పేదలకు అండగా నిలవాలని ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌

-నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఫ్యామిలీ డాక్టర్‌ విధానం
-దేశంలో గొప్ప మార్పునకు లింగంగుంట్ల నుంచి శ్రీకారం చుట్టాం
-వైద్యులే గ్రామానికి వచ్చి సేవలు అందిస్తారు
-అన్ని వైద్య సేవలు గ్రామంలో ఇంటి ముంగిటే అందించే గొప్ప పథకం
-ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ దేశానికే రోల్‌ మోడల్‌
-ప్రతి పేదవాడు వైద్యం కోసం ఇబ్బంది పడకూడదనే..ఈ విధానం
-పేదలు ఆసుపత్రులు, డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు
-24/7 పేదలకు వైద్యం అందించాలి
-ఎప్పుడు ఫోన్‌ చేసినా డాక్టర్‌ అందుబాటులో ఉంటారు
-విలేజ్‌ క్లినిక్స్‌ ద్వారా ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు రెఫర్‌ చేస్తారు
-విలేజ్‌ క్లినిక్స్‌లో 14 రకాల వైద్య పరీక్షలు
-వైయస్‌ఆర్‌ విలేజ్‌ క్లినిక్స్‌లో 105 రకాల మందులు అందుబాటులో ఉంటాయి

దేశ చరిత్రలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ రోల్‌ మోడల్‌గా నిలుస్తుందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి పేదవాడు వైద్యం కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతో నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఫ్యామిలీ డాక్టర్‌ విధానం అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. ఆరోగ్యశ్రీ అంటే వైయస్‌ఆర్‌ గుర్తకొస్తారని, ఖరీదైన కార్పొరేట్‌ వైద్యాన్ని పేదలకు అందుబాటులోకి తీసుకువచ్చారని చెప్పారు. పేదలు ఆసుపత్రుల చుట్టూ, డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఇకపై ఉండదని, మీ గ్రామానికే, సమీపానికే అన్ని వైద్యసేవలు అందించే గొప్ప కార్యక్రమం ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అన్నారు. ఈ విధానంలో సాధారణ వైద్య సేవలతో పాటు తల్లులు, బాలింతలకు వైద్య సేవలు అందిస్తారని చెప్పారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగించారు.

ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏమ‌న్నారంటే..  

  • ఈ రోజు ఇక్కడ చెరగని చిరునవ్వుల మధ్య మీ ప్రేమానురాగాలు, ఆప్యాయతల మధ్య ఈ రోజు ఇంతటి అభిమానాన్ని చూపిస్తున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు
  • ఈ రోజు సామాన్యుడికి అందే వైద్యం విషయంలో దేవుడి దయతో దేశ చరిత్రలోనే కనీవిని ఎరుగని గొప్ప మార్పుకు, గొప్ప కార్యక్రమానికి ఈ రోజు ఇక్కడ ఈ గ్రామం నుంచి శ్రీకారం చుడుతున్నామని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను
  • ఈ రోజు ఇంటింటా కూడా ప్రతి ఒక్కరికీ కూడా మంచి జరగాలని, ఏ పేదవాడు కూడా వైద్యం కోసం ఇబ్బందులు పడే పరిస్థితులు రాకూడదని, ప్రతి ఒక్కరికీ కూడా ఆరోగ్య భరోసా ఇస్తూ..ఈ రోజు మనందరి ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమలులోకి వస్తుందని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను.
  • ఈ రోజు మొదలయ్యే ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ద్వారా డాక్టర్‌ కోసం మీరు వెళ్లాల్సిన పని లేదు. మీ గ్రామం నుంచి ఎక్కడెక్కడికో పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. డాక్టరే మీ గ్రామానికి వస్తాడు. మీ ఇంటి చేరువకే వస్తాడు. మీ కుటుంబం కోసం, మన పేదల కోసం అక్కడికే డాక్టర్‌ వస్తాడు. డాక్టర్‌ సేవలు వస్తాయి. మందులు కూడా మీ ఇంటికే వస్తాయి.
  • ఒకసారి జరుగబోయే మార్పుకు క్లుప్తంగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఈ రోజు పెన్షన్లు ఏమాదిరిగా మీ ఇంటికి నడిచి వస్తాయో అదే మాదిరిగా వైద్య సేవలు కూడా మీ గ్రామానికి, మీ సమీపానికి అవసరమైన సందర్భాల్లో మీ ఇంటికి కూడా కదిలిరావడమే ప్యామిలీ డాక్టర్‌ విధానమని చెబుతున్నాను.
  • ఈ రోజు గొప్ప కార్యక్రమానికి నాందీ పలుకుతున్నాం. ఫ్యామిలీ డాక్టర్‌ అంటే ఏమిటీ, ఎలా పని చేస్తారు అంటే నాలుగు మాటలు చెబుతాను.
  • పేదలు, పేద సామాజిక వర్గాలు ఆసుపత్రి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వైద్యుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, పరీక్ష కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఇవన్నీ కూడా మన గ్రామం వద్దకే, మన వద్దకే వచ్చే కార్యక్రమమే ఈ ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌. అధునిక వైద్యాన్ని ఉచితంగా మీ గ్రామానికే తీసుకురావడమే ఈ ఫ్యామిలీ డాక్టర్‌ విధానం.
  • ఈ రోజు మన గ్రామంలో చాలా మంది మంచానికే పరిమితమైన వారు ఉన్నారు. వీరందరికీ కూడా వారి గడప వద్దనే అవసరమైన వైద్యం అందజేసేందుకు ఈ విధానాన్ని తీసుకువచ్చాం.
  • ప్రివేన్షన్‌ ఈజ్‌ బెటర్‌ ధ్యేన్‌ క్యూర్‌ అనే సామెత ఉంది. ఈ రోజు జబ్బులు ముదరకుండా, జబ్బులు రాకుండా కాపాడేందుకు ఈ ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమాన్ని తీసుకువచ్చాం. ఈ విధానం ద్వారా తీసుకువస్తున్న మార్పు దేశ చరిత్రలోనే రోల్‌ మాడల్‌గా నిలుస్తుంది. ఈ రోజు ఏపీలో మొదలవుతున్న ఫ్యామిలీ డాక్టర్‌ విధానం రేపు దేశం మొత్తం మన వద్దకు వచ్చి కాపీ కొడుతుంది. మీరంతా కూడా ఇది చూస్తారు. దేశానికే ఇది రోల్‌ మాడల్‌గా నిలిచిపోతుంది.
  • చిన్న ఉదాహరణ చెబుతున్నాను. ఈ ఊరిలో ఎంత మందికి బీపీ ఉంది, ఎంత మంది షుగర్‌తో బాధపడుతున్నారు. ఇవే కాకుండా రక్తహీనత, విటమిన్‌ లోపం, ఇతరాత్ర జబ్బులు ఎవరికైనా ఉంటే వాళ్లందరికీ కూడా స్క్రీనింగ్‌ జరిగిందా?. వారిని ప్రాథమిక దశలోనే కనుగొంటే..వ్యాధి ముదరకముందే గుర్తించి మందులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది.
  • ఈ ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ద్వారా తొలి దశలోనే కనుగొని వెంటనే వైద్యం అందిస్తాం. వ్యాధి ముదరకుండా కాపాడుతాం. క్యాన్సర్‌ మొదలు టీబీ దాకా ప్రతి పేదవాడికి ఒక రక్షణ చక్రం ఈ విధానంతో మొదలవుతుంది.
  • ప్రతి ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వంగా ఈ ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని మొదలుపెడుతున్నాం. వైద్యం కోసం ఏ పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు. గ్రామంలో ప్రతి రోగిని డాక్టర్‌ పేరు పెట్టి పిలిచేంతగా ఈ కార్యక్రమం అమలవుతుంది.
  • మ‌నంద‌రి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో ఇద్దరు వైద్యులు, ముగ్గురు స్టాఫ్‌ నర్సులు, ఇతర సిబ్బంది కలిపి 14 మంది ఉండేలా చర్యలు తీసుకుంది. పీహెచ్‌సీలోని ఇద్దరు వైద్యులకు ఆ పరిధిలోని గ్రామ సచివాలయాలను కేటాయించారు. వైద్యులు వాటిని నెలలో రెండు సార్లు సందర్శించాల్సి ఉంటుంది.
  • 104 మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌(ఎంఎంయూ)తో పాటు గ్రామానికి వెళ్లి రోజంతా అక్కడే గడిపి ప్రజలకు వైద్య సేవలు అందిస్తారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ 104 ఎంఎంయూ వద్ద ఓపీ సేవలు అందిస్తారు. మంచానికి పరిమితమైన వృద్ధులు, దివ్యాంగులు, ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందిన రోగుల గృహాలను మధ్యాహ్నం నుంచి సందర్శించి ఇంటి వద్దే సేవలు అందిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి చిన్నారులు,  విద్యార్థుల ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు.
  •  గ్రామీణ స్థాయిలో వైద్య వసతులను బలోపేతం చేస్తూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రతి 2,500 మంది జనాభాకు ఒకటి చొప్పున 10,032 వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బీఎస్సీ నర్సింగ్‌ అర్హత కలిగిన కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌(సీహెచ్‌వో), ఏఎన్‌ఎం, నలుగురు నుంచి ఆరుగురు ఆశా వర్కర్లు వీటిల్లో ఉంటారు.
  • ప్రతి క్లినిక్‌లో 105 రకాల మందులు, 14 రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉంటాయి. టెలిమెడిసన్‌ కన్సల్టేషన్‌ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. ఫ్యామిలీ డాక్టర్‌ విధానం అమలులో విలేజ్‌ క్లినిక్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. గ్రామాలకు వెళ్లిన వైద్యులు వీటిలో ఉంటూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు.
  • ఎవరైనా రోగికైనా మెరుగైన వైద్యం అవసరం అని భావిస్తే ఫ్యామిలీ డాక్టర్‌  అక్కడి నుంచే పెద్దాస్ప్రత్రులకు రిఫర్‌ చేస్తారు. రోగిని దగ్గరలోని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రికి తరలించడం, వైద్యం అందేలా చూడటం లాంటి కార్యకలాపాలను సీహెచ్‌వో, ఏఎన్‌ఎం పర్యవేక్షిస్తారు. వీరు విలేజ్‌ ఆరోగ్యమిత్రగా వ్యవహరిస్తారు. ఇది నిజంగా  గొప్ప మార్పు. దేశం మొత్తం మన వైపు చూసేలా ఈ మార్పు ఉంటుంది.

Leave a Reply