Suryaa.co.in

Andhra Pradesh

కృష్ణనదిపరివాహ ప్రాంత ప్రజల అప్రమత్తంగా ఉండాలి

– ప్రజలకు వైఎస్ఆర్సిపి అండగా ఉంటుంది
– ఉల్లిపాలెం-హంసలదీవి మధ్యలో కృష్ణానది కరకట్ట ను పరిశీలించిన,మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు

అవనిగడ్డ: కృష్ణా నది పరివాహ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైయస్ఆర్సీపీ అవనిగడ్డ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తెలిపారు..అవనిగడ్డ నియోజకవర్గంలో ఇప్పటికే పలులంక గ్రామాలువరదనీటి చిక్కుకున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కోడూరు మండలం ఉల్లిపాలెం-హంస దివి మార్గమధ్యంలోని కృష్ణానది కరకట్టబలహీనంగా ఉండటంతో ఆ కరకట్ట ను పరిశీలించారు..అనంతరం ఇరిగేషన్ శాఖ అధికారులతోను చర్చించారు.

ఎగువ నుంచి సుమారు 11 లక్షల క్యూసెక్కులు పైగా వరద నీరు కిందకు వదులుతున్నారని అధికారులు ప్రకటన చేశారని అన్నారు..చాలా ఆందోళనగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.. ప్రజలు ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

కరకట్టబలహీనంగా ఉన్నచోట్ల అధికారులు వెంటనే స్పందించి ప్రతిష్టకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు..వైసీపీ ప్రజానీకానికి ఎప్పుడు అండగానే ఉంటుందని ఆయన అన్నారు..ఈ పరిశీలలో వైసీపీ సీనియర్ నాయకులు కడవకోల్లు నరిసింహారావు, కోడూరు మండల వైఎస్ఆర్సిపి నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE