Suryaa.co.in

Andhra Pradesh

కౌరవ మూకను తరిమికొట్టాలి

 -ముస్లీం మహిళపై వైసీపీ దాడి సిగ్గుచేటు
-టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు

ముస్లీం మహిళపై వైసీపీ దాడి సిగ్గుచేటని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు శనివారం ఒక ప్రకటనలో ఖండిరచారు. నందికొట్కూరులో మున్సిపల్‌ కో-ఆప్షన్‌ సభ్యుడు ముస్లీం మహిళ పట్ల అనుచితంగా వ్యవహరించడం, ప్రశ్నించిన బాధితులపైనే తిరిగి దాడి చేయడం రాష్ట్రంలో అరాచక పాలనకు నిదర్శనమన్నారు. బురకాను తొలగించే స్థాయికి వైసీపీ నేతల అహంకారం చేరుకుందంటే వారు ఏ స్థాయిలో తెగబడుతున్నారో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. మత ఆచారాలను గౌరవించని, మహిళల మనోభావాలకు విలువివ్వని ఇలాంటి కౌరవ మూకను మే 13న అన్ని వర్గాలు ఏకమై తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

LEAVE A RESPONSE