Suryaa.co.in

National

భారీగా తగ్గనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

లీటర్‌కు 4 నుంచి 6 రూపాయలు తగ్గింపు?

పెట్రోల్‌, డీజిల్‌ ధరలను దేశ వ్యాప్తంగా తగ్గించాలని కేంద్రం ప్లాన్ చేస్తోంది. కాగా, చమురు ధరలు ఈ ఏడాది జనవరి నుంచి కనిష్ట స్థాయికి పడిపోయాయి.

దీంతోనే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే, మార్కెట్‌లో ముడిచమురు ధరలు క్రమంగా తగ్గుతున్న సంగతి తెలిసిందే. గత 10 ఏళ్లలో జూన్‌ 2022లో గరిష్ఠంగా బ్యారెల్‌ ధర 115 డాలర్లుగా రికార్డైంది. ప్రస్తుతం 70 డాలర్లకు చేరింది.

అయితే, ముడి చమురు ధరలు గరిష్ఠ స్థాయికి చేరినప్పుడు పెట్రోల్‌, డీజిల్‌ రేట్లను ప్రభుత్వం పెంచింది. చమురుశుద్ధి కంపెనీలకు నష్టాలు వస్తాయనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇలా చేస్తోంది. అయితే, ముడి చమురు ధరలు తగ్గినప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రానున్న తరుణంలో పెట్రోల్‌, డీజిల్‌ రేట్లను తగ్గించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో లీటర్‌కు 4 నుంచి 6 రూపాయలు తగ్గించనున్నట్లు చెబుతున్నారు.

LEAVE A RESPONSE