– ఇది ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వం తప్పిదమే
– దేవాదాయశాఖ మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్
తాడేపల్లి: ముక్కోటి ఏకాదశి ముందుగా అందరికీ తెలిసి వచ్చే కార్యక్రమం.అప్పటికప్పుడు వచ్చే కార్యక్రమం కాదు. లక్షల మంది వస్తారని తెలుసు. అయినా ఏర్పాట్లలో నిర్లక్ష్యం వహించారు. ప్రభుత్వం పూర్తిగా విఫలమై పోయింది. బాధ్యులమీద చర్యలు తీసుకోవాలి.
తిరుమలను రాజకీయ కేంద్రంగా టీటీడీ ఛైర్మన్ మార్చాడు. భక్తులను పక్కకు వదిలేసి వీఐపీల సేవలో ఛైర్మన్ తరిస్తున్నారు. టీటీడీ ఈవోకూ అక్కడి కార్యక్రమాలమీద అవగాహన లేదు.
వీళ్లంతా రాజకీయ అజెండాలో భాగంగానే తిరుమలకు వచ్చారు తప్ప, భక్తులకు సేవ చేయాలని కాదు. కనీస సౌకర్యలు ఏర్పాటు చేయకపోవడం బాధాకరం. తొక్కిసలాటలో భక్తుల మరణాలు ప్రభుత్వ హత్యలే.
నాలుగు దశాబ్దాల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబునాయుడు కనీసం ముక్కోటి ఏకాదశి సందర్భాన కనీస ఏర్పాట్లు కూడా చేయలేకపోయారు. ముఖ్యమంత్రి పబ్లిసిటీ స్టంట్లు ఆపి, భక్తులకు మంచి సౌకర్యాలు అందిచడంపై దృష్టిపెట్టాలి. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేస్తున్నా. గాయపడ్డ వారు కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను.