7వేల విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలోని మర్మాన్ని ప్రజల ముందుంచాలి

• గుజరాత్ ప్రభుత్వం యూనిట్ విద్యుత్ రూ.1.99పైసలకు కొంటే, యూనిట్ పై ఏపీ రూ.2.49పైసలు ఎందుకు పెడుతోంది?
• రాష్ట్రానికి ఆదాయం, యువతకు ఉద్యోగాలు రాని ఒప్పందాలు ఎవరికోసం?
• పోలవరంలో మాదిరే విద్యుత్ టెండర్లలో కూడా రివర్స్ టెండరింగ్ తో ఆదా ఎందుకు చేయలేకపోయారు?
– మాజీమంత్రి కిమిడి కళావెంకట్రావు
రాష్ట్రంలోని విద్యుత్ అవసరాలగురించి, ఆలోచించకుండా, ముందు చూపులేకుండా వ్యవహరిస్తున్న రాష్ట్రప్రభుత్వం, చేసేప్రతిపనిలో ప్రతిఫలం ఆశిస్తోందితప్ప, ప్రజోపయోగాలు, రాష్ట్రాభివృద్ధిని పట్టించుకో వడం లేదని టీడీపీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి కళావెంకట్రావు తెలిపారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
ప్రభుత్వం లాభాపేక్షతోనే పనిచేస్తోందని చెప్పడానికి, సెకీద్వారా ఏపీ సర్కారు చేసుకున్న 7వేలమెగావాట్ల సోలార్ విద్యుత్ ఒప్పందమే నిదర్శనం. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతగురించి, ప్రజలపై పడే భారం గురించి పాలకులకు ఏమాత్రం ఆలోచించడం లేదని చెప్పడా నికి కూడా సదరు ఒప్పందమే నిదర్శనం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక మిగులు విద్యుత్ ఉన్నరాష్ట్రాన్ని, చీకట్లలో మగ్గేలాచేసింది. గత ప్రభుత్వంలోచేసిన విద్యుత్ ఉత్పత్తికంటే, ఒక్కమెగావాట్ విద్యుత్ కూడా అదనంగా ఎందుకు ఉత్పత్తి చేయలేకపోయింది?
టీడీపీ ప్రభుత్వంలో కర్నూల్లో సోలార్ పార్క్ ఏర్పాటుకి అంకురార్పణ చేయడం జరిగింది . దానివల్ల 17,500మంది స్కిల్డ్ నిరుద్యోగ యువతకు ఉపాధి లభించిఉండేది. అలానే నిరుద్యోగులకు మేలుకలిగించేలా, ప్రజలపై భారంపడకుండా, 7వేల మెగావాట్ల విద్యుత్ ఒప్పందంపై ప్రభుత్వం ఎందుకు ఆలోచనచేయలేదని ప్రశ్ని స్తున్నాం. ఒక్కో మెగావాట్ కు ఎంతఖర్చవుతుందో లెక్కించి, తద్వారా ఎందరికి ఉపాధి కలుగుతుందనే ఆలోచన ప్రభుత్వం ఎందుకుచేయడంలేదు?
7వేలమెగా వాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ మాటల్లో భయపడుతున్న ధోరణి కనిపిస్తోంది. ప్రభుత్వం చెప్పింది కాబట్టి, ఉద్యోగిగా తన పని తాను చేశానంటున్న ఆయన మాటల్లో ఏదో మర్మం కనిపిస్తోంది . ఈ వ్యవహరంలోని లొసుగులను, లోపాలను టీడీపీ ఎమ్మెల్యే కేశవ్ ఇప్పటికే ఎత్తిచూపారు. సెకీ అనేసంస్థ ముసుగులో గుజరాత్ లో 21 డిసెంబర్ 2020లో ఒక ఒప్పందంచేసుకున్నారు. సెకీద్వారానే గుజరాత్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లు ఒప్పందాలకు సంబంధించి, 500 మెగావాట్లకొనుగోళ్లకు, యూనిట్ కు రూ.1.99పైసలకే ఒప్పందంచేసుకోవడం జరిగింది.
కానీ ఏపీప్రభుత్వం అదేవిధ మైన ఒప్పందాన్ని అమలుచేస్తూ యూనిట్ రూ.2.49పైసలకు తీసుకోవడానికి సిద్ధమైంది. ఎందుకు అలా ఎక్కువధరకు ఒప్పుకున్నారో, దానిలోని మర్మమేమిటో ప్రజలే గుర్తించాలి.
పోలవరం టెండర్లను ఎలాగైతే ఈ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ చేసిందో, అలానే 7వేలమెగావాట్ల విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాన్ని ఎందుకు చేయకూడదని ప్రశ్నిస్తున్నాం. యూనిట్ రూ.1.99పైసలకు గుజరాత్ ప్రభుత్వం కొంటున్నప్పు డు ఏపీప్రభుత్వం రూ.2.49పైసలు ఎందుకు పెట్టింది. అదనపుధర చెల్లించి విద్యుత్ ఎందుకు కొంటున్నారో , ఆ భారం ఎవరిపై వేస్తారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. సోలార్ విద్యుత్ రేటు, ఏ ఏటికి ఆ ఏడు టెండర్, టెండర్ కి తగ్గుతూనే ఉంటుందనే వాస్తవం ప్రభుత్వానికి కూడా బాగా తెలుసు.
గతప్రభుత్వంలో చేసుకున్న సోలార్ విద్యుత్ ఒప్పందాల ను ఈ ప్రభుత్వం అలర్లిచేయడంతో, అలాంటి ఒప్పందాలకుఎవరూ ముందుకు రాని పరిస్థితి.ప్రభుత్వం సొంతంగా విద్యుత్ కొనుగోళ్లకోసం పెట్టుబడులు పెట్టే పరిస్థితి అసలే లేదు. దానికితోడు, స్కిల్డ్ అన్ స్కిల్డ్ యువతకు ఉపాధి లేకుండా చేశారు.ఎంతసేపూ ప్రతిపనిలో పాలకులు స్వార్థం, లాభానికే ప్రాధాన్యతఇస్తూ, అవినీతికి ఆస్కారమిస్తున్నారు. ఇంధనశాఖ కార్యదర్శి ఈ టెండర్ కు సంబంధించి రూ.2వే లకోట్లు ప్రభుత్వానికి ఆదా అవుతాయంటున్నారు. ఎప్పుడో 2024లో కొనే విద్యుత్ కు ఇప్పుడు ఎలా ఆదాఅవుతుందో చెప్పాలి.
ఒప్పందం జరిగిన నాటి నుంచి అది అమల్లోకివస్తే, ఈ రెండేళ్లలో ఆభారమంతా ప్రభుత్వం ద్వారా, ప్రజల పైనే పడుతుంది కదా! సెకీ ముసుగులో ప్రభుత్వంచేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం ముమ్మాటికీ ప్రజలకు భారాన్నే మిగులస్తుందనడంలో ఎలాంటిసందే హం లేదు. ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం ఏపీలో విద్యుత్ ప్రాజెక్ట్ నెలకొల్పి ఉంటే, దానివల్ల రాష్ట్రానికి రూ.35వేలకోట్ల పెట్టుబడి వచ్చేదికదా. అలా ఆలోచించకుండా ఎక్కడో రాజస్థాన్ నుంచి విద్యుత్ కొనడం రాష్ట్రానికి భారం కాక లాభమెలా అవుతుందని ప్రశ్నిస్తున్నాం. ఏవైనా ప్రశ్నిస్తే, ప్రశ్నించినవారిపై కేసు లు పెట్టడం, వారిని జైళ్లకు పంపడంచేస్తున్నారు.