– మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు
ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు మూడు రాజధానుల చట్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంనకు అధికారం లేదనియు,సి.ఆర్.డి.ఎ తో అమరావతి రైతుల ఒప్పందము ననుసరించి లోగడ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించాలన్న తీర్పును అమరావతి రైతులతోపాటు రాష్ట్ర ప్రజానీకం ఆహ్వానిస్తూంది.ఇప్పటికైన జగన్మోహన రెడ్డి పిచ్చి పిచ్చి ఆలోచనలను విరమించి,నిర్మాణం అవుతూ పూర్తికావాల్సిన భవనముల పనులను పూర్తిచేసి ఉద్యోగులకు, న్యాయమూర్తులు, ప్రజాప్రతినిధులకు అందించాలి.రహదారులు,డ్రెయినేజీ ,నీటిసరఫరా ,మున్నగు పనులను చేపట్టాలి.విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని పెట్టబోతున్నామంటూ బొత్స సత్యనారాయణ యికనుండైనా పిచ్చి ప్రేలాపన మానుతారని ఆశిస్తున్నాను. హైకోర్టులో రైతులపక్షాన సమర్థవంతంగా వాదనలు వినిపించిన న్యాయవాదులందరికి అభినందనలు.రెండు సంవత్సరాలు పైగా ఉద్యమాన్ని ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి సజీవంగా నిలబెట్టిన రైతులకు ప్రత్యేకంగా మహిళా సోదరీమణులకు అభినందనలు ,కృతజ్ఞతలు.