చెత్తను తొలగించడానికి రూ.22 కోట్లు కొటేషన్ తో ఒక కంపెనీకి అప్పగించాలని ఈవో, జెఇవోల ప్రయత్నం
చైర్మన్ వ్యతిరేకిస్తే ఆయనపైన ఈవో, జెఇవోల కక్ష
– ఛైర్మన్ ను ఏకాకి చేశారు
(మందడపు కృష్ణ)
తిరుపతి ఘటన లో టిటిడి ఈవో, జెఇవో ని వెంటనే సస్పెండ్ చేయాలి.లేకపోతే చంద్రబాబు ప్రతిష్ట దిగజారిపోవడం ఖాయం. లడ్డూ వ్యవహారంలో వచ్చిన పేరు ఈ సంఘటనతో కొట్టుకుపోయింది చిన్నా చితకా అధికారులను సస్పెండ్ చేసి మమ అనిపిస్తే సరిపోదు.
ఈవో, జెఇవోలు ఒకటై ఛైర్మన్ ను ఏకాకి చేశారు. ఈవో, జెఇవోలు ఏకపక్షంగా వ్యవరిస్తున్నారు. గత ఏన్నికల్లో టిడిపి పార్టీకి వందల కోట్లు ఇప్పించానని జెఇవో వెంకయ్య చౌదరి అందరికీ చెబుతున్నారట. ఇటీవల చంద్రబాబును న్యూ ఇయర్ ని కలవడానికి ఈవో, జెఇవోలు వచ్చినప్పుడు కనీసం ఛైర్మన్ కి సమాచారం కూడా ఇవ్వలేదు.
కొండపైన పేరుకున్న చెత్తను తొలగించడానికి రూ.22 కోట్లు కొటేషన్ తో ఒక కంపెనీకి అప్పగించాలని ఈవో, జెఇవోలు ప్రయత్నం చేశారు…అయితే దాన్ని చైర్మన్ వ్యతిరేకిస్తే ఆయనపైన ఈవో, జెఇవోలు కక్ష కట్టారు.