– ప్రపంచంలో ఎక్కడ గంజాయి, ఇతరమాదకద్రవ్యాలు పట్టుబడినా మూలాలు ఏపీనే తాకుతున్నాయి.
• తన వైఫల్యాలపై యువత, మరీముఖ్యంగా నిరుద్యోగులు ఎక్కడప్రశ్నిస్తారోనన్న భయంతో, ముఖ్యమంత్రి వారిని మత్తులోజోగేలా చేస్తున్నాడు.
• అందుకోసం ఏపీలో గంజాయి,ఇతరమాదకద్రవ్యాలను తనపార్టీ వారి అండదండలతో విచ్చలవిడిగా చలామణీచేస్తున్నాడు.
• తమదోపిడీని, వైఫల్యాలను ప్రశ్నించేవారిపై భౌతికదాడులకు పాల్పడుతూ, పాలకులు వారిచీకటి వ్యాపారాలు, మత్తుబిజినెస్ లు చక్కబెట్టుకుంటామంటే చూస్తూఊరుకోం.
– మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు
వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం మత్తాంధ్రప్రదేశ్ గా మారిందని, దాంతో స్వర్ణాంధ్రప్రదేశ్, హరితాంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్ అన్నపేర్లు గతకాలపు జ్ఞాపకాలుగా మారిపోయాయని, ఏపీ ని మత్తాంధ్రప్రదేశ్ గా మార్చడానికి జగన్మోహన్ రెడ్డి, ఆయనయంత్రాంగం సర్వశక్తులు ఒడ్డి పనిచేస్తోందని టీడీపీనేత, తెలుగురైతు విభాగం రాష్ట్రఅధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
దేశంలో, ఇంకాచెప్పాలంటే ప్రపంచంలో ఎక్కడమాదకద్రవ్యాలు, గంజాయి పట్టుబడినా అక్కడి అధికారుల నోళ్లనుంచి ఆంధ్రప్రదేశ్ అనే పేరే వినిపిస్తుండటం, నిజంగా తెలుగుజాతి మొత్తం సిగ్గతో తలదించుకోవాల్సిన విషయమనే చెప్పాలి. రాష్ట్రం కేంద్రంగా సాగుతున్న గంజాయి, మాదకద్రవ్యాల వ్యాపారాన్ని కట్టడిచేసి, ఏపీకివచ్చిన అప్రదిష్టను తొలగించే ప్రయత్నంచేయకుండా జగన్ ప్రభుత్వం చోద్యంచూస్తోంది.
నిన్నటికి నిన్న తమిళనాడులోని తూత్తుకుడిలో రూ.21కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడితే, ఆ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశ్ ధారాస్వామి అనేవ్యక్తివద్దకు వచ్చి ఆగింది . ఇలాంటి అనేకఘటనలు రోజు
ఎక్కడో ఒక చోట బయటపడుతూనే ఉన్నాయి. వైసీపీనేతలప్రమేయంతో, వారికనుసన్నల్లో వారికి తెలిసి సాగుతున్న మాదకద్రవ్యాలవ్యవహారంపై నిలదీసినందుకే ఈప్రభుత్వం టీడీపీజాతీయ కార్యా లయంపై దాడికి పాల్పడింది. వైసీపీగూండాలతో పట్టపగలు డీజీపీకార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్నకార్యాలయంపై దాడిచేయించి, దానిలోని ఉద్యోగులనెత్తురు కళ్ల చూశారు.
గతంలో గుజరాత్ లోని ముంద్రాపోర్ట్ లో రూ.21వేలకోట్ల విలువైన హెరాయిన్ పట్టుబడితే, దానిమూలాలు ఏపీలోని విజయవాడలోఉన్న ఏజెన్సీలో దొరికాయి. సదరు వ్య వహారం సహా, రాష్ట్రంలో సాగుతున్న గంజాయి, ఇతరమాదకద్రవ్యాల వ్యాపారాలపై ప్రతిపక్ష తెలుగుదేశంపార్టీ ప్రశ్నిస్తూ, తమను నిగ్గదీస్తుందన్న అక్కసుతోనే పాలకులు భౌతికదాడుల కు పూనుకున్నారు. రాష్ట్రంకేంద్రంగా సాగుతున్న డ్రగ్స్, గంజాయి వ్యవహారాలపై చర్యలు తీసుకోవాలని స్వయంగా ప్రతిపక్షనేత చంద్రబాబునాయడుగారు ఢిల్లీవెళ్లి కేంద్రదర్యాప్తు సంస్థ లకు, రాష్ట్రపతికి ఫిర్యాదుచేయడం జరిగింది. ప్రతిపక్షనేత ఢిల్లీకి వెళ్లముందువరకు రాష్ట్రంలో ఎక్కడా మాదకద్రవ్యాలు,గంజాయిలేదని ఓండ్రించిన ప్రభుత్వం, ఆతరువాతే ఆపరేషన్ పరివ ర్తన్ పేరుతో ఏపీలోసాగుతున్నగంజాయిసాగు ధ్వంసానికి పూనుకుంది.
రాష్ట్రంలో అసలు గంజాయే లేదన్నడీజీపీ, ప్రభుత్వపెద్దలు రూ.4వేలకోట్ల విలువైన గంజాయిపంటను ధ్వంసం చేశామని చెప్పుకొని జబ్బలుకూడా చరుచుకున్నారు. గంజాయిసాగు, రవాణాసహా, మాదకద్రవ్యాలను నియంత్రించడంలో జగన్ ప్రభుత్వం, అధికారయంత్రాంగం ఘోరంగా విఫల మవుతూనేఉంది. కేంద్రదర్యాప్తుసంస్థ ఎన్ఐఏ రాష్ట్రంలోసోదాలుజరిపి, వాస్తవాలు బయటకు తీసినాకూడాఈప్రభుత్వం, ఇక్కడిపాలకులచేతుల్లో కీలుబొమ్మలుగా మారిన యంత్రాంగం ఇంకాబుకాయిస్తూనే ఉంది. గంజాయి, మాదకద్రవ్యాల వ్యవహారంలో అసలుసిసలు పెద్దచేప లైన అధికారపార్టీవారిని వదిలేసి, కూటికోసంపనిచేసే సాదాసీదా గిరిజనులను బలితీసుకునే చర్యలకు ఉపక్ర మించింది.
పొట్టకూటికోసం పనిచేసేవారే అసలైనదొంగలు, దోషులని చిత్రీక రించేందుకు ప్రభుత్వం, అధికారులు ప్రయత్నిస్తున్నారు. తమనుప్రశ్నించేవారు ఎంతటి వారైనా, ఎవరైనాసరే చూస్తూఊరుకోమనే సంకేతాలను పాలకులు ఇస్తున్నారు. వైసీపీకోసం పనిచేస్తూ, జగన్మోహన్ రెడ్డిని అభిమానించేసుబ్బారావుగుప్తాపై జరిగినదాడే అందుకు నిదర్శనం. భయపడిఎక్కడో తలదాచుకున్నవ్యక్తినికూడా వెంటాడి, వేటాడి చావచితగ్గొట్టి, వీడియోలుతీసి, ఆఖరికి సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేసి, ప్రశ్నించేనోళ్లను నొక్కేస్తా మనే సంకేతాలు ఇచ్చారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా డ్రగ్స్, ఇతరమాదకద్రవ్యాలు చలామణీ అవుతున్నాయంటే అందుకు కారణం ముమ్మాటికీ జగన్మోహన్ రెడ్డి, ఆయనప్రభుత్వం అందిస్తున్న సహాయసహాకారాల వల్లనే.
మాటతప్పను, మడమతిప్పను అన్నవ్యక్తే నేడు అన్నివాగ్ధానాలకు, హామీలకు తిలోదకాలుఇచ్చి, వాటిపై ప్రజలు తనను ప్రశ్నించకుండా, వారిలో చైతన్యంరాకుండాచేయడంకోసం, మరీముఖ్యంగా విద్యార్థులు, యువతశక్తిని మత్తులో ముంచేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. దానిలోభాగమే ప్రభుత్వమే స్వయంగాపెంచి పోషిస్తున్న మత్తుపదార్థాల వ్యాపారమని చెబుతున్నాం. గంజాయి, ఇతరమాదకద్రవ్యాల వ్యవహారంపై పాలకులచర్యలను, ముఖ్యమంత్రి వైఖరిని టీడీపీనిత్యం ప్రశ్నిస్తూనేఉంటుంది. ప్రభుత్వం రాష్ట్రాన్ని మత్తాంధ్రప్రదేశ్ గా మారుస్తున్నదానికి సంబంధించిన సమగ్ర సమాచారా న్ని పాలకులకు, అధికారులకు అందించడంకూడాజరిగింది.
అయినా కూడా ప్రభుత్వంలో, ముఖ్యమంత్రిలోచలనంలేదు. తనవైఫల్యాలను యువకులు, మరీముఖ్యంగా నిరుద్యోగులు ఎక్కడప్రశ్నిస్తారోనన్న సంకుచితస్వభావంతోనే ముఖ్యమంత్రి విద్యాలయాలను, మరీ ముఖ్యంగా విశ్వవిద్యాలయాలను మత్తుపదార్థాలకు కేంద్రాలుగా మారుస్తున్నాడు. గంజాయి ని లిక్విడ్ రూపంలోకి మార్చి, సులభంగా రవాణాచేసేలా ప్రభుత్వపెద్దలే సహకరిస్తున్నారు. పాలకులఅండదండలతో, ప్రభుత్వపెద్దల సహాయసహకారాలతో సాగుతున్న గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వ్యవహారం బయటకు పొక్కకూడదనే వైసీపలోని తుపాకీరాయుళ్లు కొందరు ఏదేదో మాట్లాడుతున్నారు.
డిప్యూటీసీఎం నారాయణస్వామి, కొడాలినానీ, అంబటి రాంబాబులు చేసిన అడ్డగోలుప్రకటనలన్నీ అందులోభాగంగా చేసినవేనని స్పష్టంచేస్తున్నాం. గంజాయి, ఇతరమాదకద్రవ్యాలకుసంబంధించిన సమాచారాన్ని తెప్పించుకొని అసలు వాస్త వాలు బయటపెట్టాల్సిన పోలీస్ యంత్రాంగం ప్రశ్నించేవారికి నోటీసులిస్తూ, వారినిభయభ్రాం తులకు గురిచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం, అధికారయంత్రాంగం తక్షణమే మత్తుపదార్థాల నియంత్రణపై దృష్టిపెట్టి, వాటివెనకాల ఎంతటివారున్నా కఠినంగా శిక్షించాల ని టీడీపీతరుపున డిమాండ్ చేస్తున్నాం.