పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగ పలితంగానే భాషా ప్రయక్త రాష్ట్రాలకు నాంది

– దేశాన్ని ఏకం చేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ కే దక్కుతుంది
– నారా చంద్రబాబు నాయుడు
దేశం కోసం, ప్రజల కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకోవటం మన బాధ్యత అని, వారి పోరాట స్పూర్తితో సమాజహితం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన పొట్టి శ్రీరాములు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ల వర్ధంతి కార్యక్రమంలో ‎చంద్రబాబు నాయుడు పాల్లొన్నారు.ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ…..
అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగ పలితంగానే దేశంలో భాషా ప్రయక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాందిపడింది.నాడు మదరాసీలుగా పిలువడుతున్న తెలుగువారికి ప్రత్యేక గుర్తింపు ‎ప్రత్యేక రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాములు ఉద్యమించారు. ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులు పొట్టి శ్రీరాములు, ఆయన్ను స్మరించుకోవడం తెలుగువారి బాద్యత. ‎ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 అక్టోబర్ 19న ‎నిరాహారదీక్ష ప్రారంభించి..ప్రాణాలు పోతాయని తెలిసినా భయపడకుండా దీక్ష కొనసాగించి 1952 డిసెంబర్ 15 అర్ధరాత్రి పొట్టి శ్రీరాములు,తన ఆశయసాధనలో ప్రాణాలర్పించి అమరజీవి అయ్యాడు. ఆయన ప్రాణత్యాగం పలితంగానే కేంద్రం దిగివచ్చి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది.
సర్దార్ వల్ల బాయ్ పటేల్ దేశ స్వాతంత్య్రం కోసం ఉక్కు సంకల్పంతో పోరాటం చేసి ఉక్కు మనిషిగా చరిత్రలో నిలిపోయారు.‎ దేశం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. చిన్నచిన్న రాజ్యాలుగా ఉన్న దేశాన్ని తన సమర్థతతో, శక్తియుక్తులతో ఏకం చేసి అఖండ భారత నిర్మాణం చేసిన చేసిన ఘనత సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కే దక్కుతుందన్నారు. పొట్టి శ్రీరాములు, సర్ధార్ వల్లభాయ్ పటేల్ ల స్పూర్తితో ప్రతి ఒక్కరూ ‎సమాజహితం కోసం పాటుపడాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పంచుమర్తి అనురాధ, ఏవీ రమణ, దారపనేని నరేంద్ర, డూండి రాకేష్, బుచ్చి రాం ప్రసాద్, బ్రహ్మoగుప్త, బసుబాబు, సత్యం, వెంకట్, ఐనవోలు రాధ, పర్చూరి హరి, అరుణ తధితరులు పాల్గొన్నారు.