Suryaa.co.in

Andhra Pradesh

యోగ యజ్ఞాన్ని విజయవంతం చేయాలి

* ప్రజలకు మంత్రి సత్యకుమార్ యాదవ్ విజ్ఞప్తి

విశాఖపట్నం: రాష్ట్ర ప్రజల ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా యోగకు ప్రాచుర్యం కల్పించే దిశగా ఒక యజ్ఞంలా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నెల రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. ఈ దిశగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమం శనివారం నాడు పతాక స్థాయికి చేరనున్నదని,ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే అంతర్జాతీయ యోగ దినోత్సవ కార్యక్రమాలలో ప్రజలు భారీ ఎత్తున పాల్గొనాలని మంత్రి పిలుపునిచ్చారు.

యోగాభ్యాసం వలన ప్రజారోగ్యానికి కలిగే బహుళార్ధ ప్రయోజనాల దృష్ట్యా ఈ దిశగా ప్రజల్లో చైతన్యం కలిగించటానికి 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాన వేదిక అయిన మన రాష్ట్రం ప్రజల భాగస్వామ్యం విషయంలో ముఖ్యమంత్రి ఆలోచనలు మేరకు పలు రికార్డులు నెలకొల్పేలా గత నెల రోజులుగా ప్రజల్లో చైతన్యం కల్పించటానికి ప్రణాళిక బద్ధమన కృషి జరిగిందని మంత్రి తెలిపారు.ఈ ప్రయత్నం తప్పక విజయం సాధిస్తుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.

 

LEAVE A RESPONSE