమైన సభలో అబద్ధాలు చెప్పకూడదన్న ముఖ్యమంత్రే సభను అబద్ధాలతో నడిపిస్తున్నాడు
• సభనుంచి సస్పెండ్ అయిన అనంతరం మీడియాతో మాట్లాడిన టీడీపీ శాసనసభ్యులు
• నాటాసారా మరణాలపై ముఖ్యమంత్రి, ప్రభుత్వం స్పందించేవరకు తమపోరాటం ఆగదని స్పష్టంచేసిన తెలుగుదేశం సభ్యులు
• సభను, ప్రజలను ముఖ్యమంత్రి అబద్దాలు, అసత్యాలతో ఎంతకాలం ఏమార్చుతాడంటూ నిగ్గదీసిన ప్రతిపక్షసభ్యులు

రాష్ట్రంలో నాటుసారాలేదని, తమపార్టీవారికి మద్యంవ్యాపారంతో సంబంధంలేదని చెబుతున్న ముఖ్యమంత్రి, అధికారుల ఇచ్చిన సమాచారంపై ఏంసమాధానం చెబుతాడు? : అనగాని సత్యప్రసాద్ (టీడీపీ శాసనసభ్యులు)
అసలు ఈ రాష్ట్రంలో ఎక్కడా సారానే కాయడంలేదని, తనపార్టీవారెవరికీ సారా, ఇతర మాదక ద్రవ్యాలవ్యాపారంతో సంబంధంలేదని గట్టిగా బుకాయిస్తున్న ముఖ్యమంత్రి, వేలలీటర్ల నాటు సారా ఎక్కడినుంచి వస్తుందో సమాధానంచెప్పాలి. ప్రజాక్షేత్రంలో ప్రజలకోసం, వారిసమస్యల పరిష్కారంకోసం తామునిత్యం ప్రజల్లోనే ఉంటున్నాము. శవరాజకీయాలపై పేటెంట్ రైట్స్ అన్నీ జగన్మోహన్ రెడ్డివే. శవాలను రాజకీయాలకు వాడుకోవడం, వాటిసాయంతో ఎన్నిక ల్లో గెలవాలని చూడటం ఈముఖ్యమంత్రికి

అలవాటైంది. ప్రజాసమస్యలు అనేకంఉంటే, వాటిపై తాముఎక్కడనిలదీస్తామో అని తమను సభనుంచి బయటకు పంపుతున్నారు. రా ష్ట్రంలో రైతులు నానాఅవస్థలుపడుతున్నారు.ముఖ్యమంత్రి గొప్పులు చెప్పుకునే రైతుభరోసా కేంద్రాలు అవినీతికి కేరాఫ్ అడ్రస్ గామారాయి. వారిసమస్యలకు సంబంధించిన అంశాలనుసభలో ప్రస్తావిద్దామంటే ప్రభుత్వం తమకు అవకాశంఇవ్వడంలేదు. అలానే ఆశావర్కర్లు, అంగన్ వాడీలు, ఉపాద్యాయులు వారివారి డిమాండ్లకోసం రోడ్లపైకి వస్తున్నారు. ఇలా చెప్పుకుంటూపోతే అనేకసమస్యలు ఉన్నాయి. బడ్జెట్ పై ప్రసంగం అంటారు… అసలు ఆబడ్జెట్టే పెద్ద డొల్ల బడ్జెట్. సభలో తాము మాట్లడటానికి ప్రయత్నించగానే పోలోమంటూ అధికారపార్టీ నేతలంతా తమపై దూషణలకు దిగుతున్నారు. తమగొంతులు ధ్వనించకుండా సభలో అడ్డుకోగలరుకానీ, ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వం తమను ఆపలేదుగా!

పవిత్రమైన సభలో అబద్ధాలు చెప్పకూడదన్నవ్యక్తే, నిస్సిగ్గుగా నిండుసభలో పచ్చిఅబద్ధాలు చెప్పాడు : గద్దె రామ్మోహన్ రావు (టీడీపీ శాసనసభ్యులు)
బడ్జెట్ సమావేశాల తొలిరోజునే గౌరవముఖ్యమంత్రి, స్పీకర్ కు ఒకమాటచెప్పారు. పవిత్ర మైన సభలో ఎవరుఅబద్ధాలుచెప్పినా మీరు వెంటనే చర్యలుతీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఆవిధంగా చెప్పిన ముఖ్యమంత్రే మూడురోజులనుంచీ సభను అబద్ధాలకేంద్రంగా మార్చేశాడు. జంగారెడ్డిగూడెంలో నాటుసారావల్ల సంభవించిన మరణాలన్నీ సహజమరణా లని ముఖ్యమంత్రి చెప్పడం ఎంతదారుణమో చెప్పాల్సినపనిలేదు. ఈరోజు కూడా సారా తాగి అత్యవసరవైద్యంకోసం గుంటూరుప్రభుత్వాసుపత్రికి వచ్చిన వరదరాజులు అనేవ్యక్తి చనిపో యాడు. ముఖ్యమంత్రేమో అతివినయంగా, జంగారెడ్డిగూడెంపై ఎక్కడాలేని ప్రేమను ఒలకబో స్తూ, మా జంగారెడ్డిగూడెంలో 55వేలమంది జనాభా ఉంటే, అక్కడెలా సారాకాస్తారని చిలుక పలుకులు పలికాడు.

తనహావభావాలతో ముఖ్యమంత్రి చాలా అతివినయంగా మాట్లాడారు. కానీ పదిరోజులనుంచి జరుగుతున్నపరిణామాలు గమనిస్తే, ప్రభుత్వాధికారులే స్వయంగా నాటుసారా అమ్మేవారిని అరెస్ట్ చేశారు. దానికి సంబంధించి దాదాపు 10వరకు ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. ప్రభుత్వవిభాగమైన ఎస్ఈబీ వారు ఎంతమొత్తంలో సారా పట్టుకున్నా మని కూడా చెప్పారు. దాదాపు 13వేలలీటర్లవరకు సారా పట్టుబడిందని వారే చెప్పారు. కానీ ముఖ్యమంత్రేమో సారానా…ఎలాఉంటుంది…ఎక్కడుంది అనిసభలో ఆస్కార్ నటుడిని మించిపోయి ఓవరాక్షన్ చేశాడు.

సభలో అబద్ధాలు చెప్పకూడదన్నవ్యక్తే ఇంతనిస్సిగ్గుగా అ బద్ధాలు చెబితే, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ తాము ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తే దానిపై చర్చజరక్కుండా స్పీకర్ అడ్డుకుంటున్నారు. తమవాదన వినకుండా తమను సభ నుంచి సస్పెండ్ చేశారు. విశాఖపట్నంలో ఎల్జీపాలిమర్స్ దుర్ఘటనలో మరణించిన వారికోసం ప్రత్యేకవిమానంలోవెళ్లిమరీ కోటిరూపాయల పరిహారం అందించిన ముఖ్యమంత్రి, నాటుసారా వల్ల చనిపోయినవారి కుటుంబాలకు రూ.25లక్షలు ఇవ్వడానికి సంకోచిస్తున్నాడు. నాటుసా రా వల్ల రాష్ట్రంలో జరుగుతున్న మరణాలపై ప్రజల్లో చైతన్యం వచ్చేలా తమవంతు పోరాటం చేస్తూనేఉంటాము. ముఖ్యమంత్రి ఎల్లకాలం అబద్ధాలు, అసత్యాలతో, బూటకపు వాగ్ధానాల తో ప్రజల్ని నమ్మించలేడు.

జంగారెడ్డి గూడెం మరణాలన్నీ నాటుసారా మరణాలేనని ప్రభుత్వాధికారులు ఇచ్చిన సమాచారమే చెబుతోంది : మంతెన రామరాజు (టీడీపీ శాసనసభ్యులు) 
నాటుసారా మరణాలపై గతమూడురోజులనుంచీ సభలో జరుగుతున్న పరిణామాలు దురదృ ష్టకరం. టీడీపీసభ్యులను బయటకుపంపి, ఎప్పుడెప్పుడు సొంతడబ్బాలు కొట్టుకుందామా అన్న ఆత్రుతలో ప్రభుత్వముంది. రూల్ ప్రకారం రాజ్యాంగంలోని హక్కులను అనుసరించి, తాము ప్రివిలేజ్ మోషన్ పాస్ చేస్తే దానిపై సభలో చర్చించమని చెప్పడం దుర్మార్గం. తాము లేవనెత్తే అంశాలపై చర్చించలేకపోతే, ప్రభుత్వం మౌనంగా ఉండాలికానీ, సభనుంచి సస్పెండ్ చేస్తారా? జంగారెడ్డిగూడెం ఘటనకు సంబంధించిన అన్నిఆధారాలతో నేడు తాము సభకు వచ్చాము. దానిపై చర్చజరిగితే ఈ ముఖ్యమంత్రి చెప్పిన పచ్చిఅబద్ధాలను ప్రజలకు తెలియ చేద్దామనుకున్నాము.

నాటుసారా మరణాలపై ఈ ప్రభుత్వంలోని అధికారులు ఇచ్చిన సమాచారమే తమవద్ద ఉంది. నాటుసారా, బెల్ట్ షాపులవిక్రయాలకు సంబంధించిన సమాచారం ఎస్ ఈబీవారి వెబ్ సైట్లో కూడాఉంది. నాటుసారా ప్యాకెట్ రూ.50కు విక్రయిస్తు న్నారు. తామునాటుసారా మరణాలపై సభలో ప్రస్తావించగానే, ఎస్ఈబీ అధికారులు దాడు లుచేసి, సుమారు 18 నుంచి 20వేల లీటర్ల వరకు నాటుసారాను ధ్వంసంచేశారు. 60వేల కేజీల నల్లబెల్లంకూడా దొరికింది. దానితోపాటు, బ్యాటరీల్లోని అమ్మోనియం పదార్థం, విప్పపువ్వు, ఘాటుకోసం వాడే ఎండుమిర్చిలాంటివికూడా అధికారులకు దొరికాయి.

ఇలా అన్నీకళ్లముందు కనిపిస్తుంటే ముఖ్యమంత్రి నాటుసారా లేనేలేదని ఎలా చెబుతాడు? నాటు సారా తాగిచనిపోయినవారంతా మగవారే. 50వేల మంది జనాభాఉన్న తాడేపల్లిగూడెంలో సహజంగానే నెలకు 100మందిచనిపోతారని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. కానీ కేవలం నాలుగురోజుల్లోనే 26మందిఎలా మృత్యువాత పడ్డారని తాము ప్రశ్నిస్తున్నాం. చనిపోయిన వారంతాకూడా వాంతులు, విరోచనలాలు తలతిరగడం, శ్వాసఆడకపోవడం వంటి ఇతరత్రా సమస్యలతో ముందు నానాఅవస్థలుపడ్డారని స్వయంగా వారికుటుంబసభ్యులే చెబుతు న్నారు. మరి అలాంటప్పుడు వారివి సహజమరణాలని ముఖ్యమంత్రిగాచెప్పడం నిజంగా చాలాచాలా దురదృష్టకరం.

ప్రభుత్వం ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి, సభలో నాటుసారా మరణాలపై చర్చకు అనుమతించాలని, మరణించినవారి కుటుంబాలకు న్యాయంచేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇతరరాష్ట్రాలనుంచి వచ్చే మద్యం కూడా ఎక్కువైంది. కాబట్టి, ముఖ్య మంత్రి గారు పెద్దఎత్తున పెంచిన మద్యంధరలను తగ్గిస్తేమంచిది.

అసెంబ్లీలో అబద్ధాలమీద అబద్ధాలుచెబుతున్న ముఖ్యమంత్రిని సభనుంచి సస్పెండ్ చేయకుండా, తమను సస్పెండ్ చేశారు : బెందాళం అశోక్ (టీడీపీ శాసనసభ్యులు)
సంపూర్ణమద్యపాన నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి, ముఖ్య మంత్రి అయ్యాక దేశంలో ఏరాష్ట్రంలో లేనివిధంగా రాష్ట్రాన్ని మద్యాంధ్రప్ర్రదేశ్ గా మార్చేశాడు. మద్యంవ్యాపారం పేరుతో ప్రభుత్వం, అధికారపార్టీ పెద్దలు అతిపెద్దకుంభకోణానికి పాల్పడు తున్నారు. నాటుసారా తాగి చనిపోయినవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనేఉంది. కానీ ముఖ్యమంత్రి మాత్రం సభను తప్పుదోవ పట్టించేలా అబద్ధాలమీద అబద్ధాలు చెబుతున్నాడు.

సభను, రాష్ట్రప్రజలను తప్పుదోవపట్టించేలా అబద్ధాలుచెప్పిన ముఖ్యమంత్రికి సభ నుంచి సస్పెండ్ చేయకుండా, ఆయన ఆలోచనలు, అబద్ధాలు, విధానాలను తప్పుపట్టిన తమను సస్సెండ్ చేస్తున్నారు. శవరాజకీయాలు చేస్తోంది ఎవరో ముఖ్యమంత్రికి వైసీపీవారికి బాగాతెలుసు. నాటుసారా అనేది జంగారెడ్డిగూడెంలో తయారవడంలేదన్న ముఖ్యమంత్రికే సస్పెన్షన్ వర్తిస్తుందిగానీ, తమకుకాదు. ఒకేప్రాంతంలో 26మంది చనిపోతే ముఖ్యమంత్రి స్థానంలోఉన్నవ్యక్తి కనీసం ప్రకటనకూడా చేయడా? మంత్రితో ఏదో మాట్లాడించామంటే సరిపోతుందా? జంగారెడ్డిగూడెంలో నాటుసారా తయారవ్వకపోతే, ఆర్డీవోస్థాయిఅధికారి స్వయంగా క్షేత్ర స్థాయిలోపరిశీలనకు వెళ్లి, పత్రికాప్రకటన ఎందుకు చేశారు?

ఈ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఎస్ఈబీ వారుఎన్నికేసులు నమోదుచేశారు? బెల్లంఊటనిల్వలు, ఎన్ డీపీ వంటివాటి అమ్మకాలు ఏస్థాయిలోఉన్నాయో కూడా అధికారులే చెప్పారు. ఇలా అన్నీ కళ్ల ముందు కనిపిస్తుంటే పచ్చిఅబద్ధాలతో సభను నడపాలని చూస్తారా? శవరాజకీయాలు చేస్తోంది ముఖ్యమంత్రే. సభను శాడిస్టిక్ విధానాలతో నడపాలనిచూస్తున్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చనిపోయిన వరదరాజులు అనేవ్యక్తి భార్య తనభర్త సారాతాగే మరణించా డనిఫిర్యాదుచేయడానికి వెళ్తే ఆమె ఫిర్యాదుకూడా తీసుకోవడంలేదు. నాటుసారా మరణాల పై ప్రభుత్వ న్యాయవిచారణజరిపించాలని, మృతులుకుటుంబాలకు రూ.25లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.
నాటుసారా మరణాలనువక్రీకరించి, మరణాలనుకూడా అతి స్వల్పమైనవాటిగా చూపుతూ, తన రాజకీయస్వార్థంకోసం ప్రజల జీవితాలను నాశనం చేస్తున్న ముఖ్యమంత్రి తక్షణమే తనపదవికి రాజీనామాచేయాలని డిమాండ్ చేస్తున్నాం.

ఆడబిడ్డలంతా తన అక్కచెల్లెమ్మలని చెప్పిన ముఖ్యమంత్రికి నాటుసారాతో సర్వంకోల్పోయిన మహిళల వేదన, రోదన కనిపించడంలేదా? : ఆదిరెడ్డి భవానీ (టీడీపీ శాసనసభ్యురాలు)
ఆడబిడ్డలంతా తనఅక్కచెల్లెమ్మలని బూటకపు మాటలుచెప్పిన జగన్మోహన్ రెడ్డి, ముఖ్య మంత్రి అయ్యాకకూడా ఇదేశాసనసభలో తానేదో మహిళోద్ధారకుడు అయినట్టు తనపార్టీ వారితో ప్రగల్భాలు పలికించుకున్నాడు. సారామరణాలన్నీ సహజమరణాలనిచెబుతున్న ముఖ్యమంత్రి, రేపు భవిష్యత్ లో ఇంతకంటే దారుణమైన ఘటనఏది జరిగినా దాన్నికూడా ఇలానే పలుచనచేయడని నమ్మకమేముంది. చనిపోయినవారి కుటుంబాల్లోని మహిళల వేదన, రోదన ఈ ముఖ్యమంత్రికి కనిపించకపోవడం బాధాకరం.
ఆశావర్కర్లు, అంగన్ వాడీ లు వారివారి డిమాండ్లకోసం నిత్యం రోడ్లపైకివచ్చిధర్నాలుచేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవ డంలేదు. నాటుసారా మరణాలపై ముఖ్యమంత్రి స్పందించాల్సిందే. తమవద్ద ఉన్నాఆధారా లపై ఆయన సమాధానంచెప్పాల్సిందే. రోజూ తమను సస్పెండ్ చేసుకుంటూపోతే, దానివల్ల నష్టపోయేది ప్రభుత్వమే. సభలో మాగొంతునొక్కితే, బయటమేం మాట్లాడలేమా?

Leave a Reply