రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్లపై ఛీప్ గా బిహేవ్ చేస్తోంది

Spread the love

– నీలో ఉప్పుంటే సీఎం పదవినీ ఔట్ సోర్సింగ్ గా మార్చు
– అఖండ, భీమ్లానాయక్ విజయోత్సహాన్ని చూసైనా కళ్లు తెరవాలి
– టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్

నేడు రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్లపై దిగజారి వ్యవహరిస్తోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ పేర్కొన్నారు. శనివారం మంగళగిరిలోని టీడీజీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు … ఒక పక్క అన్నింటిని ఔట్ సోర్సింగ్ చేస్తున్నారు. ఇసుక వ్యాపారాన్ని ఔట్ సోర్సింగ్ కు ఇచ్చారు. ప్రభుత్వం నిర్వహించాల్సిన రంగాలు ఔట్ సోర్సింగ్ వ్యాపారం కింద చేసుకుంటూ పోతున్నారు.

తిరుమల తిరుపతి టికెట్లను ఔట్ సోర్సింగ్ కు ఇచ్చారు. ముఖ్యమంత్రి పదవి కూడా ఔట్ సోర్సింగ్ కు ఇస్తే బాగుంటుంది. రాష్ట్రానికి పట్టిన చీడ, పీడ వదలిపోతుంది. ఎంతకాలం ఈ దౌర్భాగ్యపు పరిపాలన. ఈ పరిపాలనను గాడిలో పెట్టే సత్తా సరుకులేక ఛీప్ ట్రిక్కులు ప్లే చేస్తున్నారు. జనాన్ని బురడీ కొట్టిస్తూ, గారడీ చేస్తూ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. ఆదాయం లేని రాష్ట్రంగా, ఉద్యోగాలు ఇవ్వలేని రాష్ట్రంగా, భావితరాలకు భవిష్యత్తును చూపించలేని రాష్ట్రంగా, బూడిద రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని మార్చేశారు.

దగా మోసం రెడ్డి.. నీలో ఉప్పుంటే సీఎం పదవినీ ఔట్ సోర్సింగ్ గా మార్చు. తికమక పరిపాలన వద్దు. 79 సలహాదారులు చచ్చు సలహాలే ఇస్తున్నారు. – ప్రజలు.. తికమక పరిపాలన వద్దంటున్నారు- భూమి లోపల, పైన, గాలిలో, నీటిలో ఏమున్నా దోచుకొని దాచుకొనే మనస్తత్వం జగన్ ది. జగన్ పాలనలో చెప్పుకోదగ్గ ఒక్క అభివృద్ధి పని లేదు.

పెద్ద పెద్ద స్టార్ లను తన వద్దకు పిలిపించుకొని వారిని గంటలకొద్దీ నిరీక్షణ చేయించారు. రాబోయే రోజుల్లో సులభ్ కాంప్లెక్స్ లను కూడా పొరుగు సేవల కింద మార్చి ఇందులో కూడా జోక్యం చేసుకున్నా ఆశ్చర్యపోనక్కరలేదు. సైకిల్ స్టాండ్లు, ఆటోస్టాండ్లు, రిక్షా స్టాండ్లను కూడా నిర్వహించినా ఆశ్చర్యపోనక్కరలేదు. సొంత ఖజానాను నింపుకోవడానికే చూస్తుంటారు. రాష్ట్రాన్ని దివాళా తీశారు. ప్రతిపక్షం మాట్లాడితే పీక నొక్కే పరిస్థితి ఉంది. అక్రమ కేసులు, అరెస్టులు, అర్ధరాత్రి అరెస్టులతో భయపెట్టలేరు. పూచికపుల్లను కూడ వదలరు.

ఏ సీఎం.. సినిమా టికెట్ల విషయంలో జోక్యం చేసుకోలేదు, జగన్ తప్ప. జగన్ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారు. సీఎం పదవి కూడా పొరుగు సేవ(ఔట్ సోర్సింగ్)గా మారిస్తే పీడ వదలుతుంది. అఖండ సినిమా విషయంలే ఏమీ చేసుకోలేకపోయారు. భీమ్లానాయక్ సినిమాను ఏమీ కదిలించలేకపోయారు. బోర్లా పడ్డారు. ఇది స్టార్ ఇమేజ్. సినిమా టికెట్ల ధరలను పెంచి ప్రజల గుండెల్లో చోటు చేసుకున్న నాయకులను దెబ్బతీయాలనుకుంటున్నారు. సినిమాల ప్రభావాన్ని తగ్గించాలని చూశారు. అఖండ, భీమ్లానాయక్ విజయోత్సహాన్ని చూసైనా కళ్లు తెరవాలి. జగన్ ఇంట్లో కూర్చొని అంతా తన చేతుల్లో ఉందని భ్రమపడుతున్నాడు.

జగన్ ను ఇంటికి పంపడానికి ప్రతి ఆంధ్రుడు కంకణం కట్టుకొని ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు. ఆంధ్రలో జగన్ కు తలదాసుకోవడానికి నీటి మడుగు కూడా దొరకదు. జగన్ కు ఇవి ఆఖరి ఘడియలు. ప్రజలు పిచ్చోళ్లు, అమాయకులు కాదు, విజ్ఞులు. జగన్ పొరుగు సేవ (ఔట్ సోర్సింగ్)ల ఆలోచన మానుకోవాలి. తెలుగుదేశం పార్టీ తరపున మరొకసారి ఈ సినిమా టికెట్లపై జోక్యం చేసుకోవద్దని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ డిమాండ్ చేశారు.

Leave a Reply