Suryaa.co.in

Andhra Pradesh Telangana

కాంగ్రెస్‌ సర్కార్‌కు వ్యవసాయం అంటే గిట్టదు!

– రేవంత్‌ పాలనలో అన్నదాతపై చిన్నచూపు
– బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ ఆరోపణ

హైదరాబాద్‌: జూన్ 29వ తారీకు నాడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నిజామాబాద్ కు రాబోతున్నారు. పసుపు రైతులకు మార్కెటింగ్ సౌకర్యాలు కలగడం కోసం, వారు పండిస్తున్నటువంటి పంటకు ధర రెట్టింపు అవ్వడం కోసం, అలాగే పసుపు ప్రాసెసింగ్ యూనిట్స్ ద్వారా అనేక రకాల బైప్రొడక్ట్స్ తయారు చేసి అంతర్జాతీయంగా కూడా మార్కెటింగ్ చేసుకునే విధంగా.. రైతులకు మేలు చేసేలా నరంద్ర మోదీ నాయకత్వంలో నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి కి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున ధన్యావాదాలు తెలియజేస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ  అన్నారు. ఈ మేరక ఆమె బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

తెలంగాణలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి గాని, గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి గాని కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వంలా స్పష్టమైన దిశలో వ్యవసాయ అభివృద్ధి చేసే సామర్థ్యం లేదని విమర్శించారు. ఇంకా, ఆమె ఏమన్నారంటే.. 2014 నుండి 2025 వరకు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం దాదాపు లక్షల కోట్ల రూపాయలను తెలంగాణ వ్యవసాయ రంగానికి ఖర్చు చేసింది. కేవలం వడ్ల కొనుగోలుకు ఒక్కటే రూ. 57,556 కోట్ల ఖర్చు చేసింది. 2014లో వడ్ల కొనుగోలుకు ఖర్చు రూ. 3,404 కోట్లు కాగా, 2023-24 ఒక్క సీజన్‌కి రూ.20,998 కోట్లు ఖర్చు చేసింది. మొత్తం గా కేంద్రం ఈ కాలంలో వడ్ల కొనుగోలుకే ఖర్చు చేసిన మొత్తం రూ.57,556 కోట్లు.

కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా తెలంగాణ రైతుల వద్ద నుంచి ఇప్పటివరకు రూ.58,000 కోట్ల విలువైన పత్తిని కొనుగోలు చేసింది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 14 పంటలపై క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ మూడే పంటలకు మాత్రమే బోనస్ ప్రకటించి, వాటిలో సగం మంది రైతులకే ఇవ్వడం జరిగింది.. మిగిలినవాళ్లకు ఇంకా అందలేదు. సగం మందికి మాత్రమే బోనస్ ఇస్తున్నామని చెప్పి, ఆ ప్రక్రియ కూడా పూర్తవ్వలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసం. ఒక్క వరిగింజ లేకుండా, ఒక్క పత్తి బేలు కూడా లేకుండా కేంద్ర ప్రభుత్వం 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర రైతుల దగ్గర నుంచి ఇప్పటికి రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టి కొన్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీఇస్తా అన్నటువంటి బోనస్ బరాబర్ తెలంగాణ రైతులకు ఇవ్వాల్సిందేనని బిజెపి డిమాండ్ చేస్తున్నది.

వచ్చే సీజన్ నుంచి, ఈ వానాకాలం నుంచి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినటువంటి 14 పంటలకు రూ.500 బోనస్ ప్రతి పంటకు క్వింటాలుకు ఇవ్వాల్సిందే.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 19 విడతలుగా ఇప్పటికీ తెలంగాణ రైతుల అకౌంట్లలో కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి డబ్బు రూ.27,488 కోట్లు. ఈ 19 విడతలుగా తెలంగాణ రైతుల అకౌంట్లలో వచ్చిన పైసలు ఒక్కసారి కూడా బ్రేక్ కాలేదు. ఎప్పటికప్పుడు రైతులు ఎదురు చూడకముందే అకౌంట్లకు పైసలు వచ్చాయి. మరి వరంగల్ రైతు డిక్లరేషన్ పెట్టి సోనియా గాంధీని, ప్రియాంకా గాంధీని, రాహుల్ గాంధీ ని పిలిచి, రాహుల్ గాంధీ చేత మాట్లాడిపించి వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట హామీలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు రూ.15,000 రైతు భరోసా, ప్రతి కౌలు రైతుకు రూ.15,000 రైతు భరోసా, ప్రతి రైతు కూలీకి రూ.12,000 రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చారు.

2023లో వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు వానాకాలం పంటకు పెండింగ్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. 2024 యాసంగి ఇవ్వలే, వానాకాలం ఇవ్వలే. 2025లో మొన్న అయిపోయినటువంటి యాసంగి పంటకు సగం రైతులకు మాత్రమే ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు వానాకాలం పంట స్టార్ట్ అవుతుందని ఈ ఒక్క విడతనే రైతుల అకౌంట్లలో పైసలు వేశారు. అది కూడా ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి. 2023 వానాకాలం, 2024 యాసంగి, వానాకాలం, 2025 యాసంగి సగం కాంగ్రెస్ పార్టీ ఇస్తాన్నటువంటి 15000 కాకుండా 12000 చొప్పున లెక్కేసినా.. కాంగ్రెస్ సర్కారు ఒక్కొక్క రైతుకు 21000 బాకీ ఉన్నది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రచారం కోసం కేవలం 6000 రూపాయలు ఇచ్చి పాలాభిషేకాలు చేయించుకుంటున్నది. తొమ్మిది రోజులలో 9000 కోట్లు ఇచ్చినం అని చెప్పి కాంగ్రెస్ నాయకులు ప్రగల్భాలు పలుకుతున్నారు.

మరి కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ ఉన్న 21000 రూపాయలు ఎవరు ఇస్తారో.. ఎప్పుడు ఇస్తారో సమాధానం చెప్పాలి.

రైతులకు ఇప్పటివరకు బాకీపడ్డ పైసలను రైతుల అకౌంట్లలో జమచేయాలి. రైతు కూలీలందరికీ బాకీ ఉన్నటువంటి పైసలు వాళ్ల అకౌంట్లలో వేయండి. కౌలు రైతుల లిస్ట్ బయట పెట్టి.. వాళ్లకు కూడా న్యాయబద్ధంగా రైతు భరోసా పైసలు ఇవ్వాల్సిందేనని బిజెపి డిమాండ్ చేస్తున్నది. పంటలకు ఎంఎస్పీ విషయొంలో 2014 నుంచి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం 12 సార్ల ధరలను పెంచింది.

వరి 2014ల క్వింటాల్ వరి ధాన్యం రూ.1059 ఉంటే ఇప్పటికి రూ.2369 ఉంది. ఆనాడు పత్తి రూ.4010 ఉంటే.. ఇప్పుడు రూ.8110 ఉంది. ఇది కేంద్రానికి ఉన్న నిబద్ధత. తెలంగాణలో పండిస్తున్నటువంటి ప్రతి పంటను డైరెక్ట్‌గా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తది. మరి ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వరకు ఒక ప్రణాళిక సిద్ధం చేశారా..? అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏ పంటలు ఏ ఏ ప్రాంతాల్లో పండుతాయి అనేటటువంటి అవగాహన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అవగాహన ఉన్నదా..? దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా కూడా యూరియా కోసం డిఏపీ కోసం అమ్మోనియా కోసం రైతులు చెప్పులు లైన్లో పెట్టి ఎండనక, వాననక రోజుల తరబడి నిలబడి హార్ట్ ఎటాక్ వచ్చి రైతులు గుండెపోటుతో చనిపోయిన ఘటనలు చూశాం.

అటువంటి పరిస్థితి నుంచి కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క రైతు కూడా ఒక్క నిమిషం కూడా ఎరువులకో కోసం నిలబడద్దు అని సంకల్పంతో సబ్సిడీ కింద అందరికీ అన్ని సందర్భాల్లో అందుబాటులో ఉండేటట్టు చూసి తెలంగాణలో మూతబడ్డటువంటి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని 6338 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి పున:ప్రారంభించడం జరిగింది. ఇది బిజెపికి ఉన్న నిబద్ధత. ఒక్కొక్క రైతుకి ఒక ఎకరానికి ఏడాదికి 18000 రూపాయల సబ్సిడీ ఈ ఎరువుల ద్వారా కల్పించి ఈ 18000 రూపాయలను భరిస్తుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం పనిచేస్తుంటే మరోవైపు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మార్క్ ఫెడ్ నష్టాల్లో పడిందని చెబుతున్నాడు.

అందుకని తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరూ యూరియా బస్తాలు తీసుకుంటే యూరియా బస్తాకు ఒక్క బస్తాకు రూ.25 రవాణ ఖర్చులు రైతులేభరించాలి అని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం దారుణం. ఒక దిక్కు కేంద్ర ప్రభుత్వం రైతులకు సంవత్సరానికి ఒక్క ఎకరానికి రూ. 18000 సబ్సిడీ మీద ఎరువులు ఇస్తుంటే.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతులపై అదనపు భారం మోపుతూ ఒక్కొక్క బస్తాకు రూ.25 రవాణా ఛార్జీ కట్టాలంటోంది. కనీసం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ మీద ఇస్తున్నటువంటి యూరియా బస్తాలను రైతులకు అందించేటటువంటి కార్యక్రమాన్ని కూడా సరిగ్గా నిర్వహించలేనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది ఎందుకు?

ఇప్పటికైనా యూరియా బస్తాల సరఫరాకు రవాణా ఖర్చు కింద ప్రతి బస్తాకు రూ.25 ప్రతి చొప్పున రైతుల నుంచి తీసుకోవాలనే నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు.. రైతులకు క్షమాపణ చెప్పాలి. ఉచితంగా రైతులకు రవాణ ఖర్చు లేకుండా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ధరకే యూరియా బస్తాలను అందించాలని బిజెపి డిమాండ్ చేస్తున్నది. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతే ఆ నష్ట పరిహారాన్ని అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకాన్ని తీసుకొచ్చింది. మొదటి సంవత్సరమే తెలంగాణ రాష్ట్రంలో కూడా బాధిత రైతులకు రూ.1812 కోట్ల నష్టం పరిహారం కేంద్రం నుంచి వచ్చింది.

రెండవ సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వం తన క్లెయిమ్ చేయడం లేదు. కేంద్రం ఇచ్చే పైసలు తీసుకోలేదు. దీనివల్ల రైతులు నష్టపోయారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో … తాము అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేస్తామని చెప్పింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించినట్లుగా కాకుండా రైతులకు నష్టం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చింది.
కాని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం గడించింది. కాని ఇంతవరకు ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయడం లేదు.
కేంద్రానికి ఎక్కడ పేరొస్తుందోమోనని అనుకుంటే.. పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా పథకం అమలు చేస్తుందా అంటే.. అదీలేదు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం

LEAVE A RESPONSE