Suryaa.co.in

Features

కమ్యూనిస్టుల కంపు వెనక నిజానిజాలు

కార్పొరేట్ కంపెనీలు వస్తాయి ప్రజలను దోచేసుకుంటాయి అని మనకు రోజు భూతద్దంలో చూపించే కమ్యూనిస్టుల కంపు వెనక నిజానిజాలేమిటో తెలుసుకుందాము.
Air India అధిపత్యం ఉన్నంత వరకు విమానం ఎక్కటమనేది ఒక మోస్తరు ధనవంతులకు కూడా ఖరీదైన వ్యవహారమే. ప్రైవేట్ ఎయిర్‍లైన్స్ వచ్చాక విమానం చార్జీలు విపరీతంగా తగ్గిపోయాయి. ఆ తరువాత దక్కన్ ఎయిర్‍లైన్స్ వచ్చింది. కొద్దిపాటివాళ్ళు కూడా విమానం ఎక్కగలిగే స్థితికి వచ్చింది.ఇప్పుడు చెప్పండి మనను దోచుకున్నది కార్పొరేట్ కంపెనీనా ప్రభుత్వ కంపెనీనా ?
2001 ప్రాంతం వరకు మనకు BSNL నెలవారీ 300/- కట్టించుకుని 50 ఫ్రీకాల్స్ ఇచ్చేవారు. 2001 లో రిలయన్స్ ఫోన్లు మొదలయ్యాయి. నెలకు 300/- అద్దెకు 275 ఫ్రీకాల్స్ . దెబ్బకు BSNL దిగి వచ్చి 275/- అద్దె కు 300 ఫ్రీకాల్స్ ఇవ్వటము మొదలైంది.ఇప్పుడు చెప్పండి మనను దోచుకున్నది కార్పొరేట్ కంపెనీనా ప్రభుత్వ కంపెనీనా ?
ఇదివరకు ఇంటర్నెట్ అంటే చాలా ఖరీదైన వ్యవహారం. ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్లు వచ్చాయి. ఇంటర్నెట్ చాలా చౌక అయింది. ఇప్పటికీ BSNL 700/- చార్జ్ చేస్తుంటే ప్రైవేట్ కంపెనీలూ 500/- ఇంటర్నెట్ ఇస్తున్నాయి.ఇప్పుడు చెప్పండి మనను దోచుకున్నది కార్పొరేట్ కంపెనీనా ప్రభుత్వ కంపెనీనా ?
టాటా డొకోమో వచ్చే వరకూ మొబైల్ కాల్స్ రేట్లు ఉండేయి. డొకోమో వచ్చిన తర్వాత సెకనుకు పైసా స్కీము తో మొబైల్ కాల్స్ అనేవి బాగా చౌకగా మారాయి. జియో వచ్చిన తర్వాతమొబైల్ కాల్స్ చార్జీలు విపరీతంగా తగ్గాయన్నది మనకు అనుభవమేగా !ఇప్పుడు చెప్పండి మనను దోచుకున్నది కార్పొరేట్ కంపెనీనా ప్రభుత్వ కంపెనీనా ?
జియో వచ్చేవరకూ మొబైల్ ఇంటర్నెట్ ధనికులు కూడా భరించలేని స్థితిలో ఉండేది. జియో వచ్చిన తర్వాత అతి సామాన్యుడు కూడా మొబైల్ ఇంటర్నెట్ వాడే స్థితికి దిగి వచ్చింది.ఇప్పుడు చెప్పండి మనను దోచుకున్నది కార్పొరేట్ కంపెనీనా ప్రభుత్వ కంపెనీనా ?
ఇంకో ఉదాహరణ. మనలో ఎంతమందిమి దూరదర్శన్ చూస్తున్నాము ? దూరదర్శన్ ప్రోగ్రామ్ ల సంగతి ఏమిటి? ఎంత చచ్చేవాళ్ళము ఆ ప్రోగ్రాం లు చూడలేక. ప్రైవేట్ చానెల్స్ వచ్చిన తర్వాతేగా దూరదర్శన్ ప్రోగ్రామ్ లు నుండి విముక్తి కలిగింది..
ఇప్పుడు చెప్పండి మనను దోచుకున్నది కార్పొరేట్ కంపెనీనా ప్రభుత్వ కంపెనీనా ?
ప్రభుత్వరంగ సంస్థలలో కనీసం ఒక్కటైనా లాభాలతో నడుస్తుందా ?
వెంటనే మనకు LIC గుర్తు చెస్తారు. మరి LIC కి మనం కట్టే ప్రీమియంకూ తిరిగి మనకు వచ్చే బోనస్ కూ సంభంధం ఉందా ? LIC ఏమైనా అధిక బోనస్ లు ఇచ్చి ప్రజాసేవ చేస్తున్నదా ? మరి దాన్ని దోపిడీ అనరా ?
ఇప్పుడు చెప్పండి మనను దోచుకున్నది కార్పొరేట్ కంపెనీనా ప్రభుత్వ కంపెనీనా ?
పోనీ వాటి సంగతి అలా పెడదాము
మనం రోజూ వాడే పాలు సంగతి చూసుకుందాము. ప్రభుత్వం విజయా పాల ధర పెంచితేనే ప్రైవేట్ పాల ధర పెరుగుతుంది. ప్రభుత్వం పెంచితేగాని ప్రైవేట్ రంగంలో పాల ధర పెరగదు.
ఇప్పుడు చెప్పండి మనను దోచుకున్నది కార్పొరేట్ కంపెనీనా ప్రభుత్వ కంపెనీనా ?
RTC టిక్కెట్ ధర పెంచితేనే ప్రైవేట్ బస్సులు టిక్కెట్ ధరలు పెంచుతారు. లేకపోతే లేదు. టిక్కెట్ ధర సంగతి అలా పెట్టండి. బస్ ల మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో మనకు తెలియని సంగతా.
ఇప్పుడు చెప్పండి మనను దోచుకున్నది కార్పొరేట్ కంపెనీనా ప్రభుత్వ కంపెనీనా ?
బెజవాడలో ట్రైల్ బేసిస్ మీద 1980 ప్రాంతాల్లో రెండంటే రెండు RTC సిటీ బస్ లు ప్రవేశపెట్టారు. అంత క్రితం వరకూ టిక్కెట్ ఎక్కిన స్టాప్ నుండి దిగిన స్టాప్ వరకూ లెక్క వేసి టిక్కేట్ కొట్టేవారు. RTC రెండు బస్ లు వచ్చాయి. ఫలానా చోట నుండి ఫలానా చోటకు ఒక స్టేజ్ అని నిర్ణయించారు. ఆ దెబ్బతో వాళ్ళ క్లాసిఫికేషన్ ప్రకారం స్టేజీ ఆఖ్హరు స్టాప్ లో ఎక్కి తరవాత స్టేజ్ ముందరి స్టాప్ లో దిగిన, ఎక్కిన స్టేజి మొదటి స్టాప్ నుండి తరువాతి స్టేజ్ ఆఖరు స్టాప్ వరకు లెక్క కట్టి బాదటము మొదలైంది. అదే పద్దతి ప్రైవేట్ సిటీబస్ ఆపరేటర్లు కూడా మొదలెట్టి టిక్కెట్ ధరలు RTC తో పాటు పెంచేసారు. అలాగా RTC తడవకొకసారి టికెట్ ధర పెంచేవారు, ఆ దెబ్బతో ప్రైవేట్ బస్సులు కూడా పెంచేసేవారు.
ఇప్పుడు చెప్పండి మనను దోచుకున్నది కార్పొరేట్ కంపెనీనా ప్రభుత్వ కంపెనీనా ?
ఇలా చెప్పుకుంటూ పోతే అంతం ఉండదు.
ప్రభుత్వాఫీసుల్లో ప్రభుత్వోద్యోగులేమీ తీరి కూర్చుని , వచ్చిన జనానికి బ్రహ్మాండమైన నిస్వార్ధ సేవలేమీ అందించరు. ప్రభుత్వోద్యోగి కి లంచం ఇవ్వనిదే పని జరగదు. లంచం లేని చోట పనులు జరగవు.
ప్రభుత్వ రంగ సంస్థల తీరుతెన్నులు మనకు తెలియనివి కావు. అన్నీ పెద్ద పెద్ద తెల్ల ఏనుగులు. ఈ తెల్లఏనుగులును పోషింఛటానికి అయ్యే ఖర్చు గోళ్ళూడగొట్టి జనం దగ్గర పన్నుల రూపంలో వసూలు చేసేదే. ఆ ఏనుగుల ఖర్చు మనము భరించేదే .
జనంకు ఉద్యోగకల్పన చేస్తున్నది కార్పొరేట్ కంపెనీలే. ప్రభుత్వరంగంలొ నియామాకాలు ఎప్పుడో కొండెక్కిపోయాయి. ఇన్ఫోసిస్ అయినా టాటా గ్రూప్ అయినా రిలయన్స్ , దివిలాబ్స్ అయినా మరొకటైనా మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తున్నది కార్పొరేట్ కంపెనీలే. కమ్యూనిస్టులు కాదు.
ఇన్ని పొలికేకలు పెడుతూ గుండెలు బాదుకునే రంగు వెలిసిపోయిన బూర్జువా కమ్యూనిస్టుల యాజమాన్య దేశం చైనా లో కూడా ఉన్నది కార్పొరేట్ కంపెనీలే. నేతిబీరకాయలో నెయ్యీ, కమ్యూనిస్టు దేశాల్లో కమ్యూనిజం ఒక్కటే. నేతిబీరకాయలో నెయ్యి ఉండదు. కమ్యూనిస్ట్ దేశాల్లో కమ్యూనిజమూ ఉండదు.
కనుక కార్పొరేట్లు వచ్చేసి మనను దోచేసుకుని గోచీ లాగేసుకుంటారని విదేశీ బంటు కమ్యూనిస్టుల దిగజారుడు రాజకీయ పార్టీల అవకాశవాద దుష్ప్రచారాలకు భయపడనవసరం లేదు.

– సంపత్‌రాజు (ఏఎస్ రాజు)

LEAVE A RESPONSE