జల జీవన మిషన్ క్రింద ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి

-నాలుగు వేల కోట్లు కోల్పోయే ప్రమాదం
రాజ్యసభ సభ్యులు, రాష్ట్ర దిసా కమిటీలో కేంద్ర ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు  కేంద్ర జలశక్తి మంత్రిని మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికీ కుళాయి ద్వారా మంచి నీటి (జలజీవన్) పథకం వివరాలు అడగ్గా అనేక విస్మయానికి గురిచేసే విషయాలు తెలియవచ్చాయి.
రాష్ట్రానికి జలజీవన్ మిషన్ పథకం కింద కేంద్రం నుంచి కేటాయించబడిన నిధుల వివరాలు:
2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్రం చే రాష్ట్రానికి 372.64 కోట్లు కేటాయించబడి పూర్తిగా విడుదల చేయగా, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 121.62 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది.
2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్రం రాష్ట్రానికి 790.48 కోట్లు కేటాయించగా రాష్ట్రం కేవలం 297.62 కోట్లు మాత్రమే డ్రా చేయడం జరిగింది.
2021- 22 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్రం చే అత్యధికంగా 3180 2.88 కోట్లు కేటాయించగా ఇంతవరకూ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా డ్రా చేయలేదని, కేవలం 46.8 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందని మంత్రి తెలియజేశారు.
2019-20 మరియు 20-21 సంవత్సరానికి గాను కేంద్రం తన వాటాను రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తాను చెల్లించవలసినటువంటి 453.66 కోట్లను ఇంతవరకు చెల్లించడం జరగలేదు.
2022 మార్చిలోపు రాష్ట్ర ప్రభుత్వం తాను చెల్లించవలసిన నిధుల విడుదలలో జాప్యం చేసినట్లయితే  నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికిగాను జల జీవన్ మిషన్ పథకం కింద కేంద్రం కేటాయించిన 3,183 కోట్లు మురిగిపోతాయిని తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని రంగాల్లోనూ వేల, కోట్ల నిధులను అనేక పథకాల ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించి చేస్తున్నటువంటి సహాయాన్ని కూడా అంగీకరించలేని స్థితిలో ఉండటం రాష్ట్ర ప్రభుత్వ చేతకానితనానికి, నిర్లక్ష్యానికి నిదర్శనమని ఎంపీ జివీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని, రాష్ట్ర స్థాయి దిశ కమిటీలో కేంద్ర ప్రతినిధిగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తానని రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు.