మోదీకి ప్రపంచం జేజేలు

– ప్రపంచమంతా మోదీ గొప్పదనాన్ని పొగుడుతున్నారు

ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో ఉన్న ఉక్రెయిన్.. శాంతి కోసం మోదీని ప్రార్ధిస్తోంది. ప్రపంచంలో ఎవరిమాటైనా పుతిన్ వింటాడంటే అది ఒక్క మోదీ మాటమాత్రమే అని దీనంగా అభ్యర్థించాడు. పుతిన్ ఉక్రెయిన్ ని లొంగదీసుకోవాలనే ఆలోచన మీద గట్టిగా కూర్చుని ఉన్నాడు. ముందు ప్రగాల్భాలు పలికిన అమెరికా, నాటో దేశాలు 40 గంటలు దాటినా మాటల దగ్గరే ఆగిపోయాయి. నాటో దేశాలపై ఉక్రెయిన్ పెట్టుకున్న నమ్మకాలు, ఆశలు వృధా అయిపోయినట్టే కనిపిస్తోంది.

పుతిన్ కి ఎవరు ఎదురు చెప్పినా వాళ్లపైకి కూడా దూకే ఆలోచనలో ఉన్నాడు.కెనడా, ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్ లు ఎన్ని కఠిన ఆంక్షలు విధించినా రష్యా లో చలనం లేదు. పైగా ఇంకా రెచ్చిపోయి తెగబడుతోంది. కారణం రష్యా అత్యంత శక్తివంతమైన, సంపన్నమైన అత్యధిక గ్యాస్, పెట్రోల్ నిల్వలు కలిగిన దేశం. అది సప్లై చేసే గ్యాస్ పై చాలా దేశాలు ఆధారపడి ఉన్నాయి.

pm-narendra-modiవాణిజ్య పరంగా ఉక్రెయిన్ భారత్ కి బలమైన భాగస్వామి. ముఖ్యంగా వంటనూనెల కోసం భారత్ ఉక్రెయిన్ ఫై పూర్తిగా ఆధారపడి ఉంది.రక్షణ పరంగా రష్యా భారత్ కి చాలా బలమైన మిత్రుడు. భారత్ కొనే ఆయుధాలు, యుద్ధ నౌకలు 80%పైగా రష్యా నుండి రావాల్సిందే. అందుకే భారత్ మొదట్లోనే తటస్థ వైఖరి ప్రకటించిoది. కరవమంటే కప్పకి కోపం, వదలమంటే పాముకి కోపం అనే స్థితిలో భారత్ నిలబడిపోయింది. అందుకే ఇరు దేశాల సహకారంతో, ముందు అక్కడున్న భారతీయుల్ని సురక్షితంగా తెచ్చే ప్రయత్నాన్ని విజయవంతంగా చేసింది. భారతీయ విద్యార్థుల్ని ఈ నెల 15 నాటికే తిరిగి రమ్మంటే వాళ్ళు తేలికగా, చాదస్తం అంటూ కొట్టిపారేశారు. ఇప్పుడు బాధపడుతున్నారు.

అయినా ఇబ్బంది లేదు. మోదీ గారుంటే దేశానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రపంచం కీర్తిస్తున్నా.. కాంగ్రస్, కమ్యూనిస్ట్, ప్రాంతీయ పార్టీలు దాన్ని జీర్ణించుకోలేక లోపలున్న కుళ్ళంతా కక్కుతున్నారు. ఇంతవరకు ఎలాంటి వాక్సిన్ తయారుచేయని భారత్ లో, సొంతగా 1+1=రెండు, భాగస్వామ్యం లో ఒకటి అంత్యంత సమర్ధవంతంగా కనిపెట్టేలా చేసారు. వాక్సిన్ ఉత్పత్తికి మొదట్లో ముడి సరుకు ఇవ్వడానికి ఒప్పుకోని అమెరికా మెడలు వంచి, దాదాపు 180 కోట్లవాక్సిన్ లు తన ప్రజలకు అందించి.. అనేక పేద దేశాలకు, శత్రుత్వం వహించి ఇబ్బంది పెట్టిన పొరుగు దేశాలకు ఉచితంగా ఇచ్చారు.

భారత్ వాక్సిన్ గురించి ప్రపంచదేశాలు ఆశ్చర్యపోయి అభినందిస్తే, దేశంలో ఉన్న దేశద్రోహులు వాక్సిన్ ఉత్పత్తిని అడ్డుకునే ప్రయత్నాలు చేసారు, ఎగతాళి చేసి అవమానపడి తల దించుకున్నారు, మేము భారత్ తయారీ వాక్సిన్ వేసుకోమని పత్రికల్లో, tv ల్లో ప్రగాల్భాలు పలికి.. ప్రాణభయంతో చచ్చి నట్టు వాక్సిన్ తీసుకున్నారు. భారత్ లో వాక్సిన్ తయారీ, పంపిణి, గుర్తింపు సర్టిఫికెట్ ఇవ్వడం చాలా అద్భుతం.

ప్రాంతీయపార్టీలు, కాంగ్రెస్ కమ్యూనిస్ట్ లు వాక్సిన్ ని ప్రతి స్టేజ్ లో అడ్డుకోబోయి బోర్లా పడ్డారు. అదేకాదు వీళ్ళు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చాలా కాలం వరకు భారత్ పై దాడిచేసి ఆక్రమించుకోమని పాకిస్తాన్, చైనా, టర్కీలను బతిమాలి భంగపడ్డారు. ఒకప్పుడు విదేశీ మారకద్రవ్యం కోసం దేశంలో ఉన్న బంగారాన్ని తాకట్టుపెట్టే స్థితి ఉంది. విదేశీ మారకద్రవ్యం లేక పెట్రోల్ ని కేవలం అప్పుమీద మాత్రమే తెచ్చి.. తలకుమించిన వడ్డీ భారం పెట్టిన స్థితిలో ఉన్న భారత్ , ఇప్పుడు భారత్ లో ఒక చిన్న బంగారం కుదవపెట్టుకునే ముత్తుట్ ఫైనాన్స్ దగ్గర పాకిస్తాన్ ప్రభుత్వం దగ్గర ఉన్న బంగారం కంటే ఎక్కువవుంది.

పెట్రోల్ డీజిల్ మీద,రూపాయి పెంచారు. అర్ధరూపాయి పెంచారు అనే వాళ్ళ నోరు మూయిస్తూ .. ఒక్కసారిగా పెట్రోల్ పై 5 రూపాయలు, డీజిల్ పై 10 రూపాయలు తగ్గించి, ప్రాంతీయపార్టీలు తమ వాటలో ఎంత తగ్గిస్తారు అంటూ సవాల్ విసిరారు. కరోనా నేపథ్యంలో ప్రపంచం మొత్తం ధరలు భారీగా పెరిగితే.. భారత్ లో స్థిరంగా ఉన్నాయి. కరోనా వ్యాపించకుండా ఎక్కడివారు అక్కడే ఉండమని, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని కేంద్రం చెప్పిన నిమిషాల్లోనే.. ప్రాంతీయపార్టీలు వలసకూలీల్ని ఒక కుట్ర పూరిత ఆలోచనతో భయపెట్టి, పారిపోయెలా చేశాయి.

ఫలితంగా కోవిడ్ పంజా విసిరింది. దాని నుండి తెరుకునే లోపుగా 2 wave వచ్చింది. మార్ఫింగ్ ఫోటోలు, కృత్రిమ కొరతలు సృష్టించి, కేంద్రాన్ని అంతర్జాతీయ సమాజంలో అవమాన పరచాలనుకున్న ప్రాంతీయ పార్టీల కుట్ర, 2 రోజులకూడా నిలవలేకపోయింది. క్షణాల్లో అన్ని ఏర్పాట్లు చేసి మోడీ దేశద్రోహులకు సినిమా చూపించారు. ఇంతటి విపత్కర, ప్రతికూల పరిస్థితుల్లో కూడా భారత్ ఆర్ధిక పరిస్థితి జీడీపీ ప్రపంచం మెచ్చుకునే రీతిలో ఉన్నాయంటే అది మోదీ చాణుక్య సిద్ధాంతం అనుసరణ.

తనపై దాడి చేసినా చిరునవ్వుతో రావడం ప్రపంచాన్ని నివ్వేరపోయేలా చేసింది. రాక్షస చైనా దేశాన్ని కబళించాలని ప్రయత్నించి ఒకడుగు ముందుకి రెండడుగులు వెనక్కి వేసి, మోదీ దెబ్బకు బేంబేలెత్తిపోయింది. 2014 వరకు భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం అని, మా తాత చదివాడు, మా నాన్న చదివాడు. అదే ఇప్పుడు నేను చదువు తున్నాను. రేపు నా పిల్లలు చదువుతారు భారత్ అభివృద్ధి చెందిన దేశం అని ఎప్పుడు అంటాము అని సినిమాల్లో చెప్పిన డైలాగ్ కు సమాధానం గా.. మోదీ పరిపాలన మొదలైన 8 సంవత్సరాల్లో, ఇప్పుడు భారత్ ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో 4 వ స్థానం లో ఉంది.

పక్కనున్న శ్రీలంక పెట్రోల్ కొనడానికి డబ్బులేక, వచ్చిన పెట్రోల్ ని ఓడరేవుల దగ్గరే ఆపింది. అక్కడ గతంలో ఉన్న ధరలకి 5 రెట్లు పైగా ధరలు పెరిగాయి. పక్కనున్న శత్రుదేశం పాకిస్తాన్ లో గ్యాస్ సిలెండర్ ధర 12 వేలు, బియ్యం 300 కూరలు, నూనెలు, ఇతర సరుకులు మనకి రెట్టింపు ధరలున్నాయి. అత్యంత ధనిక, విలాసవంత, గొప్ప వైజ్ఞానిక దేశమైన కేవలం 45 కోట్లు జనాభా ఉన్న అమెరికా.. తన ప్రజలచేత కరోనా టీకాలు వేయించుకునేలా చేయలేక, 10 లక్షల మరణాల్ని చూసింది. 140 కోట్లున్న భారత్ ప్రతి ఒక్కరికి వాక్సిన్ వేసి, కరోనని నియంత్రించిది. 3 వేవ్ ని అతి సులభంగా అతి తక్కువ మరణాలు, మందులతో ఎదుర్కొంది. that is మోడీస్ భారత్.

– పెంజర్ల మహేందర్ రెడ్డి
ఓసి సంఘం జాతీయ అధ్యక్షుడు

Leave a Reply