అమరావతి, జూన్ 3: ఆంధ్రప్రదేశ్ కోటాలో నాలుగు రాజ్యసభ స్థానాలకు వై.ఎస్.ఆర్.సి.పి.కి చెందిన నలుగు సభ్యులు వి.విజయ సాయిరెడ్డి, బీద మస్తాన్ రావు, ఎస్.నిరంజన్ రెడ్డి మరియు ఆర్.కృష్ణయ్య ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. శుక్రవారం అమరావతి శాసన సభ ప్రాంగణంలో రిటర్నింగ్ అధికారి మరియు రాష్ట్ర శాసన మండలి ఉప కార్యదర్శి పి.వి. సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్ కోటాలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఈ నలుగురు సభ్యులు ఏకగ్రీవంగా ఎంపికైనట్లు ప్రకటిస్తూ వారికి దృవీకరణ పత్రాలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్ శాసన సభకు ఎన్నిక కాబడిన సభ్యులచే రాజ్యసభకు నలుగురు (4) సభ్యుల ఎన్నికకు వై.ఎస్.ఆర్.సి.పి.కి చెందిన ఈ నలుగురు సభ్యులు మాత్రమే నామినేషన్లను దాఖలు చేయడం వల్ల సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. ఈ నెల 1 వ తేదీన నామినేషన్ పత్రాల పరిశీలన పూర్తవ్వడం మరియు నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజైన నేటి మధ్యాహ్నం 3.00 గంటల లోపు అభ్యర్థిత్వ ఉపసంహరణ నోటీసులు ఎటు వంటివి అందకపోవడంతో ఈ నలుగురు సభ్యుల ఎంపిక ఏకగ్రీవం అయినట్లుగా ప్రకటిస్తూ దృవీకరణ పత్రాలను అందజేయడం జరిగింది.
Devotional
సూర్యాంజనేయం అంటే?
శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం అనే స్తోత్రాలు చదివాం, విన్నాం. కానీ ఈ సూర్యాంజనేయం అంటే? సూర్యుడు, ఆంజనేయుడికి ఉన్న సంబంధం మనం తెలుసుకోవలసిందే. వాల్మీకి రామాయణం, ఇతర పురాణాలు సూర్యుడికీ, హనుమంతుడికీ ఉన్న అనుబంధాన్ని సవివరంగా తెలియజేశాయి/ హనుమంతునికి సూర్యునితో ఉన్న అనుబంధం మరెవ్వరితోనూ కనబడడు. బాలాంజనేయుడికి సూర్యుడు ఆహారం : హనుమంతుడు బాలుడుగా ఉన్నప్పుడు…
చండీ హోమం ఎందుకు చేస్తారు?
అమ్మ ఆది పరాశక్తి అని తెలిసిన విషయమే! చండీ మాత ఓ ప్రచండ శక్తి. భూగ్రహంపై మాత్రమే కాకుండా విశ్వాంతరాళాలని అంటిపెట్టుకునే ఉంటుంది. సృష్టి జరగడానికి, అది వృద్ధి చెందడానికి, తిరిగి లయం కావడానికి అవసరమైన శక్తి అంతా ఆమెలోనే ఉంది. ఆమె ఆదిశక్తి, పరాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్చాశక్తి, క్రియాశక్తి, కుండలినీ శక్తి! అందుకే ఆమెకు…
Sports
ముఖ్యమంత్రి సహాయనిధికి సాత్విక్ సాయిరాజ్ 2 లక్షల విరాళం
విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రముఖ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ 2 లక్షల విరాళం ఇచ్చారు. ఈ మేరకు సాత్విక్ తరఫున ఆయన తల్లిదండ్రులు టి రంగమణి ,ఆర్ కాశీ విశ్వనాథ్ గురువారం ఉదయం అమలాపురం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ను కలిసి…
స్వయంకృషి, పట్టుదలతో ఐసీసీ చైర్మన్ అయిన జే షా!
నిరుపేద కుటుంబంలో పుట్టిన జేషా, తిండి తిప్పలకోసం అష్ట కష్టాలు పడ్డారు. పలుకుబడి కలిగిన వారెవరితోనూ సంబంధం లేని వారు. అయినప్పటికీ అతని పూర్తి కృషి మరియు క్రికెట్ పట్ల మక్కువతో భారత క్రికెట్లోకి ప్రవేశించారు. అతని అద్భుతమైన సంస్థాగత నైపుణ్యాలతో, అనతికాలంలోనే బీసీసీఐ కార్యదర్శిగా నియమించబడ్డారు. ప్రపంచం అతని ప్రతిభను చూసి అతడిని చైర్మన్…