– మంత్రి పొంగూరు నారాయణ
మున్సిపాలిటీల్లో రోడ్లపై పశువులు, పెంపుడు కుక్కలను వదిలేస్తున్న యజమానులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనున్నట్లు పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. పశువులు మరియు పెంపుడు జంతువులు రోడ్లపై సంచరించడం వలన వాహనదారులు మరియు పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో, పెంపుడు జంతువులను రోడ్లపైకి వదలకుండా యజమానులు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. పశువులు మరియు పెంపుడు కుక్కలు రోడ్లపై కనిపించిన సందర్భంలో, వాటిని మున్సిపాలిటీకి తరలించి, సంబంధిత యజమానులకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు.