Suryaa.co.in

Andhra Pradesh

స్కూళ్ల‌లో టీచ‌ర్లు లేరు…చాక్ పీసుల‌కి దిక్కులేదు

– టెన్త్ ఫెయిల్ జగన్.. నీకు ఆక్స్ ఫర్డ్, కేంబ్రిడ్జ్ లాంటి భారీ డైలాగులు అవసరమా?
– అరకులోయ డిగ్రీ కాలేజ్ లో పైకప్పు కూలింది
– నారా లోకేష్

చంచల్ గూడా జైల్ స్టూడెంట్ నంబర్ 6093 ఈ మధ్య జబర్దస్త్‌ కామిడీ చేస్తున్నాడు. మన యూనివర్సిటీలు ఆక్స్ ఫర్డ్, కేంబ్రిడ్జ్ తో పోటీపడాలి అంటున్నాడు. అది బిల్డప్. రియాలిటీ ఏంటో తెలుసా? అరకులోయ డిగ్రీ కాలేజ్ లో పైకప్పు కూలింది. అక్కడ ఉన్న స్టూడెంట్స్ పరిగెత్తి ప్రమాదం నుండి తప్పించుకున్నారు.

పులిరాముడిగూడెంలోని గిరిజన సంక్షేమ హాస్టల్ లో నాలుగో తరగతి చదువుతున్న అఖిల్ ని హత్య చేశారు. స్కూళ్ల‌లో టీచ‌ర్లు లేరు…చాక్ పీసుల‌కి దిక్కులేదు. యూనివర్సిటీలను వైసిపి కార్యాలయాలుగా మార్చేశాడు.యూనివర్సిటీలకు చెందిన రూ.150 కోట్ల నిధులు పక్కదారి పట్టించాడు. కొత్తగా ఒక ప్రొఫెసర్ ని నియమించలేదు. టెన్త్ ఫెయిల్ జగన్ నీకు ఆక్స్ ఫర్డ్, కేంబ్రిడ్జ్ లాంటి భారీ డైలాగులు అవసరమా?

LEAVE A RESPONSE