చిక్కడపల్లి : బ్యూటీపార్లర్ కు వెళ్లిన గృహిణి అదృశ్యమైన ఘటన చిక్కడపల్లి పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది .ఎస్ఐ ప్రేముమార్ తెలిపిన వివరాల మేరకు ..
దోమలగూడ గగనహల్లో నివసించే జి . దుర్గాప్రసాద్ , భార్గవి ( 26 ) భార్యాభర్తలు . భార్గవి బుధవారం సాయంత్రం 5.30 సమయంలో సమీపంలోని బ్యూటీపార్లర్కు వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లింది.
సాయంత్రం 6.30 కు భార్గవి ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో దుర్గాప్రసాద్ బ్యూటీపార్లర్కు వెళ్లి వాకబు చేశాడు . ఆమె అక్కడ లేకపోవడంతో బంధువులు , స్నేహితులను సంప్రదించాడు.ఫలితం లేకపోవడంతో దుర్గాప్రసాద్ చిక్కడపల్లి పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు . ఆమె ఆచూకీ తెలిసిన వారు పోలీస్ స్టేషన్ సమాచారం ఇవ్వాలని ఎస్ఐ ప్రేమకుమార్ కోరారు .