గంజాయి సాగులో పోలీసులే లబ్ధిదారులు

– మాపై నెపం నెట్టడం దారులు
– మావోల సంచలన లేఖ
విశాఖ ఏజెన్సీలో సాగవుతున్న గంజాయి వ్యవహారంలో తొలి నుంచీ పోలీసులే లబ్థిదారులని మావోయిస్టులు సంచలన విషయం బయటపెట్టారు. గతంలో కూడా అది రుజువయిందని వివరించిన మావోయిస్టులు, ఇప్పుడు కూడా గంజాయి నెపాన్ని తమపై పెట్టడంపై మావోయిస్టు పార్టీ నేత గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
లేఖలో గణేష్.. ‘‘ఏజెన్సీలో మావోయిస్టులు గంజాయి సాగుకు ప్రోత్సహిస్తున్నారని పోలీసులు ప్రచారం చేస్తున్నారు. గంజాయితో షావుకార్లు, దళారులు, పోలీసులు మాత్రమే బాగుపడతారు. గతంలో ముంచుంగిపుట్టు ఎస్ఐ అరుణ్ కుమార్, పాడేరు డీఎస్పీ రాజ్‌కమల్ గంజాయ్ వ్యాపారం చేస్తూ లక్షల సంపాదనతో లబ్ది పొందారు. అదే విధంగా దుంబ్రిగూడ ఎస్ఐ తమ పరిధిలో ఉన్న పంచాయతీ గ్రామాల్లో గంజాయి సాగు చేయించిన సంగతి అందరికీ తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే కిదారి ఘటన వెనుక దుంబ్రి గూడ పోలీస్ స్టేషన్ ధ్వంసం చేయడానికి ఇదే కారణం. గంజాయి సాగు విషయంలో సీఐ, సీఐల నుంచి పై అధికారుల వరకూ బాగుపడుతున్నారు. ఏవోబీ ప్రాంతంలో గంజాయి సాగును అరికట్టాలని ఉద్దేశంతో పరివర్తన పేరిట ఆదివాసి గ్రామాలపై పోలీసుల దాడులను ప్రజలంతా తిప్పికొట్టాలి’’ అని పేర్కొన్నారు.

Leave a Reply