ప్రభుత్వ ఆసుపత్రిలో మాజీ మంత్రి జోగి రమేష్‌కు వైద్య పరీక్షలు జరుగుతున్న సమయంలో, ఆయన కుమారుడు అనుచరులను సమీకరించి, వారికి మద్యం తాగించి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. లోపలికి అందరినీ వెళ్లకుండా నిలువరిస్తూ, “మేము పంపిస్తాము” అని పోలీసులు వినయంగా చెబుతున్నా, వారు తోపులాటకు దిగారు. మద్యం మత్తులో ఉన్న వైసీపీ రౌడీ మూకలు ఆసుపత్రి అద్దాలు, తలుపులను ధ్వంసం చేసింది.
కీలక ఘట్టాలు
* తోపులాట: ఆ తోపులాటలో ఒక అనుచరుడు జోగి రమేష్ భార్య జుట్టు పట్టుకుని ముందుకు దూసుకు వచ్చాడు. మరొక బలిష్టమైన వ్యక్తి సైతం ఆమెను తోస్తూ, తోసుకుంటూ లోనికి నెట్టడానికి ప్రయత్నించాడు.
* ప్రమాదం: అక్కడ పగిలిన అద్దాల ముక్కలను తొలగించకుండా ఆమెను లోనికి పంపి ఉంటే, ఆమెతో పాటు చాలామందికి గాయాలు అయ్యేవి.
* అసహాయత: అయినా మత్తులో ఉన్న ఆ వైకాపా మూర్ఖులకు ఏమీ అర్థం కాలేదు. వారే ఆమెను తోస్తూ, లాగుతూ, నెడుతూ బలంగా భర్త దగ్గరకు నెట్టారు.
భయపడుతూ ఆమె భర్తను పట్టుకుని ఏడ్చింది
ఇంతమందిని వెంట తీసుకువచ్చి విధ్వంసం చేసిన వీరి మీద వెంటనే కేసులు నమోదు చేయకపోతే, ఇదొక సంప్రదాయంలా మారుతుంది. జోగి రమేష్ కుమారుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. పోలీసులు పంపిస్తామని చెబుతున్నా, తమ కండకావరాన్ని ప్రదర్శించిన వారి మత్తును దించాలి.
కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌తో పాటు ఆయన సోదరుడు జోగి రాములకు ఈనెల 13వ తేదీ వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలోనే వారిని విజయవాడ జిల్లా జైలుకు పోలీసులు తరలించారు.
ఈ వైకాపా మూక ఒక కుట్ర ప్రకారం ఆసుపత్రిపై దాడిచేయడానికి వచ్చి, విధ్వంసం చేసిన ఘటనను పోలీసుల వైఫల్యంగా పరిగణించాలా? ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే, రాష్ట్రంలో ఏ నేరస్తుడిని అరెస్ట్ చేసినా, ఇలాంటి అల్లర్లు పునరావృతం అవుతాయి