Suryaa.co.in

Andhra Pradesh

జడ్జిమెంట్లను అడ్వకేట్ జనరల్ తప్పుగా అన్వయించారు

స్కిల్‌ కేసులో ఎఫ్‌ఐఆర్‌ పై గతంలో జరిగిన దర్యాప్తును మెమో మాత్రమే వేశారు
అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A అనేది కచ్చితంగా వర్తిస్తుంది
రిజిస్టర్ అయిన ప్రతి ఎఫ్‌ఐఆర్‌ కు సెక్షన్ 17A వర్తిస్తుంది
నగదు అంశమే ప్రభుత్వానికి సంబంధించింది.. మిగతావన్నీ కూడా ప్రైవేట్ సేవలే
స్కిల్‌ కేసులో చంద్రబాబు న్యాయవాది హరీష్‌ సాల్వే వాదన

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టయిన మాజీ సీఎం చంద్రబాబునాయుడు నిర్దోషి అని, ఆయన తరఫున వాదిస్తున్న ప్రముఖ న్యాయవాది హరీష్‌ సాల్వే కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఆమేరకు ఆయన తన వద్ద ఉన్న ఆధారాలతో వాదించారు.

హరీష్‌సాల్వే వాదనలు ఇలా ఉన్నాయి

– అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A కింద తగిన అనుమతులు తీసుకోలేదు
– ఈ ఎఫ్‌ఐఆర్‌ చట్టవిరుద్ధమైనది
– గతంలో వచ్చిన జడ్జిమెంట్లను అడ్వకేట్ జనరల్ తప్పుగా అన్వయించారు
– సెక్షన్ 17A పూర్తి వివరాలు తెలిసి ఉండీ తప్పనిసరి అనుమతులు తీసుకోలేదు
– ఈ సందర్భంగా స్టేట్ ఆఫ్ రాజస్థాన్-తేజ్‍మల్ చౌదరి కేసును ఉదహరించిన హరీశ్ సాల్వే
– నేరం ఎప్పుడు జరిగిందన్నది కాదు.. దర్యాప్తు వేళ ఉన్న చట్టబద్ధత పరిగణించాలి
– కేసు పెట్టేందుకు మూలమైన సమయం దృష్టిలో పెట్టుకుని సెక్షన్ 17A వర్తిస్తుంది
– ఈ కేసులో అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A అనేది కచ్చితంగా వర్తిస్తుంది
– 2018 చట్టసవరణ తర్వాత రిజిస్టర్ అయిన ప్రతి ఎఫ్‌ఐఆర్‌ కు సెక్షన్ 17A వర్తిస్తుంది
– ఆ సమయంలో చంద్రబాబు సీఎంగా ఉన్నారు కనుకే ముందస్తు అనుమతి తప్పనిసరి
– ఇప్పుడు పదవిలో లేరు కనుక ఆ నిబంధన వర్తించదనడం చట్టబద్ధంగా చెల్లుబాటు కాదు
– కొత్త ప్రభుత్వం.. పాత ప్రభుత్వం మీద ప్రతీకార చర్యలకు పాల్పడకుండా ఈ నిబంధన పెట్టారు
– ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వ కౌంటర్ మాకు ఇచ్చారు
– కౌంటర్‍లో కూడా గతంలో పొందుపరిచిన ఆరోపణలనే మళ్లీ చెప్పారన్న హరీశ్ సాల్వే
– ఈ సందర్భంగా అర్ణబ్ గోస్వామి కేసును ఉదహరించిన హరీశ్ సాల్వే
– ఇది కచ్చితంగా రాజకీయ ప్రతీకార కేసుగానే పరిగణించాలి
– వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలుగుతుందన్న సమయంలో కేసును ఏకపక్షంగా చూడకూడదు
– హైకోర్టు వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలగకుండా విచక్షణాధికారాన్ని వినియోగించాలి
– ఎన్నికలు సమీపిస్తున్న వేళ దీన్ని ప్రతీకారపూర్వక కేసుగానే పరిగణించాలి
– ఇదే కేసుకు సంబంధించిన జీఎస్‍టీ ఫిర్యాదులను హైకోర్టు పరిశీలించాలి
– ప్రాజెక్టులో 90 శాతం ప్రైవేటు సంస్థ.. 10 శాతం ప్రభుత్వం భరిస్తుంది
– యువతలో సాంకేతిక నైపుణ్యాలు అభివృద్ధి చేసేందుకే ఈ ప్రాజెక్టు ఏర్పాటు
– ఈ సందర్భంగా జీఎస్టీ కేసూ ప్రతీకార చర్యేనా అని ప్రశ్నించిన ప్రభుత్వ న్యాయవాది
– నిన్న రాత్రే కౌంటర్ ఇచ్చి ఉండాల్సిందని ప్రస్తావించిన హరీశ్ సాల్వే
– అతి సన్నిహితులు ఈ కేసుపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.. అంతా నిశ్శబ్దంగా జరిగింది
– ఎదుటి వ్యక్తులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే జరిగినట్లుగా కనిపిస్తోంది
– ఈ కేసుకు ప్రాతిపదికైన ప్రాజెక్టు రిపోర్టులు, వాటి విలువ మదింపు చేశారు
– వాటి వివరాలన్నీ అందరికీ అందుబాటులో ఉన్నాయి
– స్కిల్ డెవలప్మెంట్ మదింపు నివేదికను కోర్టు ముందు చదివి వినిపించిన సాల్వే
– నగదు అంశమే ప్రభుత్వానికి సంబంధించింది.. మిగతావన్నీ కూడా ప్రైవేట్ సేవలే

LEAVE A RESPONSE