Suryaa.co.in

Andhra Pradesh

ఘనంగా శ్రీ సీతారాముల వారి విగ్రహ ప్రతిష్ట

భారీ అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొన్న వాసంశెట్టి సత్యం

రామచంద్రపురం: శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల వారి నూతన విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమం ఆదివారపుపేటలో అత్యంత ఘనంగా, కన్నుల పండుగలా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అలాగే శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి 35వ వార్షికోత్సవ వేడుకలు కూడా ఘనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సత్యం విశేష పూజలు, హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి, రామచంద్రపురం నియోజవర్గంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో తులతూగాలని కోరుకున్నారు. అనంతరం జరిగిన అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రసాదం పంపిణీ చేశారు. భక్తుల కోసం ఆలయ అభివృద్ధి కమిటీ, గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో స్వామివారి నగర సంకీర్తన, కోలాటం, భజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. శ్రీ సీతారాముల వారి నూతన విగ్రహల ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా జరగడం పట్ల గ్రామ ప్రజలు, భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE