కాగ్ తాజా నివేదికలు వైసీపీ ప్రభుత్వ అసమర్థ పాలనను… జగన్ రెడ్డి దుర్మార్గాలను ఎత్తిచూపాయి

Spread the love

-నివేదికలపై అసెంబ్లీలో సమాధానం కూడా చెప్పకుండా సర్కార్ తప్పించుకోవడం జగన్ రెడ్డి భయానికి నిదర్శనం
• రాష్ట్రాన్ని సమూలంగా నాశనం చేయడానికి జగన్ రెడ్డి కంకణ కట్టుకున్నాడు అన్నాడు అనడానికి కాగ్ నివేదికలే సాక్ష్యం
• వైసీపీ ప్రభుత్వానికి కాగ్ అన్నా… న్యాయస్థానాలన్నా… ఎఫ్.ఆర్.బీ.ఎం యాక్ట్ అన్నా లెక్క లేదు
• ఏ చట్టాలు …ఎవరూ తమనేమీ చేయలేరన్న దుర్మార్గపు విధానాలతో ఈ ప్రభుత్వం ముందుకెళుతోంది
• 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఏర్పాటు చేయాల్సిన స్థానిక సంస్థల పాలనా కమిటీలకు తిలోదకాలిచ్చి మరీ వైసీపీ ప్రభుత్వం పాలన పేరుతో వార్డు సచివాలయ వ్యవస్థను ప్రవేశ పెట్టడాన్ని కాగ్ తీవ్రంగా తప్పుపట్టింది
– టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు

వైసీపీ ప్రభుత్వ పనితీరు..పాలకుల ఆర్థిక విధానాల్లోని డొల్లతనాన్ని బహిర్గతం చేసేలా కాగ్ (సీ అండ్ ఏజీ) ఇచ్చిన రెండు నివేదికలు ఉన్నాయని, ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ల్లోని వాస్తవాలను పరిశీలించిన తరువాత కాగ్ ఇచ్చిన రిపోర్ట్ నెం 3/23ని అసెంబ్లీ, శాసనమండలిలో 25వ తేదీన ప్రవేశపెట్టారని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే ..

“ వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎంత చట్టబద్ధత కల్పించి, వాటియొక్క ఆర్థిక వనరులు… సదరు సంస్థల్లోని ప్రజాప్రతినిధుల అధికారాల అమలుపై కూడా కాగ్ రిపోర్ట్ నెం 2/23ని కూడా ఉభయసభల్లో ప్రవేశపెట్టింది. కాగ్ నివేదికలపై నాలుగేళ్ల నుంచీ వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం చలనం లేనట్టే వ్యవహరిస్తోంది. ఇలా వ్యవహరిస్తు న్న సర్కార్ పై వాస్తవంగా కేంద్రం చర్యలు తీసుకోవాలి. అలానే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీ.ఏ.సీ) ఛైర్మన్ గా టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వ్యవహరిస్తున్నారని, సదరు కమిటీ సమావేశాలు కూడా జరక్కుండా ఈ ప్రభుత్వం కక్షతో వ్యవహరిస్తోంది.

వైసీపీ ప్రభుత్వానికి కాగ్ అన్నా… న్యాయస్థానాలన్నా… ఎఫ్.ఆర్.బీ.ఎం యాక్ట్ అన్నా లెక్క లేదు. ఏ చట్టాలు …ఎవరూ తమనేమీ చేయలేదన్న దుర్మార్గపు విధానాలతో ఈ ప్రభు త్వం ముందుకెళుతోంది. కాగ్ తన తాజా నివేదికల్లో ప్రధానంగా 10 అంశాలు లేవనె త్తింది. వాటిలో ప్రధానమైనది రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించింది.

రాజధానికి భూములిచ్చిన రైతులకు ఇవ్వాల్సిన లే అవుట్ల అభివృద్ధిని పనులు కూడా ఎక్కడివక్కడే నిలిచిపోయాయి
2014 – 2019లో నాటి రాష్ట్ర ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి భూములు తీసుకోవ డం… ఆ భూములిచ్చిన రైతులకు సకాలంలో కౌలు..ఇతర పరిహారాలు ఇవ్వడం.. భూమిని సక్రమంగా చట్టప్రకారం లే అవుట్లుగా మార్చడం చేసింది. అంత జరిగిన దాన్ని ఈ ప్రభుత్వం వచ్చాక రాజధాని అమరావతి కాదని.. రాష్ట్రానికి మూడు రాజ ధానులు ఏర్పాటుచేస్తామని చెప్పి నాటి ప్రభుత్వంలో జరిగిన మొత్తం అభివృద్ధిని పూర్తిగా నాశనం చేసింది.

రాజధానికి భూములిచ్చిన రైతులకు ఇచ్చే లే అవుట్లను 14 జోన్లుగా విభజించి, వాటిలో మౌలిక వసతుల కల్పనకు రూ.13వేలకోట్లు అవుతుందని నిర్ధారించిన గత ప్రభుత్వం, కొంతవరకు పనులు ప్రారంభించింది. గత ప్రభుత్వం దిగిపోయే నాటికి అందుకోసం రూ.183కోట్లు ఖర్చుపెట్టింది. 2019 ఎన్నిక లకు ముందు ఎన్నికల కోడ్ వచ్చేనాటికి రాజధానిలో ఏవైతే పనులు జరిగాయో, ఆ పనులు ఇప్పటికీ అలానే ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఈ అంశంపై కాగ్ ఈ ప్రభు త్వాన్ని తప్పు పట్టి వివరణ కోరింది.

ప్రజా వేదిక విధ్వంసం సహా గతప్రభుత్వంలో అమరావతిలో ప్రారంభమైన వివిధ పనులు నిలిపేయడం ద్వారా జగన్ సర్కార్ రూ.4100కోట్ల ప్రజల సొమ్ము నేలపాలు చేసింది
ప్రజా వేదికను నేలమట్టం చేయడం ద్వారానే జగన్ రెడ్డి రూ.11.47 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు. ప్రజావేదిక కూల్చవద్దని.. దాన్ని మరోచోటికి మార్చుకోవచ్చ ని అధికారులు చెప్పినా ఈ ముఖ్యమంత్రి వినలేదు. అలానే రాజధాని ప్రాంతంలోని 400 కేవీ విద్యుత్ లైన్ ను భూగర్భంలో వేయడానికి గత ప్రభుత్వమే ప్రతిపాదనలు సిద్ధంచేసి, టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడం జరిగింది.

దానిలో భాగంగా రూ.60 కోట్ల వరకు ఖర్చుపెట్టడం జరిగింది. విద్యుత్ లైన్ భూగర్భంలో వేయడానికి గుంతలు తీయడంతో పాటు.. రూ.208కోట్లు ఖర్చుపెట్టిన కేబుల్ కూడా ఎక్కడిదక్కడే ఉండిపో యింది. ఆ పనులు కూడా ఎక్కడివక్కడే నిలిచిపోయి.. నేటికి ఆ కేబుల్ పనికిరాకుం డా పోయింది. అలానే టీడీపీప్రభుత్వంలో 73శాతం పూర్తైన ఎమ్మెల్యే క్వార్టర్స్, మరియు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల క్వార్టర్స్ (నివాస భవనాల సముదాయం) నిర్మాణాన్ని కూడా ఈ ప్రభుత్వం గాలికి వదిలేసింది.

దాంతో గతంలో నిర్మించినదంతా ఇప్పుడు పనికిరాకుండా పోయింది. నిర్మాణం మధ్యలో వదిలేయడంతో చాలా వరకు భవనాలన్నీ బీటలువారి దెబ్బతిన్నాయి. ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం కూడా మధ్యలోనే నిలిచిపోయింది. ఇలా ఒక్కో అంశంలోని లోపాలను, వేలకోట్ల దుర్వినియోగాన్ని ఈ ప్రభుత్వ వైఫల్యాలను కాగ్ సుస్పష్టంగా తన నివేదికల ద్వారా ఎత్తిచూపింది. గత ప్రభు త్వం రాజధాని అమరావతిలో వివిధ నిర్మాణాలకోసం ఖర్చుపెట్టిన రూ.4,100 కోట్ల సొమ్ము పూర్తిగా వృథా అయినట్టు కాగ్ తేల్చింది.

అనుకున్న ప్రాజెక్టులన్నీ సక్రమంగా పూర్తికావడం కోసం రూ.29వేలకోట్లు అవసరమవుతాయని భావించి, గత ప్రభుత్వం లోనే సీఆర్డీఏ, అమరావతి రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ సంస్థలు బాండ్ల రూపంలో, బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్నాయి. కేంద్రప్రభుత్వం కూడా ఆనాడు రూ.1500కోట్లు కేటాయించింది. సీఆర్డీఏ నిధుల సేకరణకోసం హ్యాపీ నెస్ట్ పేరుతో ఆన్ లైన్లో విక్రయానికి పెట్టిన ప్రైవేట్ ప్లాట్లు అన్నీ కూడా మదుపరులకు అమరావతిపై ఉన్న నమ్మకంతో కేవలం 24గంటల్లోనే అమ్ముడయ్యాయి.

అంతగా ప్రజాదరణ పొంది.. ప్రపంచ నగరంగా ప్రస్థానం ప్రారంభించిన అమరావతిని వైసీపీ ప్రభు త్వం పూర్తిగా విధ్వంసం చేసింది. నాడు రాజధాని నిర్మాణంకోసం చేసిన అప్పుకి వడ్డీనే రాష్ట్ర ప్రభుత్వం రూ.420 కోట్లు కట్టాలి. ఇంత భారీ నష్టానికి బాధ్యులెవరు అంటే ముమ్మాటికీ జగన్ సర్కారే. జగన్ రెడ్డి దురహంకారంతో తీసుకున్న నిర్ణయాలతో నష్టపోయిన వ్యక్తులు, సంస్థలు ప్రజా రాజధాని అమరావతిలో తాము పెట్టిన పెట్టు బడులు వెనక్కు ఇచ్చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారుల్ని ఒత్తిడి చేస్తున్నారు.

విశాఖ కేంద్రంగా జగన్ సాగించాలనుకుంటున్న పాలన మూణ్ణాళ్ల ముచ్చటే
నాలుగున్నరేళ్లుగా అమరావతిలో కాలయాపన చేసిన జగన్ రెడ్డి… అక్కడ నాలుగుశాతంకూడా అభివృద్ధి చేయకుండా దసరా నుంచి తన మకాం విశాఖకు మారుస్తానంటున్నాడు. విశాఖపట్నం నుంచి పాలన చేయాలనుకుంటున్న జగన్ రెడ్డి మురిపెం మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగలనుంది. నవంబర్, డిసెంబర్ అయ్యాక జనవరిలో సార్వత్రిక ఎన్ని కల నోటిఫికేషన్ వస్తే, జగన్ రెడ్డి అక్కడా దుకాణం కట్టేయాల్సిందే.

ఈ మాత్రం దానికే నా జగన్ రెడ్డి అమరావతికి భూములిచ్చిన రైతుల్ని దారుణంగా చిత్రహింసలకు గురి చేశాడు? మూడురాజధానుల జపం చేసి ప్రజల్ని, రాష్ట్రాన్ని నిలువునా ముంచేశాడు. తన మూణ్ణాళ్ల ముచ్చటకోసం రూ.30వేలకోట్ల విలువైన అమరావతిలోని ప్రాజెక్టుల్ని నాశనంచేయడం ద్వారా తన సైకో మనస్తత్వాన్ని ఈ ముఖ్యమంత్రి బయటపెట్టాడు.

స్థానిక సంస్థల పనితీరుపై కాగ్ ఇచ్చిన పెర్ఫార్మెన్స్ ఆడిట్ రిపోర్ట్ వైసీపీ ప్రభుత్వానికి పెద్ద చెంపపెట్టు అనే చెప్పాలి
కాగ్ స్థానిక సంస్థల పనితీరుపై ఇచ్చిన ఫెర్ఫార్మెన్స్ ఆడిట్ రిపోర్ట్ కూడా వైసీపీ ప్రభుత్వానికి పెద్ద చెంపపెట్టు అనే చెప్పాలి. వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఇచ్చిన నిధులు రూ.8వేలకోట్లు వాడుకుందని ఇప్పటికే రాష్ట్ర సర్పంచ్ ల సంఘం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. అలానే వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారం చేస్తున్న ఎన్.ఆర్.ఈ.జీ. ఎస్ నిధుల దుర్వినియోగంపై కూడా కేంద్రానికి ఫిర్యాదులు అందాయి.

74వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఏర్పాటు చేయాల్సిన కమిటీలకు తిలోదకాలిచ్చి మరీ వైసీపీ ప్రభు త్వం పాలన పేరుతో వార్డు సచివాలయ వ్యవస్థను జూలై 2019లో ప్రవేశ పెట్టడాన్ని కాగ్ తీవ్రంగా తప్పుపట్టింది. స్థానికసంస్థల నుంచే స్వయం పాలన సాగాలన్న సదుద్దే శంతో రాజ్యాంగం తీసుకొచ్చిన అధికరణనే ఈ ప్రభుత్వం తుంగలో తొక్కడం నిజంగా చాలా చాలా బాధాకరం.

వార్డు సచివాలయ వ్యవస్థను తీసేసే వరకు రాష్ట్రానికి ఎలాంటి నిధులివ్వమని కేంద్రం చెబితే ఈ ప్రభుత్వం ఆ వ్యవస్థపై పెట్టిన సొమ్మంతా దుర్విని యోగమైనట్టే కదా! రాష్ట్రప్రభుత్వం తన వాటాగా కట్టాల్సిన నిధులు సకాలంలో కట్టనం దున 14 మరియు 15వ ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రానికి రావాల్సిన మొత్తం నిధుల్ని కూడా కేంద్రప్రభుత్వం ఆపేసింది. ఇంత దౌర్భాగ్యపు పరిస్థితి దేశంలో మరే రాష్ట్రంలో లేదు.

కాగ్ నివేదిక కేవలం ఉత్తకాగితాలు మాత్రమే కావని జగన్ రెడ్డి గ్రహించాలి. కాగ్ లేవనెత్తిన ప్రతి ప్రశ్నకు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే. కాగ్ ఫోటోలతో సహా 50 పేజీల నివేదికను రాష్ట్రప్రభుత్వం ముందు ఉంచింది. ఉమ్మడిరాష్ట్ర చరిత్రలో గానీ, గత ప్రభుత్వంలో గానీ ఏనాడూ కాగ్ ఈ స్థాయిలో ఇన్ని తప్పులు ఎత్తిచూపుతూ నివే దిక ఇచ్చింది లేదు.

ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడితే, వైసీపీప్రభుత్వం కనీస బాధ్యతగా కూడా స్పందించలేదు. బుర్రకథలు చెప్పే ఆర్థిక మంత్రి బుగ్గన నోరు కూడా తెరవలేదు. రాష్ట్రాన్ని సమూలంగా నాశనం చేయడానికి జగన్ రెడ్డి కంకణ కట్టుకున్నా డు అనిచెప్పడానికి కాగ్ తాజాగా బయటపెట్టిన రెండు నివేదికలే సాక్ష్యం.” అని అశోక్ బాబు తేల్చిచెప్పారు.

Leave a Reply