Suryaa.co.in

Andhra Pradesh

ప్రజలు ఒక అరాచక శక్తిని తరిమికొట్టారు!

– మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి

మంగళగిరి : వైసీపీ సర్కారు హయాంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా బాల వీరాంజనేయస్వామి ఆరోపించారు. ఈ మేరకు ఆయన మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారు. ఒక అరాచక శక్తిని తరిమికొట్టారు. వైసీపీ అరాచకాలు తట్టుకోలేకే ఎన్డీయే ప్రభుత్వానికి అవకాశమిచ్చారు. రూ. 4లక్షల 40 కోట్లకు పైగా అప్పులు చేశారు. ఈ ఏడు నెలల్లో అయిదేళ్ళ అభివృద్ధిని మేం చేసి చూపించాం. చంద్రబాబు గతంలో ప్రకటించిన సూపర్ 6 లో ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాం.

వైసీపీ నాయకులు వెయ్యి రూపాయలు పింఛన్ పెంచుతామన్నారు. తరువాత విడతలవారీ అన్నారు. ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చారు. వైసీపీ ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచడానికి ఆపసోపాలు పడింది. వైసీపీ ప్రభుత్వం అప్పులు, బకాయిలు మిగిల్చింది. అప్పులు, బకాయిలు ఉన్నప్పటికి రూ. 4 వేలు పింఛన్ పెంచి ఇస్తున్నాం. ఏప్రిల్ నుంచే అరియర్స్ ఇస్తామన్నాం. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా పెన్షన్లు ఇస్తున్నామని మంత్రి బాల వీరాంజనేయస్వామి తెలిపారు.

గౌడ కులస్తులకు మద్యం షాపుల్లో 10 శాతం రాయితీతో షాపులిస్తున్నాం. గీత కార్మికులను ఆదుకుంటున్నాం. గంజాయి రహిత రాష్టం చేస్తున్నాం. లా అండ్ ఆర్డర్ ను కూడా పూర్తిగా కంట్రోల్ లో పెట్టాం. 2047 నాటికి ప్రతి ఒక కుటుంబంలో సాధికారత సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. రాయలసీమలోని చిత్తూరు జిల్లాతోపాటు ప్రకాశం జిల్లాల్లో దారుణంగా వైసీపీ నాయకులు భూ ఆక్రమణలు చేశారు. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వీటిని ఎలిగెత్తి చూపించాం. అవన్నీ అక్షర సత్యాలని ఇప్పుడు అర్థమౌతోంది. ఇంకా బయటికి రావాల్సిన పాపాలు అనేకం ఉన్నాయి. ఒక్కొక్కటిగా బయటికి వస్తాయని మంత్రి వీరాంజనేయస్వామి హెచ్చరించారు.

LEAVE A RESPONSE