– టీడీపీ మాజీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ పెద్దలు కొణిజేటి రోశయ్య కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం పిడుగురాళ్ళలో 2022 మార్చి కల్లా ఏర్పాటు చేయాలి . ఎందుకంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి, 60 సంవత్సరాలకు పైగా రాజకీయాల్లో ఉండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి రోశయ్య .
ఈరోజు రాజకీయ నాయకులు మాట్లాడే భాష ఒకసారి చూస్తే రాజకీయాల్లో రోశయ్య ని చూసి నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎవరినీ నొప్పించకుండా సమాజానికి విలువలు నేర్పిన వ్యక్తి రోశయ్య . అటువంటి
మహోన్నతమైన వ్యక్తి చనిపోవడం చాలా బాధాకరం. ఆయన నరసరావుపేట పార్లమెంటు సభ్యులుగా కూడా పనిచేశారు.
కాబట్టి పిడుగురాళ్లలో వెంటనే రోశయ్య కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వమే ముందుకొచ్చి ఏర్పాటు చెయ్యాలి. అలా ఏర్పాటు చేయని పక్షంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రోశయ్య గారి కాంస్య విగ్రహాన్ని పిడుగురాళ్లలో ఏర్పాటు జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం.