Suryaa.co.in

Telangana

రవాణా శాఖలో రెవెన్యూ జనరేట్ పై దృష్టి సారించాలి

-స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై నిరంతర తనిఖీలు
-ఇసుక , ఫ్లై యష్ ల ఓవర్ లోడింగ్ పై వేయింగ్ మిషన్ లతో చెక్ చేయాలి
-రోడ్డు భద్రత పై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి
– రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
-స్క్రాప్ పాలసి పై వివిధ రాష్ట్రాల్లో రవాణా శాఖ అధికారులు అధ్యయనం చేసిన సమగ్ర నివేదిక అందజేత

హైదరాబాద్ : రాష్ట్రంలో రవాణా శాఖలో లక్ష్యానికి అనుగుణంగా ఆదాయ మార్గాలను పెంచేందుకు ఎన్ఫోర్స్మెంట్ పెంచాలని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్ లోని కాన్ఫరెన్స్ హల్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

సమావేశంలో రవాణా ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్ ,రవాణా శాఖ కమిషనర్ ఇలంబత్రి,జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు రమేష్ , మమత లు పాల్గొన్నారు.. గతంలో ముఖ్యమంత్రి గారి సమీక్షా సమావేశంలో రెవెన్యూ జనరెట్ చేయడానికి కావాల్సిన అన్ని అవకాశాలు ఉపయోగించుకోవాలని చేసిన సూచనలు ఎంత వరకు ముందుకు వెళ్తున్నామని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించారు.

స్కూల్ బస్సుల ఫిట్నెస్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని, ఆటో లలో విద్యార్థులను తీసుకొని ఓవర్ లోడ్ తో తీసుకెళ్తున్న వారిపై అధికారులు తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ఇప్పటికే యునిసెఫ్ రాష్ట్రంలో రోడ్డు భద్రత పై తీసుకోవాల్సిన కార్యక్రమాల పై పలుమార్లు సమావేశాన్ని నిర్వహించారనీ దానిని ప్రభుత్వ ,ప్రైవేట్ స్కూల్ లు కాలేజీల్లో ప్రతి విద్యార్థికి రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

రాజ్ భవన్ స్కూల్ లో రోడ్ సేఫ్టీ కార్యక్రమం కోసం ఇప్పటికే 5 లక్షలు మంజూరు చేశామని తెలిపారు. స్కూల్ , కాలేజి విద్యార్థులకు రోడ్డు సేఫ్టీ పై ఆధునిక సాంకేతిక పద్ధతిలో ఉండేలా వారికి కరికులం ఉండాలని తెలిపారు. ప్రతి సంవత్సరం దేశంలో రోడ్డు ప్రమాదాలలో లక్షా 60 వేల మంది మరణిస్తుండగా, తెలంగాణ లో ప్రతి రోజూ 20 మంది రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత చెందుతున్నారని వీటిని నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలపై అడిగి తెలుసుకున్నారు.

రోడ్డు నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. మోటార్ వాహన చట్టం ప్రకారం వారి లైసెన్స్ లు రద్దు చేయాలని సూచించారు.

స్క్రాప్ పాలసీ ,ఆటోమాటిక్ టెస్టింగ్ స్టేషన్స్ ఇతర రవాణా పాలసీ లను అధ్యయనం చేయడానికి రవాణా శాఖ అధికారుల బృందం ఇప్పటికే వివిధ రాష్ట్రాలను సందర్శించి అధ్యయనం చేసి అక్కడ అమలవుతున్న బెస్ట్ పాలసి ఒక సమగ్ర నివేదికను అధికారులు అందించారు.

అధికారులు ఇచ్చిన సమగ్ర రిపోర్ట్ పై పలు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచనలు చేశారు. దానిపై మరోసారి తుది నివేదిక తయారు చేయాలని ఆదేశించారు.రవాణా శాఖ కార్యాలయాలు ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్న వాటి లిస్ట్ తీసి ఎక్కడెక్కడ ఉన్నయో అక్కడ కలెక్టర్ లకి ప్రభుత్వ స్థలాల కోసం లెటర్స్ పెట్టాలని సూచించారు.

ఫీల్డ్ లో ఉపయోగకరంగా ఉండేందుకు రవాణా శాఖ అధికారులకు టాబ్స్ ఇవ్వడంతో పాటు వారి ఫీల్డ్ విజిట్ చేయడానికి వాహన సౌకర్యం ఏర్పాటు చేయాలని సూచించారు. రేషన్లైజడ్ ప్రాసేస్ లో రెవెన్యూ టార్గెట్స్ ను పెంచాలి. ఎవరైతే అన్ని రకాల నిబంధనలు పాటిస్తున్నప్పటికి అలాంటి ప్రయాణికులపై రవాణా శాఖ అధికారులు ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి..

LEAVE A RESPONSE